భద్రాచలం : భద్రాచలంలో నిర్వహిస్తున్న ఎంపీహెచ్‌ఏ (ఎఫ్) శిక్షణకు అర్హులైన గిరిజన మహిళా అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ ఇంచార్జి పీవో రాజీవ్ గాంధీ హన్ముంతు తెలిపారు. 2017–18 సంవత్సరానికి గాను మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గాను ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఇంటర్ ఏ గ్రూపు చదివిన వారైనా ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 17 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు.
అడ్మిషనల్ కోసం http:chfw.telengana.gov.in వెబ్ సైట్‌లో ధరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, వాటిని పూర్తి చేసి, భద్రాచలంలోని ఎంపీహెచ్‌ఏ ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు అందజేయాలన్నారు. ఈ నెల 17 సాయంత్రం 5గం.ల్లోపు అందిన ధరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందని, అర్హులైన గిరిజన మహిళాఅభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎంపీహెచ్‌ఏ(ఎఫ్) శిక్షణకు ధరఖాస్తు చేసుకొండి
Published Fri, Jun 9 2017 6:20 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
Advertisement
Advertisement