MPPs
-
నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
మనం చంద్రబాబులాగా కాదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారని.. కానీ 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీలను ఉద్దేశించి ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..‘‘వైఎస్సార్సీపీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ. పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకుని దాన్ని అమలు చేసే పార్టీ మనది కాదు. అభిమానులతో నడిచే పార్టీ ఇది.. అందరి అభిప్రాయాలను తీసుకుని నడిచే పార్టీ. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఐదారు నెలలుగా అందుకు ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చింది. 2019 తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్లపాటు అసలు కనపడలేదు. తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారు. మనం ఎప్పుడూ జనంలోనే ఉన్నాం. ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చింది..మన సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉంది. ప్రజల కోసం మళ్లీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవటానికి దోపిడీలు చేసేస్తున్నారు. 2014-19 మధ్యలో ఉన్నట్లు కొంతైనా మొహమాటం కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారు..ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎంగా ప్రమాణం చేయకముందే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో అక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చాక రోజుకొక కొత్త ఇష్యూతో రచ్చ చేస్తున్నారు. చివరికి తిరుపతి లడ్డూ మీద కూడా రాజకీయం చేశారు. జగన్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే.. చంద్రబాబు అన్నిటినీ ప్రయివేటు పరం చేస్తున్నారు. పోర్టులు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, చివరికి రోడ్లు కూడా ప్రయివేటు పరం చేస్తున్నారు. వచ్చిన మెడికల్ కాలేజీ సీట్లను పోగొట్టారు. ఐదు, ఆరు వందల మంది విద్యార్థులకు అన్యాయం చేశారు..ఇప్పుడు ఏం చేసినా జనం ఏమీ పట్టించుకోరని, ఎన్నికల నాటికి అన్నీ మర్చిపోతారని చంద్రబాబు భావిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మన హయాంలో చేసిన మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. మన పార్టీ కార్యకర్తలు, నాయకులకు జనంలో గౌరవం ఉంది. పార్టీ కార్యకర్యక్రమాలను ప్రతిస్థాయిలోనూ గట్టిగా తీసుకెళ్లాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఎవరూ వెనుకడుగు వేయలేదు. కార్యకర్తలు కసిగా పనిచేసి 2019లో గెలిపించారు. మనవెంట నడుస్తున్న వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: ఇక ప్రజా పోరాటాలే.. 4న వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి సమావేశం..ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులకు ఇకనుంచి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అనేక అభివృద్ది కార్యక్రమాలను భుజాన వేసుకుని ఐదేళ్లలో పూర్తి చేయాలనే తపనతో పని చేశాం. దానివలన కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. ప్రభుత్వ పనిలో పడి, పార్టీకి ఏం అవసరమో అది చేయలేకపోయాం. ఇకమీదట అలా ఉండదు. మీకే ప్రాధాన్యత ఉంటుంది...ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాల్సిన బాధ్యత ఇప్పుడు మనమీద ఉంది. జడ్పీ అధ్యక్షులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాను యాక్టీవ్ చేయాల్సిన అసవరం ఉంది. సమస్యల మీద ఎంపీపీలు కూడా చిన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టాలి. ఎంపీపీలందరితోనూ వైఎస్ జగన్ సమావేశమయ్యే ఏర్పాటు కూడా చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
మూడు గంటల్లో మమ..!
సీతంపేట: ప్రతిసారీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగే సీతంపేట ఐటీడీఏ(సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) పాలకవర్గ సమావేశం ఆదివారం మాత్రం మొక్కుబడిగా జరిగింది. సంస్థ పరిధిలో అమలవుతున్న అన్ని పథకాలు, శాఖల పనితీరుపై సమగ్రంగా చర్చించాల్సిన ఈ సమావేశాన్ని మూడంటే మూడు గంటల్లో ముగించేశారు. ఉదయం 11.30కు మొదలై మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసింది. ఎమ్మెల్యేలతో సమానంగా ప్రశ్నించే హక్కు ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. తాము ఎన్నికైన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో తమ పరిధిలోని ప్రజల సమస్యలు ప్రస్తావించాలని ఎంతో ఉత్సాహంతో హాజరైన వీరంతా సమావేశం జరిగిన తీరుతో నిరుత్సాహం చెందారు. తక్కువ వ్యవధిలోనే సమావేశాన్ని ముగించడంపై ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నందున ఒక్కపూటకే పరిమితం చేశామని, ఇక ముందు రెండుపూటలా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జిల్లాలో పది నియోజకవర్గాలుండగా రాజాం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారందరూ హాజరు కావాల్సి ఉంది. కానీ టీడీపీకి చెందిన ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు బి.అశోక్, కళా వెంకట్రావు, బగ్గు రమణమూర్తి, గౌతు శివాజీలు రాలేదు. గిరిజన మంత్రి కిశోర్‌బాబు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, అరుకు ఎంపీ కొత్తపల్లి గీతలు మాత్రమే హాజరయ్యారు. ఫలితంగా ఆయా నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావనకు నోచుకోలేదు. ఎమ్మెల్సీలు కూడా గైర్హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీకి చెందిన పాతపట్నం, పాలకొండ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వాసరాయి కళావతిలు మాత్రమే హాజరై తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలపై స్పందించారు. అధికారులను ప్రశ్నించారు. కొన్ని శాఖలపై చర్చే లేదు సమయాభావం కారణంగా కొన్ని శాఖలపై చర్చే జరగలేదు. కీలకమైన ట్రాన్స్‌కో, చిన్న నీటివనరులు, మలేరియా విభాగం, గిరిజన సహకార సంస్థ, హౌసింగ్ తదితర శాఖలు అసలు ప్రస్తావనకే రాలేదు. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, ఇంజనీరింగ్ విభాగం, వైద్యశాఖలపైనే చర్చ సాగింది. అది కూడా నామమాత్రంగానే జరిగింది. కాగా ఇటీవల మంత్రి అచ్చెన్న జరిపిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కొంత చర్చ జరిగింది. ఆ నిర్ణయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. -
మెజార్టీ ఎంపీపీలు సాధించిన టీడీపీ
అమలాపురం, న్యూస్‌లైన్ :పరిషత్ పోరు పరిసమాప్తమైంది. మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలు సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనిచ్చింది. పలు పరిషత్‌లలో నువ్వా.. నేనా అన్నట్టుగా పోటీ పడడంతో ఫలితం ఆఖరి వరకు తేలని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 57 మండల పరిషత్‌ల పరిధిలో 1063 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 23 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1040 స్థానాలకు గాను గత నెల 11వ తేదీన పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్‌ను నెలరోజులకు పైగా వాయిదా వేశారు. పరిషత్‌కు సంబంధించి మంగళవారం కౌంటింగ్ జరిగింది. బ్యాలట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించిన కారణంగా కౌంటింగ్ ఆలస్యమైంది. కొన్ని మండలాల్లో బుధవారం తెల్లవారుజాము వరకు కౌంటింగ్ జరగడం గమనార్హం. పురష్క కాలం తరువాత పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. ఏకగ్రీవంగా 11 ఎంపీటీసీ స్థానాలు, ఎన్నికల జరిగిన చోట 597 స్థానాలతో కలుపుకుని మొత్తం 608 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. 57 మండల పరిషత్‌లకు గాను, 40 మండల పరిషత్‌లను సాధించింది. స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. పరిషత్ ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య తక్కువ సమయం ఉండడం, ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనే మొత్తం దృష్టి పెట్టడంతో టీడీపీకి మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం కలిగింది. ఏజెన్సీ, మెట్టలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో మండల పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 389 ఎంపీటీసీ స్థానాలను, 13 మండల పరిషత్‌లను గెలుచుకునే అవకాశం లభించింది. ఏలేశ్వరం మండల పరిషత్‌లో వైఎస్సార్సీపీ ఆరు, టీడీపీ ఏడు స్థానాలు సాధించింది. అయితే ఈ మండల పరిషత్ ఎంపీపీ స్థానం ఎస్టీలకు రిజర్వ్ కాగా, టీడీపీ తరఫున పోటీ చేసినవారు ఓడిపోయారు. దీనితో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఎస్టీ ఎంపీటీసీ అభ్యర్థికి ఎంపీపీ స్థానం కేటాయించడం మినహా మరో అవకాశం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ఓటమి చెందిన ఎంపీటీసీల్లో మూడొంతుల చోట్ల చాలా తక్కువ ఓట్లతో ఓటమి చెందడం గమనార్హం. కాంగ్రెస్‌కు విభజన సెగ రాష్ట్ర విభజనానంతరం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడుచుపెట్టుకుపోయింది. ఆ పార్టీ పెదపూడి, రాజానగరం ఎంపీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకొంది. బీఎస్సీ, బీజేపీలు అసలు బోణీయే చేయలేకపోయాయి. ఆ నాలుగు చోట్లా ఉత్కంఠే జిల్లాలో రెండు మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పీఠం ఉత్కంఠను రేపనుంది. రౌతులపూడి మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీలు చెరో ఏడు ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. తాళ్లరేవు మండల పరిషత్‌లోను రెండు పార్టీలూ చెరో 12 ఎంపీటీసీ స్థానాల చొప్పున కైవసం చేసుకున్నాయి. దీనితో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారనుంది. యూ.కొత్తపల్లి మండల పరిషత్‌లో సైతం వైఎస్సార్, టీడీపీలు చెరో 12 స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. కాజులూరులో సైతం రెండు పార్టీలు చెరో పది ఎంపీటీసీలు గెలుచుకోవడంతో ఎంపీపీ పీఠం ఏ పార్టీ సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది. టీడీపీ గెలుచుకున్న స్థానాలు 1. అమలాపురం, 2. అల్లవరం. 3. మామిడికుదురు, 4. పి.గన్నవరం, 5. అయినవిల్లి, 6. అంబాజీపేట, 7. రాజోలు, 8. సఖినేటిపల్లి, 9. మలికిపురం, 10. కొత్తపేట, 11. ఆత్రేయపురం, 12. ఆలమూరు, 13. ముమ్మిడివరం, 14. ఐ.పోలవరం, 15. రాజానగరం, 16. కడియం, 17. సీతానగరం, 18. కోరుకొండ, 19.గోకవరం, 20. రామచంద్రపురం, 21. మండపేట, 22. అనపర్తి, 23. కపిలేశ్వరపురం, 24. బిక్కవోలు, 25. రాయవరం, 26. పెద్దాపురం, 27. గండేపల్లి, 28. రంగంపేట, 29. ప్రత్తిపాడు, 30.. శంఖవరం, 31. తొండంగి, 32. కాకినాడ రూరల్, 33. పెదపూడి, 34. సామర్లకోట, 35. పిఠాపురం, 36. కరప, 37. గొల్లప్రోలు, 38. రాజవొమ్మంగి, 39. ఏజెన్సీ గంగవరం, 40. అడ్డతీగల. వైఎస్సార్సీపీ సాధించినవి 1. ఉప్పలగుప్తం, 2. కాట్రేనికోన, 3. రావులపాలెం, 4. కె.గంగవరం, 5. జగ్గంపేట, 6. కిర్లంపూడి, 7. ప్రత్తిపాడు, 8. తుని, 9. మారేడుమిల్లి, 10.దేవీపట్నం, 11. రంపచోడవరం, 12. వై.రామవరం, 13. ఏలేశ్వరం (టీడీపీకి ఒక ఎంపీటీసీ స్థానం ఎక్కువ వచ్చినా ఇక్కడ ఎస్.టి. రిజర్వ్ స్థానాలన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలో పడ్డాయి.)చెరి సమానం 1. కాజులూరు, 2. తాళ్లరేవు, 3. రౌతులపూడి, 4. యు.కొత్తపల్లి.