mps accomodation
-
27 మాజీ ఎంపీలకు షాక్
ఢిల్లీ: అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. దీంతో 27 మంది మాజీ పార్లమెంట్ సభ్యులకు మంగళవారం కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాజీ ఎంపీలు పదవీ కాలం ముగిసినప్పకీ ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీల ఇళ్లకు నీళ్లు, కరెంట్, గ్యాస్ కనెక్షన్లు వెంటనే నిలివేయాలని లోక్‌సభ హౌస్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మాజీలు భవనాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది. కాగా ల్యూటెన్స్ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని గతంలో అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయని ఎంపీల వైఖరిపై ప్రభుత్వం మండిపడింది. మాజీ ఎంపీల నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ప్రస్తుత ఎన్నికైన ఎంపీలకు వేరేచోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: బంగళాలు వీడని మాజీలు -
బంగళాలు వీడని మాజీలు
న్యూఢిల్లీ: ఎంపీల అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. ల్యూటెన్స్ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నేపథ్యంలో వారిపై పబ్లిక్ ప్రెమిసెస్ చట్టాన్ని ప్రయోగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ లోక్ సభకు కొత్తగా ఎంపికైన వారికి బంగళాలు కేటాయించాల్సి ఉండగా, మాజీ ఎంపీలు తమ నివాసాలను ఖాళీ చేయలేదు. దీంతో ప్రస్తుత ఎంపీలకు వేరే చోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. త్వరలో నోటీసులు.. గడువు ముగిసినా నివాసాలు ఖాళీ చేయని దాదాపు 200 మంది మాజీ ఎంపీలకు గతనెల 19న సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ వారంలోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోగా కరెంటు, నీరు, వంటగ్యాస్ నిలిపి వేస్తామని స్పష్టంచేసింది. దీంతో కొందరు నివాసాలను ఖాళీ చేయగా ఇంకా 82 మంది మాజీ ఎంపీలు అక్కడే తిష్ట వేశారు. ఖాళీ చేయనివారిపై కఠిన చర్యలుంటాయని లోక్‌సభ హౌసింగ్ కమిటీ పేర్కొంది. -
ఎంపీల కోసం ముస్తాబవుతున్న ఫ్లాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో కొత్త ఎంపీలు కొలువుతీరనున్న వేళ ఎంపీలకు నూతన ఫ్లాట్లను ప్రభుత్వం సమకూర్చనుంది. దేశ రాజధానిలో అధికారిక నివాసం లేని ఎంపీలకు ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి అందించడంలో దుబారా అవుతుండటంతో లోక్‌సభ సెక్రటేరియట్ ఖర్చు తగ్గించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్ నార్త్ ఎవెన్యూ ప్రాంతంలో ఎంపీలకు అత్యాధునిక వసతులతో ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు అందించేందుకు ఇప్పటివరకూ అన్ని హంగులతో 36 ఫ్లాట్లు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మించిన ఈ ఫ్లాట్లు అన్ని ఆధునిక సదుపాయాలతో పాటు ఎంపీల అవసరాలకు అనుగుణంగా రూపొందాయి. ఈ డూప్లెక్స్ ఫ్లాట్లు భూకంపాన్ని తట్టుకునే విధంగా, గ్రీన్ బిల్డింగ్ విధానాలను అనుసరిస్తూ నిర్మితమయ్యాయి. ప్రతి అపార్ట్మెంట్లో రెండు ఫోర్లతో పాటు సెంట్రలైజ్డ్ ఏసీ, చిన్నపాటి దేవాలయం, సర్వెంట్ రూమ్, బేస్మెంట్ పార్కింగ్, ఎటాచ్డ్ వాష్‌రూమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లును తగ్గించేందుకు ఫ్లాట్స్‌పై సోలార్ ప్యానెల్స్, సెన్సర్ లైట్లు అమర్చారు. ఇక 300 మంది ఎంపీల కోసం నిర్మిస్తున్న ఈ ఫ్లాట్లు అన్నీ సిద్ధమయ్యేవరకూ మరికొందరు ఎంపీలకు ఆయా రాష్ట్రాల అతిధి గృహాలతో పాటు నగరం మధ్యలో పునరుద్ధరించిన వెస్ర్టన్ కోర్టులోనూ వసతి కల్పించాలని లోక్‌సభ సెక్రటేరియట్ భావిస్తోంది. -
47 మంది ఎంపీల వసతికి 24 కోట్లు
ఫైవ్‌స్టార్ హోటళ్లలో, లగ్జరీ గెస్ట్ హౌసుల్లో నివసిస్తున్న 47 మంది లోక్‌సభ సభ్యులకు కేంద్రం 24 కోట్ల రూపాయలను చెల్లించింది. ప్రస్తుత లోక్‌సభ కొలువుతీరినప్పటి నుంచి నేటి వరకు గడిచిన 14 నెలల కాలానికే ఇంత మొత్తంలో చెల్లించినట్టు సుభాష్ చంద్ర అగర్వాల్ అనే పౌరుడు దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తికి 30 రోజుల్లోగా ఢిల్లీలో వసతి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అలా చేయలేని పక్షంలో వారుండే ఫైవ్‌స్టార్ హోటల్ గదులకు, లగ్జరీ అతిథి గృహాలకు అద్దెలను ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. భోజనం, టెలిఫోన్, ఇతర వసతులకు అయ్యే ఖర్చులను మాత్రం ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుత 47 మంది లోక్‌సభ సభ్యుల్లో 15 మందికి ఎంపీల క్వార్టర్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే అవి నివాసయోగ్యంగా లేవని వారిలో పది మంది లగ్జరీ హోటళ్లలోనే నివసిస్తున్నారు. మరో ఐదుగురికి కేటాయించిన గృహాలు నివాసయోగ్యంగా ఉన్నప్పటికీ వారు తమ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహాలను ఖాళీ చేయడం లేదు. మాజీ ఎంపీలు ప్రభుత్వ నోటీసు అందుకున్న 14 రోజుల్లో తమకు కేటాయించిన గృహాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. చాలా మంది మాజీలు ఆరు నెలల వరకు కూడా ఖాళీ చేయని సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా చేయని పక్షంలో వారి నుంచి అద్దెను వసూలు చేయలన్నది నిబంధన. కానీ ఈ నిబంధనను అమలు చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ 108 రోజుల పాటు ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వ అకాడమేషన్ దొరక్క బయట ప్రైవేట్ అకామడేషన్లలో ఉంటున్న ఎంపీల్లో అశ్వినీ కుమార్, పూనం మహాజన్, భగ్వంత్ మన్ లాంటి ప్రముఖులు ఉన్నారు.