MPs suspension
-
రాజ్యసభలో అదే తీరు
న్యూఢిల్లీ: 12 మంది ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రతిపక్షాలు గొంతెత్తుతూనే ఉన్నాయి. ఈ అంశంపై సభలో చర్చించాలని బుధవారం పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ ఖర్గేకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. శాంతించాలని సభాపతి పదేపదే కోరినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా సభ పలుమార్లు వాయిదాపడి చివరకు గురువారానికి వాయిదాపడింది. రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన 12 మంది ప్రతిపక్ష ఎంపీలు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సస్సెన్షన్‌ను రద్దు చేసే దాకా నిరసన కొనసాగిస్తామన్నారు. కాగా, దేశవ్యాప్తంగా అన్ని క్లినిక్‌లు, వైద్య సిబ్బంది కోసం నేషనల్ రిజిస్ట్రీ, రిజిస్ట్రేషన్ అథారిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(రెగ్యులేషన్) బిల్లు–2020ను∙ఆరోగ్య మంత్రి మాండవీయ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ వాయిస్ ఓటుతో ఆమోదించింది. కాగా, పార్లమెంట్లో 59వ నంబర్ గదిలో బుధవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంప్యూటర్, కుర్చీ, టేబుల్‌కు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. -
ఎంపీల నిరసన : పోలీసుల ఓవర్ యాక్షన్
సాక్షి, న్యూఢిల్లీ : రైతులకు మేలు చేస్తాయనే పేరుతో తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఒకవైపు తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలనే తీర్మానానికి రాజ్యసభ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా సభలో పోడియంలోకి దూసుకెళ్లి, ఆందోళనకు దిగారు. ఇది 8మంది ఎంపీల సస్పెన్షన్ కు దారితీసింది. అయితే పట్టువదలకుండా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రధానంగా పార్లమెంటు సమీపంలో సోమవారం మౌనంగా నిరసన చేపట్టిన పంజాబ్‌కు చెందిన నలుగురు పార్లమెంటు సభ్యుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఎంపీలపై దాడికి దిగారు. కాళ్లపై లాఠీలతో కొడుతూ, వారిని అక్కడినుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. (8 మంది ఎంపీల సస్పెన్షన్) అయితే పార్లమెంటు షెడ్యూల్ కంటే ముందే బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దారి క్లియర్ చేసేందుకు ప్రయత్నించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాదు ఎంపీలు తమ నిరసనకు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ప్రధానికి దారి క్లియర్ చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరసన చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లి, వారిని పరామర్శించారు. టీ తాగాలని కోరారు. దీనికి ససేమిరా అన్న ఎంపీలు ఆయన్ను రైతు వ్యతిరేకి అంటూ విమర్శించారు. ఇది ఇలావుంటే హరివంశ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ ఆయన తీరు ఆదర్శ ప్రాయమని వ్యాఖ్యానించడం గమనార్హం. (‘ఆ బిల్లులను అడ్డుకోండి’) కాగా కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులును వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 25న దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వ తీసుకొచ్చిన ప్రస్తుత బిల్లుతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులు మరింత నష్టాల్లోకి జారిపోతారని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లులు కార్పొరేట్లకు కొమ్ము కాసేవే తప్ప, రైతులకు మేలు చేసేవి ఎంతమాత్రం కాదనివాదిస్తున్నాయి. అటు సస్పెన్షన్ కి గురైన ఎంపీలు, రాత్రంతా పార్లమెంట్ ఎదుట తమ నిరసనను కొనసాగించారు. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బిల్లులును సభలో ఆమోదించారని మండిపడ్డారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందంటూ నిరసనను కొనసాగిస్తున్నారు. -
కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పార్లమెంట్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సభలో అనైతికంగా వ్యవహరించారంటూ లోక్‌సభలో ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా గురువారం సస్పెండ్ చేశారు. సస్పెండైన కాంగ్రెస్ ఎంపీల్లో గౌరవ్ గొగోయ్, టీ ఎన్ ప్రతాపన్, దిన్ కుర్యాకోస్, రాజ్ మోహన్ ఉన్నితన్, బెన్ని బెహన్, మాణికమ్ ఠాకూర్, రణ్విత్ సింగ్ బిట్టూ ఉన్నారు. ప్రస్తుత సెషన్లో మిగిలిన పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా వీరిపై స్పీకర్ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు పేపర్లను చింపి వాటిని లోక్‌సభ స్పీకర్‌పై విసరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తమ సభ్యులపై వేటు వేయాలన్న నిర్ణయం స్పీకర్‌ది కాదని, ఇది ప్రభుత్వ నిర్ణయమని లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌధరి ఆరోపించారు. సస్పెన్షన్ నిర్ణయానికి తాము తలొగ్గబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తమ పోరాటంసభ లోపల, వెలుపల కొనసాగుతుందని చెప్పారు. చదవండి : నెట్టుకున్నారు.. తోసేసుకున్నారు! -
'తప్పని పరిస్థితుల్లోనే ఎంపీల సస్పెన్షన్'
ఢిల్లీ: తప్పనిసరి పరిస్థితుల్లోనే సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించాకే ఎంపీలపై సస్పెన్షన్ వేటువేసినట్లు తెలిపారు. 15 రోజులుగా 10 మంది ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేయడం భావ్యం కాదన్నారు. ఎంపీల ఆందోళన కారణంగా సభా కార్యక్రమాలు పెండింగ్‌లో పడ్డాయన్నారు. సస్పెన్షన్‌పై చర్చించేందుకే స్పీకర్ రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం కాంగ్రెస్ ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదన్నారు. రాజధాని, జలవనరులు, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణకు ఇది సరైన సమయం కాదన్న బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు సరికావన్నారు.