లక్కీ డ్రా ద్వారా ఎంపీటీసీ అభ్యర్థి ఎంపిక
జఫర్‌గఢ్, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ పదవికి పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో గ్రామస్తులు లక్కీ డ్రా ద్వారా అభ్యర్థిని ఎంపిక చేశారు. జఫర్‌గఢ్ మండలంలోని తిమ్మంపేట, తమ్మడపల్లి(ఐ) గ్రామాలకు కలిపి ఒక్క ఎంపీటీసీ స్థానం ఉంది. అయితే ఇందులో తమ్మడపల్లి(ఐ) గ్రామం కంటే తిమ్మంపేటలోనే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో తిమ్మంపేట గ్రా మం నుంచి వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇందులో టీఆర్ఎస్ నుంచి మల్లం శ్రీనివాస్, టీఆర్ఎస్ రెబల్‌గా అబ్బరబోయిన నాగరాజు, బీజేపీ నుంచి ముస్కు వెంకన్న, టీడీపీ నుంచి అరే నాగయ్య, సీపీఎం తరపున ము స్కు కుమార్‌లు పోటీ చేస్తున్నారు. కాగా, తమ్మడపల్లి (ఐ) గ్రామం నుంచి కాంగ్రెస్ తరపున వాసం సత్యనారాయణ ఒక్కరే పోటీ చేస్తున్నారు. అయితే తమ గ్రామంలో ఎక్కువగా ఓటర్లు ఉన్నారని, ఎంపీటీసీ పదవి తమకే రావాలని గ్రామ పెద్దలు భావించారు. ఈ మేరకు అభ్యర్థులతో వారు లక్కీ డ్రా ఒప్పందం చేసుకున్నారు.
ఈ క్రమంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీల నాయకులు, గ్రామపెద్ద లు తిమ్మంపేట నుంచి ఎంపీటీసీ స్థానానిక పోటీచేస్తున్న అభ్యర్థులను పిలిపించారు. లక్కీ డ్రా ద్వారా పేరును ఎంపిక చేస్తామని, డ్రాలో వచ్చిన పేరు వచ్చి న అభ్యర్థే బరిలో ఉండాలని వారికి సూచించారు. దీనికి అభ్యర్థులందరూ అంగీకరించడంతో పెద్దలు డ్రా తీశారు.
డ్రాలో టీఆర్ఎస్ అభ్యర్థి మల్లం శ్రీనివా స్ ఎంపిక కావడంతో మిగతా వారు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇతర అభ్యర్థులకు ఇప్పటివరకు అ యిన ఖర్చులను టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ ద్వారా గ్రామ పెద్దలు చెల్లించారు. డ్రాలో ఎంపికైన శ్రీనివాస్‌కే తిమ్మంపేట గ్రామస్తులందరూ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.