టీడీపీ ఎంపీటీసీపై అంగన్వాడీ కార్యకర్త ఫిర్యాదు
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆదివారం టీడీపీ ఎంపీటీసీపై అంగన్వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ రాజేశ్వరి అనే అంగన్వాడీ కార్యకర్త టీడీపీ ఎంపీటీసీ శ్రీనివాసులుపై ఆరోపించింది.
చెప్పిన మాట వినకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో రాజేశ్వరి.. ఎంపీటీసీపై గార్లదిన్నె మండలం కమలాపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.