m.srinivas
-
నేరాల నియంత్రణకు నిఘా పెంచాలి
► వరంగల్ జోన్ ఐజీపీ నాగిరెడ్డి ►జిల్లా కేంద్రంలో మొదటిసారి పర్యటన ►సబ్కంట్రోల్రూం ప్రారంభం ఆదిలాబాద్ క్రైం : నేరాలు నియంత్రించేందుకు సాంకేతిక నిఘా పెంచాలని వరంగల్ జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డి సూచించారు. శుక్రవారం మొదటి సారిగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఎస్పీ ఎం.శ్రీనివాస్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఉదయం స్థానిక పోలీసు విశ్రాంతి భవనానికి చేరుకుని సాయుధ పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన పోలీసు సబ్కంట్రోల్రూంను ప్రారంభించారు. అక్కడి నుంచి బయల్దేరి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసు స్టేషన్లో రక్షణ చర్యలు, సిబ్బంది సంక్షేమంపై సుధీర్ఘంగా చర్చించారు. పోలీసులు తీసుకుంటున్న రక్షణ చర్యలపై జిల్లా ఎస్పీ ఐజీపీకి వివరించారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, దొంగతనాల నివారణకు అదనంగా రాత్రి గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలు నియంత్రిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఐజీపీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తూ రోజురోజుకు నేరాల సంఖ్య తగ్గిస్తున్నారని అన్నారు. పోలీసులు చురుగ్గా పని చేస్తూ నేరస్తులు దొంగిలించిన సొమ్మును రికవరీ చేయాలని చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిస్థారుులో అదుపులో ఉన్నాయన్నారు. చిన్న జిల్లాలు ఏర్పడడతో పోలీసుల సంఖ్య తగ్గి పోలీసులకు అదనపు భారమవుతోందని, త్వరలో దీన్ని అధిగమించేందుకు నూతన పోలీసులను ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లా పోలీసు వాట్సప్ నెంబర్ 8333986898తో నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుకోవడంలో ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. త్వరలో జిల్లా పోలీసులకు ఇంటర్నెట్ కనెక్షన్‌తోపాటు నెలకు 1 జీబీ డాటా ఉన్న సిమ్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్, అదనపు ఎస్పీ పనసారెడ్డి, డీఎస్పీలు లక్ష్మినారాయణ, మల్లారెడ్డి, కె.సీతారాములు, కె.నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఎండీ.బుర్హాన్ అలీ, సీఐలు సత్యనారాయణ, వెంకటస్వామి, షేర్ అలీ, పోతారం శ్రీనివాస్, స్పెషల్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్, ఆర్ఐ బి.జేమ్స్, ఎస్సై రాజన్న, ఆర్ఎస్సై పెద్దయ్య, తిరుపతి, సీసీ పోతరాజు పాల్గొన్నారు. -
దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం
► ఎస్పీ ఎం.శ్రీనివాస్ ► జిల్లా అధికారులతో నేర సమీక్ష సమావేశం ఆదిలాబాద్‌క్రైం : కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానా న్ని కీలకంగా మలుచుకోవాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్ అ న్నారు. జిల్లాలో నేరాల అదుపుతో పోలీసు వ్యవస్థ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు సమావేశ మం దిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ని 21 పోలీసుస్టేషన్ల పురోగతి, పెండింగ్ కేసులు, వారెం ట్లు, శాంతిభద్రతల సమస్యలు, ఆర్థిక నేరాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ నిరంతరంగా అభివృద్ధి చెందుతూ అనేక సాంకేతిక పరమైన మార్పులు వచ్చాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని నిందితులను ముందస్తుగా గుర్తించి నేరాల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల విభజన అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా భీంపూర్, గాదిగూడ, సిరికొండ, మావల నాలుగు పోలీసుస్టేషన్లు ఏర్పడ్డాయని, వీటి సర్కిల్ కార్యాలయాలు జైనథ్, ఇచ్చోడ, నార్నూర్ ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలకు పోలీసు వ్యవస్థ మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు. అక్టోబర్ 11 తర్వాత జిల్లా వ్యాప్తంగా 8 మట్కా కేసుల కేసులు నమోదు కాగా, 31 మందిని అరెస్టు చేసి రూ.62,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాటలో 12 కేసులు నమోదు కా గా, 54 మందిని అరెస్టు చేసి రూ.21,010 నగదు స్వాధీనపర్చుకున్నట్లు వివరించారు. గుట్కా అమ్మేవారిపై 14 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్టు చేయడంతోపా టు రూ.12లక్షల 35వేల నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నామని, దేశీదారు వ్యాపారం చేస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశామని, 236 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బెల్టుషాపుల్లో మద్యం అమ్మకుండా 11 కేసులు నమోదు చేశామని, 16 మందిని అరెస్టు చేసి 350 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహిళ ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరో రెండు షీటీమ్‌ల ను ఏర్పాటు చేసి నిఘా పెంచినట్లు తెలిపారు. త్వరలో ప ట్టణంలో పోలీసు సబ్‌కంట్రోల్ రూమ్‌లను పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి ఎలాంటి వ్యక్తిగత సమస్యలున్నా నేరుగా తెలుపాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ టి.పనసారెడ్డి, ఆదిలాబాద్, ఉట్నూర్ డీఎస్పీలు ఎ.లక్ష్మినారాయణ, ఎస్.మల్లారెడ్డి, సీసీఎస్ కె.నర్సింహారెడ్డి, సీతారాములు, ఏఆర్ ఎండి బుర్హాన్అలీ, సీఐలు ఎన్.సత్యనారాయణ, కె.వెంకటస్వామి, ఎండి షేర్ అలీ, పోతారాం, శ్రీనివాస్, ఎ.కరుణాకర్, జయరాం, జైపాల్, గణపత్ జాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్, ఎస్సైలు అన్వర్ఉల్ హఖ్, డి.పద్మ, రాజలింగం, ఆర్ఐ బి.జెమ్స్, ఆర్ఎస్సై బి.పెద్దయ్య, డి.మోహన్, పుల్లయ్య అధికారులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు మరో ముందడుగు
► ఎస్పీ ఎం.శ్రీనివాస్ ► షీటీమ్ సభ్యులకు వాహనాలు అందజేత ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో మహిళల సంరక్షణకు మరో ముందుడుగు వేశామని ఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నూతన షీటీమ్ బృందాల పరిచయ వేదికలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూడు షీటీమ్ బృందాల సభ్యులకు నూతన వాహనాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల ధన, మాన, ప్రాణాలకు, గౌరవ అభిమానాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి పటిష్టంగా మార్చిందని అన్నారు. ఇందులో భాగంగానే షీటీమ్ సభ్యులకు 15 నూతన వాహనాలు కేటాయించామని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలను రహస్య కెమెరాలో చిత్రీకరించి, రుజువులతో సహా వారిని పట్టుకుని తల్లిదండ్రులు, భార్య, బంధువుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించడంతోపాటు పోకిరీలపై కేసులు నమోదు చేస్తామన్నారు. 100కు డయల్ చేస్తే సత్వరమే షీటీమ్ సభ్యులు చేరుకుంటారని తెలిపారు. కళాశాలల్లో విద్యార్థిగా వెళ్లి అనుమానితులపై నిఘా ఉంచుతారని, విద్యార్థులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవదని అన్నారు. సీసీఎస్ డీఎస్పీ కె.నర్సింహారెడ్డి పర్యవేక్షణలో షీటీమ్‌లు పని చేస్తాయని, సభ్యులు మారువేషంలో ఉండి మహిళలకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. సెల్ 8333986698 ద్వారా సమాచారం అందించి పోలీసు రక్షణతోపాటు ప్రజారక్షణ చర్యలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ డీఎస్పీ లక్ష్మి నారాయణ, సీసీఎస్ డీఎస్పీ నర్సింహారెడ్డి, పట్టణ సీఐ సత్యనారాయణ, ఆర్ఐ బి.జెమ్స్, ఎస్సైలు డి.పద్మ, రాజలింగం, ఆర్ఎస్సై పెద్దయ్య, ఏఎస్సై అప్పారావు, శంకర్, రాధ, రాంమూర్తి, సర్దార్ సింగ్, లక్ష్మి, సుశీల, సరిత, మౌనిక పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఆదిలాబాద్ రిమ్స్ : నేరాల నియంత్రణకు పట్టణంలోని కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్ సూచించారు. ఇందుకోసం పోలీసు అధికారులు చొరవచూపాలని పేర్కొన్నారు. గురువారం మహిళా పోలీసు స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, ఆర్ఐ బి.జేమ్స్, ఆర్ఎస్సై బి.పెద్దయ్య, ఎస్సై రాజలింగం, డి.పద్మ పాల్గొన్నారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
గజ్వేల్ : డబ్బు కోసం కట్టుకున్న భార్యను ఓ భర్త కడతేర్చాడు. భార్య ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి .. చీరతో ఉరేసి అంత్యంత కిరాతంగా హతమార్చాడు. ఈ సంఘటన గజ్వేల్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.. వివరాలిలా ఉన్నాయి. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ఎం శ్రీనివాస్ (34)కు నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన రేణుక (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సందర్భంగా రూ. 2 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. వీరికి దీక్షిత (3), ధీరజ్ (10 నెలలు) లు ఉన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్లలోని 400 కేవీ సబ్‌స్టేషన్‌లో వైర్మన్గా కాంట్రాక్ట్ ఉద్యోగం రావటం వల్ల భార్యాపిల్లలతో కలిసి గజ్వేల్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కలతలు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వాలని శ్రీనివాస్ రేణుకను తరుచూ వేధిస్తుండేవాడు. అంతేకాకుండా మద్యం పీకల దాక సేవించి శారీరకంగా హింసించేవాడు. ఈ విషయంలో ఎన్నోసార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కుమార్తె రేణుకను అల్లుడు వేధించినప్పుడల్లా రూ. 10 వేల వరకు అప్పగించేవారు. వీటితో కొంతకాలం బాగానే ఉంటూ తిరిగి డబ్బుల కోసం గొడవపెట్టేవాడు. కొన్ని రోజుల క్రితం రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రేణుక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో రూ. 10 వేల ఇచ్చి వెళ్లారు. అయినా తనకు ఈ డబ్బులు సరిపోవని హింసించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రేణుకను దిండుతో నోటిని కుక్కి ఊపిరాడకుండా చేయడమే కాకుండా చీరతో ఊరేసి హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికి గడియపెట్టి పిల్లలను తీసుకుని బయటకు వచ్చాడు. రాత్రి పది గంటల వరకు రోడ్డుపైనే తిరిగాడు. ఆ తర్వాత అక్కన్నపేటలోని తన తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబీకులకు శ్రీనివాస్ ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. దీంతో వారు ఇక్కడికి చేరుకుని పిల్లలను తమ వద్దకు తీసుకున్నారు. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ నేరుగా పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. దీంతో అదే రాత్రి సీఐ అమృతరెడ్డి, ఎస్ఐ జార్జిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమాచారాన్ని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులకు అందించారు. తెల్లవారుజామున వారు ఇక్కడికి చేరుకుని బోరున విలపించారు. ఈ సందర్భంగా రేణుక తండ్రి లింగయ్య విలేకరులతో మాట్లాడుతూ ఎంతో కాలంగా నా బిడ్డను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నా.. మారుతాడోమేనని అనుకున్నాం.. ఎన్నోసార్లు అడిగి కాడికి డబ్బులిచ్చాం.. గిప్పుడు ప్రాణాలే తీసిండు.. అంటూ రోదించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అమృతరెడ్డి తెలిపారు. ఇదిలావుంటే అభం శుభం తెలియని చిన్నారులు దీక్షిత, ధీరజ్‌లు పిన్న వయసులో కన్నతల్లిని కోల్పోవడం పలువురిని కలచి వేసింది. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.