నేరాల నియంత్రణకు నిఘా పెంచాలి | police sub control room started | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు నిఘా పెంచాలి

Published Sat, Dec 3 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

నేరాల నియంత్రణకు నిఘా పెంచాలి

నేరాల నియంత్రణకు నిఘా పెంచాలి

వరంగల్ జోన్ ఐజీపీ నాగిరెడ్డి
జిల్లా కేంద్రంలో మొదటిసారి పర్యటన
సబ్‌కంట్రోల్‌రూం ప్రారంభం

ఆదిలాబాద్ క్రైం : నేరాలు నియంత్రించేందుకు సాంకేతిక నిఘా పెంచాలని వరంగల్ జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డి సూచించారు. శుక్రవారం మొదటి సారిగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఎస్పీ ఎం.శ్రీనివాస్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఉదయం స్థానిక పోలీసు విశ్రాంతి భవనానికి చేరుకుని సాయుధ పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన పోలీసు సబ్‌కంట్రోల్‌రూంను ప్రారంభించారు. అక్కడి నుంచి బయల్దేరి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసు స్టేషన్‌లో రక్షణ చర్యలు, సిబ్బంది సంక్షేమంపై సుధీర్ఘంగా చర్చించారు. పోలీసులు తీసుకుంటున్న రక్షణ చర్యలపై జిల్లా ఎస్పీ ఐజీపీకి వివరించారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, దొంగతనాల నివారణకు అదనంగా రాత్రి గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలు నియంత్రిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా విలేకరులతో ఐజీపీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తూ రోజురోజుకు నేరాల సంఖ్య తగ్గిస్తున్నారని అన్నారు. పోలీసులు చురుగ్గా పని చేస్తూ నేరస్తులు దొంగిలించిన సొమ్మును రికవరీ చేయాలని చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిస్థారుులో అదుపులో ఉన్నాయన్నారు. చిన్న జిల్లాలు ఏర్పడడతో పోలీసుల సంఖ్య తగ్గి పోలీసులకు అదనపు భారమవుతోందని, త్వరలో దీన్ని అధిగమించేందుకు నూతన పోలీసులను ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లా పోలీసు వాట్సప్ నెంబర్ 8333986898తో నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుకోవడంలో ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. త్వరలో జిల్లా పోలీసులకు ఇంటర్నెట్ కనెక్షన్‌తోపాటు నెలకు 1 జీబీ డాటా ఉన్న సిమ్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్, అదనపు ఎస్పీ పనసారెడ్డి, డీఎస్పీలు లక్ష్మినారాయణ, మల్లారెడ్డి, కె.సీతారాములు, కె.నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఎండీ.బుర్హాన్ అలీ, సీఐలు సత్యనారాయణ, వెంకటస్వామి, షేర్ అలీ, పోతారం శ్రీనివాస్, స్పెషల్‌బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రవీణ్, ఆర్‌ఐ బి.జేమ్స్, ఎస్సై రాజన్న, ఆర్‌ఎస్సై పెద్దయ్య, తిరుపతి, సీసీ పోతరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement