Sub control room
-
నేరాల నియంత్రణకు నిఘా పెంచాలి
► వరంగల్ జోన్ ఐజీపీ నాగిరెడ్డి ►జిల్లా కేంద్రంలో మొదటిసారి పర్యటన ►సబ్కంట్రోల్రూం ప్రారంభం ఆదిలాబాద్ క్రైం : నేరాలు నియంత్రించేందుకు సాంకేతిక నిఘా పెంచాలని వరంగల్ జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డి సూచించారు. శుక్రవారం మొదటి సారిగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఎస్పీ ఎం.శ్రీనివాస్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఉదయం స్థానిక పోలీసు విశ్రాంతి భవనానికి చేరుకుని సాయుధ పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన పోలీసు సబ్కంట్రోల్రూంను ప్రారంభించారు. అక్కడి నుంచి బయల్దేరి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసు స్టేషన్లో రక్షణ చర్యలు, సిబ్బంది సంక్షేమంపై సుధీర్ఘంగా చర్చించారు. పోలీసులు తీసుకుంటున్న రక్షణ చర్యలపై జిల్లా ఎస్పీ ఐజీపీకి వివరించారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, దొంగతనాల నివారణకు అదనంగా రాత్రి గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలు నియంత్రిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఐజీపీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తూ రోజురోజుకు నేరాల సంఖ్య తగ్గిస్తున్నారని అన్నారు. పోలీసులు చురుగ్గా పని చేస్తూ నేరస్తులు దొంగిలించిన సొమ్మును రికవరీ చేయాలని చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిస్థారుులో అదుపులో ఉన్నాయన్నారు. చిన్న జిల్లాలు ఏర్పడడతో పోలీసుల సంఖ్య తగ్గి పోలీసులకు అదనపు భారమవుతోందని, త్వరలో దీన్ని అధిగమించేందుకు నూతన పోలీసులను ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లా పోలీసు వాట్సప్ నెంబర్ 8333986898తో నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుకోవడంలో ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. త్వరలో జిల్లా పోలీసులకు ఇంటర్నెట్ కనెక్షన్‌తోపాటు నెలకు 1 జీబీ డాటా ఉన్న సిమ్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్, అదనపు ఎస్పీ పనసారెడ్డి, డీఎస్పీలు లక్ష్మినారాయణ, మల్లారెడ్డి, కె.సీతారాములు, కె.నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఎండీ.బుర్హాన్ అలీ, సీఐలు సత్యనారాయణ, వెంకటస్వామి, షేర్ అలీ, పోతారం శ్రీనివాస్, స్పెషల్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్, ఆర్ఐ బి.జేమ్స్, ఎస్సై రాజన్న, ఆర్ఎస్సై పెద్దయ్య, తిరుపతి, సీసీ పోతరాజు పాల్గొన్నారు. -
ఆస్తి పంపకానికి అడ్డుగా ఉందని...
మహబూబాబాద్: తన సమస్యలన్నిటికీ కూతురే కారణమని ఆగ్రహంతో ఉన్న ఓ తండ్రి ఆమెను వదిలించుకోజూశాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై వదిలి రైలెక్కాడు. అయితే, ప్రయాణీకులు అప్రమత్తం కావటంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎన్.విష్ణువర్దన్, శిల్ప దంపతులకు సుస్మిత అనే కూతురు ఉంది. మూడేళ్ల క్రితం శిల్ప అనారోగ్యంతో మృతి చెందగా విష్ణువర్దన్ మరో వివాహం చేసుకున్నాడు. సుస్మిత కొత్తగూడెంలో రెండో తరగతి చదువుతోంది. విష్ణువర్దన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి సోదరులతో ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఉమ్మడి ఆస్తిని అమ్మి తన వాటా ఇవ్వాలని విష్ణువర్దన్ కోరుతుండగా సోదరులు మాత్రం సుస్మిత కోసం అది అవసర పడుతుందని, అప్పుడే అమ్మేది లేదని అడ్డు చెబుతున్నారు. ఈ నే పథ్యంలో వరంగల్ జిల్లా కురవి మండలం జీ కొత్తూరులో జరిగే ఓ కార్యక్రమానికి విష్ణువర్ధన్ తన కూతురుతో రాగా అతని సోదరులు, బంధువులు కూడా అక్కడ అతనికి కలిశారు. శనివారం తిరుగు ప్రయూణంలో వారంతా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో చిన్న గొడవ జరిగింది. ఆ సమయంలో ప్యాసింజర్ రైలు స్టేషన్‌కు రాగానే అందరూ రైలు ఎక్కారు. అయితే, ఆగ్రహంతో ఉన్న విష్ణువర్దన్ మాత్రం కూతురును ప్లాట్‌ఫాం పైనే వదిలేసి రైలు ఎక్కాడు. దీంతో ఏడుస్తున్న ఆ బాలికను వెంటనే అదే ఫ్లాట్‌పాంపై ఉండి గమనిస్తున్న హిజ్రాలు ఎత్తుకొని.. కదులుతున్న రైలు వద్దకు పరుగెత్తారు. రైలులో ఉన్న ప్రయాణికులు అది గమనించి చైన్ లాగారు. వెంటనే వారు ఆ బోగీలో ఉన్న తండ్రికి బాలికను అప్పగించారు. కూతుర్ని వదిలేసి వెళ్లడం తగదని అంతా అతనికి హితవు పలికారు. శనివారమే ఆ బాలిక పుట్టిన రోజు కావడం.. ఆ విషయాన్ని ప్రయాణికులందరికీ చెప్పడంతో వారు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్సై రవీందర్ కూతురును, తండ్రిని సబ్‌కంట్రోల్ రూంకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేశారు. ఆ బాలిక ఏడుస్తూ చెప్పిన మాటలకు పోలీసులు చలించిపోయారు. అనంతరం ఎస్సై రవీందర్ కేక్, చాక్లెట్లు తెప్పించి అక్కడే ఆ బాలికతో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. అన్నదమ్ముల గొడవలు సాకుగా చూపి ఆ చిన్నారికి ఇబ్బంది కలగనీయవద్దని, స్థోమత లేకపోతే ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి చదివిస్తామని ఎస్సై ఆ బాలిక తండ్రి విష్ణువర్దన్‌కు చెప్పారు. తన తండ్రితో ఉంటానని ఆ బాలిక చెప్పడంతో అతనికి అప్పగించారు. రెండు గంటల పాటు సాగిన ఆ సంఘటనను వందల మంది ఆసక్తిగా చూశారు. ఆ బాలిక ఆనందంగా తండ్రి వద్దకు చేరి అందరికీ టాటా చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.