MSTC india
-
రోల్స్ రాయిస్ సహా 13 లగ్జరీ కార్లు వేలానికి
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఫ్యుజిటివ్ వ్యాపారి మోదీకి చెందిన ఖరీదైన పెయింటింగ్‌లను గత వారం వేలం వేసిన ఈడీ, సిబీఐలు తాజాగా మరో వేలానికి సిద్ధపడ్డాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ) ద్వారా 13 విలాసవంతమైన కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చే వారం వేలం నిర్వహించనుంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనమేరా, రెండు మెర్సిడెస్ బెంజ్ కార్లు, మూడు హోండాకార్లు, ఒక టొయాటా ఫార్చునర్, ఇన్నోవా తదితర కార్లను వేలానికి పెట్టింది. ఏప్రిల్ 18న ఆన్లైన్ ద్వారా వీటిని విక్రయించనుంది. వేలం వేయనున్న కార్లకు సంబంధించిన ధర, ఫోటోలు, కంపెనీ తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనుంది. పీఎంఎల్ఏ కోర్టు ప్రత్యేక అనుమతితో ఈడీ వీటిని వేలం వేయనుంది. మరోవైపు లండన్ వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్న నీరవ మోదీ గత శుక్రవారం పెట్టుకున్న రెండవ బెయిల్ పిటిషన్ కూడా వెస్ట్‌మినిస్టర్ కోర్టు నిరాకరించింది. దీంతో ఏప్రిల్ 26 తదుపరి విచారణ వరకు మోదీ జైలు ఊచలు లెక్క బెట్టాల్సిందే. కాగా 14 వేల కోట్ల రూపాయల పీఎన్‌బీస్కాం విచారణలో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 350 సీడీఐలు, టొయోటా ఫార్చునర్, ఇన్నోవా కారు, పోర్షే పనమేరా, మూడు హోండా కార్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 7.80 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నీరవ్ మోదీ గుండె పగిలే వార్త -
‘విక్రాంత్’ వేలం
సాక్షి, ముంబై: ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను వేలం వేయనున్నారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియకు నౌకాదళం తుది మెరుగులు దిద్దుతోంది. భారత ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఎంఎస్టీసీ ఇండియా అనే సంస్థ ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది. వేలం పాటలో పాల్గొనే సంస్థలు విక్రాంత్ నౌకను పరిశీలించేందుకు విధించిన తుది గడువు శనివారంతో ముగిసిపోయింది. దీంతో ఈ నెల 18వ తేదీన ఎలక్ట్రానిక్ ద్వారా వేలం పాట పాడతారు.అత్యధికంగా వేలం పలికిన సంస్థకు ఈ నౌకను అప్పగిస్తారు. వేలంపాటలో పాలుపంచుకునే సంస్థ లు డిపాజిట్ రూపంలో రూ. మూడు కోట్లు చెల్లిం చాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఈ నెల 17వ తేదీ సాయంత్రంలోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నౌక మొత్తం బరువు 15 వేల టన్నులకుపైనే. గత నాలుగు దశాబ్దాలుగా అందులో భద్రపర్చిన వస్తువులు, ఇతర కలప, ప్లాస్టిక్ సామగ్రిని బయటకు తీసిన తరువాత అసలు ఉక్కు ఎంత బరువు ఎంత ఉం టుందనే దానిపైనే ఆధారపడి వేలంపాట జరుగుతుంది. వీటన్నింటినీ తొలగించిన తరువాత ఈ నౌక నాలుగు నుంచి ఎనిమిది వేల టన్నుల వరకు బరువు ఉండొచ ్చనేది నిపుణుల అంచనా. వేలానికి ముందు రూ.మూడు కోట్లు డిపాజిట్ డబ్బులు చెల్లించాలి... ఈ ప్రకారం ఐదు రేట్లు ఎక్కువ అంటే దాదాపు రూ.15 కోట్లు వేలం రూపంలో దక్కొచ్చనేది మరికొందరి అంచనా. ప్రస్తుతం ఉక్కుకు పలుకుతున్న ధరను బట్టి ప్రతి టన్నుకు కనీసం రూ.400 డాలర్ల చొప్పున వేలం పాట పాడాలి. అయితే అందులో అనేక టన్నుల సామగ్రి ఉక్కు కోవలోకి రాకపోవడంతో వేలంలో ఎంతమేర ఆదాయం వస్తుందనేది అందులో పాల్గొనేవారిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వివిధ సేవాసంస్థలు, విద్యార్థులు, బీఎంసీ, తాజాగా డబ్బావాలాలు కూడా విక్రాం త్ను కాపాడేందుకు విరాళాలను సేకరిస్తున్నారు. అయితే వేలాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం ఎవరూ చేపట్టడం లేదు.