రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ముద్దనూరు: ముద్దనూరు–మంగపట్నం రైల్వే రహదారిలో చింతకుంట గ్రామ సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మరణించాడు. ఆయనకు 25–30 ఏళ్ల మధ్య వయసు వుంటుందని, గోధుమరంగు చొక్కా, గళ్ళ లుంగీ ధరించాడని ఎర్రగుంట్ల రైల్వే ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇతర ఆనవాళ్లు ఏమీ లభించలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడు పరిసర గ్రామాలకు చెందని వ్యక్తిౖయె ఉండవచ్చని స్థానికులు తెలిపారు.