muddy water
-
ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. చైనానే కారణం?
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నది పూర్తిగా బురదమయమైంది. ఉపయోగించుకోలేని స్థితిలో నీరు కలుషితంగా, బురదతో నిండిపోయింది. అయితే, అందుకు ఎగువ ప్రాంతంలో చైనా చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలే కారణమని, దీంతో సరిహద్దు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తూర్పు సింయాగ్ జిల్లాలోని పాసిఘట్కు చెందిన అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్కు ప్రాణదాతగా ఉన్న సియాంగ్ నదిలోని నీరు గత మూడు రోజుల్లోనే రంగు మారిపోయి, బురదమయంగా తయారైనట్లు చెప్పారు. ‘కొద్ది రోజులుగా అసలు వర్షాలే లేవు. అయినా, ఈ నదిలోని నీరు బురదమయంగా మారిపోయి ప్రవహిస్తోంది. నీటి వనరుల విభాగం అధికారులతో కలిసి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. చైనాలో ఈ నదిని యార్లుంగ్ సాంగ్పోగా పిలుస్తారు. చైనా చేపట్టిన తవ్వకాల ఫలితంగా నీటిలో బురద ప్రవహిస్తోంది. చైనాలో సియాంగ్ నది ప్రవహిస్తున్న ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఎగువ భాగంలో కొండచరియలు విరిగిపడటమూ ఒక కారణంగా చెప్పొచ్చు.’ అని తెలిపారు తూర్పు సింయాంగ్ డిప్యూటీ కమిషనర్ త్యాగి టగ్గు. సియాంగ్ నదిలో ఒక్కసారిగా నీరు రంగుమారిపోవటంపై సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలా వరకు మత్స్యకారులు, రైతులు ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. బురదమయంగా మారిన నీటితో చేపలు చనిపోతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితి చాలా మందిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కొన్ని సందర్భాల్లో ఈ నది బురదమయంగా మారింది. 2017, డిసెంబర్లో ఈ నది నల్లగా మారిపోయింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై చైనాతో చర్చలు జరిపి పరిస్థితని చక్కదిద్దింది కేంద్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి? -
వైరల్ వీడియో: బురదలో మాయమైన భర్త.. పగలబడి నవ్విన భార్య
చిత్తడి నేల, బురదలో నడిచే సమయంలో ఆచితూచి నడవాలి. సరిగా చూసుకోకుండా ఒక్క అడుగు వేసిన కాలు జారి బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. ఇలాగే ఓ వ్యక్తి బురద మట్టిలో నడుస్తూ ఆమాంతం కొన్ని సెకన్లపాటు మాయమైపోయాడు. బురద అనుకొని పెద్ద గోతిలో కాలు వేయడంతో నిండా మునిగిపోయాడు. అతడికి సాయం చేయాల్సిన భార్య.. ఇదంతా వీడియో తీస్తూ పగలబడి నవ్వింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటిష్ టూరిస్ట్ అయిన మార్టిన్ లూయిస్ తన భార్య రచెల్తో కలిసి మాల్దీవుల పర్యటను వెళ్లారు. అక్కడ వ్యూవాములా ప్రాంతంలో రోడ్డు మీద కాకుండా షార్ట్కట్ మార్గంలో వెళ్దామని అతని భార్య సలహా ఇచ్చింది. దారిలో వీరు బురదను దాటాల్సి వచ్చింది. దీంతో అతడు చెప్పులు చేతులో పెట్టుకుని ప్యాంటు తడవకుండా ఎంతో జాగ్రత్తగా బురదను దాటేందుకు కాలు ముందుకేశాడు. ఈ క్రమంలో ఒక అడుగు ముందుకు పడటంతో కాలుజారి వెంటనే బురదలో మునిగిపోయాడు. బురదలో పడిన వెంటనే మార్టిన్ కొన్ని సెకన్ల వరకు బయటకు రాలేదు. అయితే, అతడి భార్య అతడికి సాయం చేయకుండా వీడియో తీస్తూనే ఉంది. అంతేగాక భర్త గుంటలో పడటంతో పగలబడి నవ్వుతూనే ఉంది. దీంతో అతడు కోపంతో ‘‘నాతో మాట్లాడకు’’ అని భార్యతో అరిచాడు. ఈ విషయాన్ని అతడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పటి వరకు 28 మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. అనంతరం మార్టిన తన అనుభవాన్ని షేర్ చేస్తూ.‘మేము ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నాము. నా భార్య మరోవైపుకు వెళ్లేందుకు దగ్గరి దారి ఉందని ఇలా తీసుకెళ్లింది. బురదలోకి వెళితే నా పాదాలు తడిసిపోతాయని నాకు తెలుసు. నా ప్యాంటు అడుగు కూడా నాశనం అవుతుందని భావించాను. కానీ దుస్తులు పాడవ్వకుండా జాగ్రత్తగా వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఒక్క అడుగు వేయగానే బురదలో ఉన్న గోతిలోకి వెళ్లిపోయాను. బురదలోకి పూర్తిగా మునిగిపోవడంతో షాక్కు గురయ్యా. నేను కిందికి వెళ్తూనే ఉన్నాను. దాదాపు తొమ్మిది నుంచి 10 అడుగుల లోతులో ఉంది. కానీ నేను భయపడలేదు, వెంటనే నీటి నుంచి బయటకొచ్చాను. అయితే నా భార్య 10 నిమిషాలపాటు నవ్వుతూనే ఉంది. తర్వాత బీచ్ వైపుకు వెళ్లి దుస్తులకు అంటుకున్న బురద మొత్తం తొలగించుకున్నాను’ అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by The3Dumbbells (@the3dumbbellz) View this post on Instagram A post shared by The3Dumbbells (@the3dumbbellz) -
కుళాయిల నుంచి మురికి నీరు: ప్రజల ఆగ్రహం
ఎర్రగుంట్ల: తాగునీటి కుళాయిల నుంచి పురుగులతో కూడిన మురికి నీరు వస్తుండడంపై వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని 14వ వార్డు ప్రజలు శుక్రవారం ఆందోళనకు దిగారు. పన్నులు భారీగా వసూలు చేస్తూ మురికి నీరు సరఫరా చేస్తుండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నాయకుడు సుధీర్రెడ్డి ఎర్రగుంట్ల చేరుకుని మున్సిపల్ అధికారులతో మాట్లాడాడు. తాత్కాలికంగా సొంత నిధులతో 14వ వార్డు ప్రజలకు మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు.