mudered
-
ఎస్ఐ దారుణ హత్య
సాక్షి, చెన్నై: తాగిన మత్తులో ఓ మెకానిక్ మినీ లారీ ఎక్కించి ఎస్ఐను హత్య చేశాడు. తూత్తుకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీవైంకుఠం సమీపంలోని వాగై కులానికి చెందిన బాలు(50) ఎరల్ పోలీసుస్టేషన్లో స్పెషల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి వాలా వల్లన్ మార్గంలో వాహన తనికీలు చేస్తున్నారు. అటువైపుగా వచ్చిన ఓ మినీ లారీని ఆపారు. వలావల్లన్ గ్రామానికి చెందిన మురుగ వేల్(39) తాగి రావడంతో వాహనాన్ని సీజ్ చేశారు. తనిఖీలు ముగించుకుని అర్ధరాత్రి 1.30 గంటలకు కానిస్టేబుల్ పొన్ సుబ్బయ్యతో కలిసి బాలు ఇంటికి బైక్‌పై వెళుతున్నారు. తన వాహనాన్ని సీజ్ చేశారన్న ఆగ్రహంతో ఉన్న బాలు తన మెకానిక్ షెడ్లో ఉన్న మరో మినీ లారీతో బైక్‌ను ఢీకొట్టాడు. కిందపడిన వారిపై వాహనాన్ని ఎక్కించాడు. ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందగా.. కానిస్టేబుల్ సుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్పీ జయకుమార్ అదే రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మురగవేల్ ఓ న్యాయవాది ద్వారా విలాతి కుళం కోర్టులో లొంగిపోయాడు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను లారీ ఎక్కించి హతమార్చిన ఘటనను సీఎం పళనిస్వామి తీవ్రంగా పరిగణించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. అలాగే రూ. 50 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. -
మహిళా సంఘం నేత దారుణ హత్య
మహారాష్ట్రలొ మహిళా సంఘం నేత హత్యోదంతం కలకలం రేపింది. స్వల్ప వివాదం కారణంగానే మహిళ ఎన్‌సిపి కార్యకర్త, స్థానికంగా మహిళా హక్కులకోసం పనిచేస్తున్న మహిళా సంఘం నేత రేఖ భూసాహెబ్ జారేపై సోమవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బాధితురాలు రేఖ పూణే నుంచి అహ్మద్‌నగర్‌కు కారులో వెళుతున్నారు. ఆమెతోపాటు, తల్లి, కొడుకు, స్నేహితుడు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో ఒక బైక్‌ను క్రాస్ చేసిన ముందుకెళ్లడమే ఆమె చేసిన నేరం. ఆగ్రహంతో రగిలిపోయిన ఇద్దరు నిందితులు తమ బైక్‌వేగం పెంచి కారుకంటే ముందుకు దూసుకెళ్లారు. రోడ్డు మధ్యలో బైక్ నిలిపి ఈమెను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కారులోని ఇతర కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని, సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఒక దుండగులు అకస్మాత్తుగా కత్తి దూసి, రేఖ గొంతు కోసి అక్కడినుంచి ఉడాయించారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. హుటాహుటిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఈ ఘటనలో అహ్మద్‌నగర్ సుపా పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదైందని, ఈ దాడి వెనుక ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అధికారి వెల్లడించారు. -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
తుని: కుటుంబ పోషణ కోసం ఇద్దరు ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించారు. అనూహ్యంగా ఆదాయం వచ్చింది. ఇద్దరు మధ్య ఆర్థికపరమైన మనస్పర్థలు వచ్చాయి. కట్ చేస్తే వరుసకు మామైన నల్లమిల్లి రాజారెడ్డి(59)ని అల్లుడు మారెడ్డి దారుణంగా హత్య చేశాడు. బుధవారం జరిగిన సంఘటనకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, తుని పట్టణ సీఐ రమేష్‌బాబు కథనం ఇలా.. రాయవరం మండలం పుసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి రాజారెడ్డి, కర్రి మారెడ్డిలు 2006లో ఫైనాన్స్ వ్యాపారం చేపట్టారు. తుని పట్టణం సీతారాంపురంలో ఇంటిని అద్దెకు తీసుకుని పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నారు. అప్పట్లో మారెడ్డి వ్యాపారంలో రూ.ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాడు. 2014 వరకు వ్యాపారం సజావుగా సాగింది. ప్రతి సోమవారం తుని వచ్చి రెండు రోజుల పాటు వసూళ్లు చేసుకుని సొంత ఊళ్లకు వెళ్లేవారు. రాజారెడ్డి కుటుంబం విశాఖ జిల్లా విశాఖపట్టణంలో ఉంటున్నారు. మారెడ్డి పసలపూడిలో ఉంటున్నారు. అకౌంట్ విషయంలో వివాదం మొదలైంది. రాజారెడ్డి అకౌంట్‌ను చూసేవారు. ఉమ్మడి వ్యాపారంలో రూ.11 లక్షలు తేడా వచ్చింది. ఇదే విషయాన్ని మారెడ్డి తరచూ రాజారెడ్డిని ప్రశ్నించారు. తొందరలోనే సెటిల్ చేస్తానని చెప్పాడు. ఐదు నెలలుగా ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. సోమవారం రాజారెడ్డి, మారెడ్డితో పాటు రాజారెడ్డి మేనల్లుడు హరినాథ్‌రెడ్డి తుని పట్టణంలోని సీతారాంపురం అద్దె ఇంటికి వచ్చారు. మంగళవారం లైన్‌కు వెళ్లి కలెక్షన్ చేసుకుని సాయంత్రం గదికి వచ్చారు. హరినాథ్‌రెడ్డి బయటకు వెళ్లి ముగ్గురికి టిఫిన్ తీసుకువచ్చాడు. అనంతరం రాజారెడ్డి, హరినాథ్‌రెడ్డి ఒక గదిలో, మారెడ్డి వేరే గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో మారెడ్డి రాజారెడ్డి పడుకున్న గదిలోకి వెళ్లాడు. నిద్రలో ఉన్న రాజారెడ్డి తలపై ఇనుప రోడ్డుతో కొట్టాడు. శబ్ధం రావడంతో హరినాథ్‌రెడ్డి లేచి మారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మారెడ్డి విచక్షణ కోల్పోయి కొట్టడంతో రాజారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన హరినాథ్‌రెడ్డి కటుంబ సభ్యులకు, వారు 108 అంబులెన్స్‌కు సమచారం ఇచ్చారు. గాయపడిన రాజారెడ్డిని అంబులెన్స్‌లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పట్టణ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాతే హత్యకు దారి తీసిన పరి«స్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి హరినాథ్‌రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. -
రైతు దారుణ హత్య
పొలంలో నిద్రిస్తుండగా కత్తిపోట్లు సంచలనం రేకెత్తించిన ఘటన ఆలమూరు : ప్రశాంతమైన గ్రామంలో రైతు హత్యకు గురైన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గొడవలకే ఆస్కారం లేని గ్రామంలో ఏకంగా ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అజాత శత్రువుగా గ్రామస్తులు భావిస్తున్న రైతు చుండ్రు వీర్రాఘవులు (44) హత్యను చేధించేందుకు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆలమూరు పోలీసులు కథనం ప్రకారం మోదుకూరుకు చెందిన వీర్రాఘవులు తన పశువుల మకాం వద్ద రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యాన్ని నిల్వ చేశాడు. యథావిధిగా గురువారం రాత్రి తన ధాన్యం రాశుల వద్ద పహారా నిర్వహించేందుకు సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయలు దేరివెళ్లిపోయాడు. వేకువ జామున పశువుల పాలు తీసుకునేందుకు వెళ్లిన తండ్రి రాజుకు తన కుమారుడు వీర్రాఘవులు రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దీంతో తండ్రి రాజు వేస్తున్న కేకలను గమనించి పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు అక్కడకు చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై పి.దొరరాజు ఆధ్వర్యంలో ఆలమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు శరీరంలోని ఛాతీపైన, మెడపైనా రెండు కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన విధానాన్ని బట్టి చూస్తే అత్యంత పాశవికంగా, కర్కశంగా, కసితోనే ఈ పని చేసినట్టు అర్థమవుతోంది. రామచంద్రపురం డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, మండపేట రూరల్ సీఐ వి.పుల్లారావుకు స్థానిక ఎస్సై దొరరాజు హత్యకు సంబంధించి సంఘటనా వివరాలను అందజేశారు. రైతు వీర్రాఘువులు గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల లోపే హత్యకు గురయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలో స్థానికుల ప్రమేయం ఉందా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వీర్రాఘవులను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రతిష్టాత్మకంగా హత్య కేసు విచారణ ఆలమూరు మండలంలో ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జరగని నేపథ్యంలో వీర్రాఘవులు హత్య కేసును త్వరితగతిన చేధించేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి క్లూస్‌టీం, జాగిలాలను రప్పించి సోదాలను నిర్వహించారు. లభించిన వివరాలు, స్థానికులు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన తీరు చూస్తూ పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందనే అభిప్రాయినిక పోలీసులు వచ్చారు. అనేక కోణాల్లో .. హత్యకేసును చేధించేందుకు పోలీసులు అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఎవరైనా విరోదులు ఉన్నారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే దిశగా పోలీసుల దర్యాప్తు జరుగుతుందని తెలుస్తోంది. పోలీసులకు ప్రస్తుతానికి ఏవిధమైన ఆధారాలు లభించలేదని విశ్వసనీయంగా తెలిసింది. మండపేట రూరల్ సీఐ పుల్లారావు కేసును దర్యాప్తు చేస్తుండగా ఎస్సై దొరరాజు కేసును నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మండపేట, అంగర, మండపేట రూరల్ ఎస్సైలు నసీరుల్లా, పెద్దిరాజు, సీహెచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మహిళ అగ్నికి ఆహుతి
బొమ్మూరు డంపింగ్‌యార్డులో చోటుచేసుకున్న సంఘటన హత్యగా పోలీసులు కేసు నమోదు రాజమహేంద్రవరం రూరల్ : బొమ్మూరు డంపింగ్ యార్డులో గుర్తు తెలియని మహిళ మృతదేహం అగ్నికి ఆహుతైన సంఘటన శుక్రవారం సంచలనం కలిగించింది. సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ పాదాలు మినహా పూర్తిగా సజీవ దహనం కావడంతో గుర్తుపట్టని పరిస్థితి నెలకొంది. ఆ మహిళను ఎవరైనా హత్యచేసి తీసుకువచ్చి కాల్చివేశారా, లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అన్న విషయం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. బొమ్మూరు సుద్దకొండ వద్ద ఉన్న డంపింగ్ యార్డు వద్దకు మోషే అనే తొమ్మిదో రగతి విద్యార్థి బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ కాలుతున్న మృతదేహాన్ని చూసి, స్థానికులకు, మాజీ సర్పంచ్ మత్సేటి ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లాడు. విషయం తెలుసుకున్న బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కనకారావు, ఎస్సై నాగబాబులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పాదాలు మినహా పూర్తిగా మృతదేహం కాలిపోయింది. ఆమె చేతికి ఉన్న గాజులు ఆధారంగా మహిళగా గుర్తించారు.అర్బన్ జిల్లా అడ్మిన్ ఏఎస్పీ రజనీకాంత్‌రెడ్డి, తూర్పు మండల డిఎస్పీ రమేష్‌బాబులు మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళను ఎవరైనా హత్య చేసి నిర్జీవ ప్రదేశం అవడంతో ఇక్కడకు తీసుకువచ్చి కాల్చి పడేశారా అన్న కోణాలలో పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్‌టీమ్‌ను తీసుకువచ్చిన ఆధారాలు సేకరించేందుకు అనువుగా లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు మాట్లాడుతూ మృతురాలు ఎవరనేది గుర్తించి, హత్యకు గల కారణాలపై దృష్టి సారించి కేసు దర్యాప్తు చేపడతామని తెలిపారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కనకారావు మాట్లాడుతూ వీఆర్వో నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బొమ్మూరులో సంచలనం బొమ్మూరు గ్రామంలో తెల్లవారక ముందే మహిళ మృతి చెందిన విషయం వ్యాపించడంతో గ్రామస్తులతో పాటు వాహనచోదకులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. గుర్తు తెలియని మహిళ హత్య పోలీసులకు సవాల్‌గా మారనుంది. గత ఏడాది అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం వెనుక హత్యకు గురైన దుళ్ల గ్రామానికి చెందిన యలమర్తి వెంకటేష్ (24) కేసును ఇప్పటివరకు పోలీసులు చేధించలేకపోయారు. మృతదేహం ఆచూకీ తెలిసిన కేసును ఇప్పటివరకు చేధించలేని పోలీసులు ఈ కేసును ఏవిధంగా చేధిస్తారన్న అనుమానం ప్రజల్లో ఉంది. -
పెళ్లి చెడగొట్టాడనే హత్య
ముద్దాయి అరెస్టు ఐ.పోలవరం : కేశనకుర్రు గ్రామంలో ఈనెల 13వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తనకు పెళ్లి సంబంధాలు రాకపోవడానికి కారకుడని భావించి ఒకప్పటి తన మిత్రుడిని హత్య చేశాడు. పాత ఇంజరం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎల్.అంకయ్య గురువారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. కేశనకుర్రు గ్రామ పరిధి పెద్ద చెరువు గట్టు ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు, అంగాడి సత్తిరాజు (26), చింతాప్రసాద్ స్నేహితులు. ఈ ముగ్గురూ చెడు అలవాట్లకు బానిసలయ్యారు. ఆ నేపథ్యంలో సత్తిరాజుకు వెంకటేశ్వర్లుకు మధ్య మనస్పర్థలు పెరి గాయి. 2011 నుంచి తనకు వచ్చిన పెళ్లి సంబంధాలు తప్పిపోడానికి సత్తిరాజే కారకుడని వెంకటేశ్వర్లు తెలుసుకున్నాడు. దాంతో అతనిపై కక్ష పెంచుకొని అతనిని చంపాలని సమయం కోసం వేచిచూస్తున్నాడు. చింతా ప్రసాద్‌కు పెళ్లికావడంతో అతను అత్తవారి ఊరైన గొర్రెపూడి వెళ్లిపోయాడు. ఈనెల 11వ తేదీన చింతా ప్రసాద్ ఊరిలోకి వచ్చాడు. అతన్ని కచ్చితంగా సత్తిరాజు కలుస్తాడని వెంకటేశ్వర్లు భావించాడు. అదే విధంగా ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో చింతా ప్రసాద్, అంగాడి సత్తిరాజు, పి. రాంబాబు గోదావరి ఒడ్డుకు వెళ్లారు. ఆవిషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కత్తిలాంటి చాకుతో వారు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. నీతో మాట్లాడాలి రమ్మనమని సత్తిరాజును పిలిచాడు. దానికి అతను తిరస్కరించడంతో తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో అతని ఛాతిపై పొడిచాడు. గాయపడిన సత్తిరాజు పరుగుతీస్తూ గోదావరి గట్టు ఎక్కి అక్కడ పడిపోయాడు. స్థానికులు అతన్ని మోటారు సైకిల్‌పై తొలుత మురమళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడ నుంచి అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లేసరికి సత్తిరాజు చనిపోయాడు. డీఎస్పీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన సీఐ రమణరావు ఈనెల 20వ తేదీన వెంకటేశ్వర్లును అతని ఇంటి వద్ద అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు చింతా వెంకటేశ్వర్లును గురువారం కోర్టుకు హాజరు పరిచారు. అవే కూరగాయాలు దిగిరామంటున్న ధరలు వరదలకు నీటమునిగిన కూరగాయల పంటలు వేసవిలో మండడం మొదలైన కూరగాయల రేట్లు నేటికీ ఆదిశలోనే కొనసాగుతున్నాయి. కొన్నింటి ధర స్వల్పంగా తగ్గినప్పటికీ మిగిలినవాటి రేట్లు పెరగడంతో జనం బెంబేలెత్తుతున్నారు. గోదావరి వరదలు మన ప్రాంతంలోని కూరగాయల పంటలను దెబ్బతీయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అమలాపురం : వేసవి ఆరంభంలో చుక్కలనంటిన కూరగాయల ధరలు ఇప్పటికీ దిగి రావడం లేదు. వేసవి ఎండలకు మన ప్రాంతంలో పంటలు దెబ్బతినడంతో టమాటా, బీన్స్ గింజలు, చిక్కుడు కాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెల నుంచి ఇతర ప్రాంతాల్లో పంట కాలం పూర్తి కావస్తుండడంతో క్యాప్సికమ్, బంగాళాదుంప వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయి. వీటి ధరల తగ్గుతాయనుకుంటున్న సమయంలో గోదావరికి వరదలు రావడంతో కూరగాయ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దాంతో కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. క్యాప్సికమ్ ధర కేజీ రూ.80 వరకు ఉంది. వారం రోజుల క్రితం దీని ధర రూ.90. బీట్రూట్, క్యారెట్ ధరలు రూ.40 ఉండగా, అల్లం ధర రూ.60 వరకు ఉంది. బీన్స్కాయల ధర రూ.60, బంగాళాదుంప రూ.24 నుంచి రూ.26 వరకు ఉంది. టమాటా ధర గత నెలకన్నా తక్కువ అనిపిస్తున్నా ఇప్పటికీ కేజీ రూ.32 వరకు ఉండడం విశేషం. ఇవన్నీ దిగుమతి చేసుకొనేవే. బంగాళాదుంప కోల్‌కతా నుంచి, మిగిలిన కాయగూరలు బెంగళూరు, చిత్తూరుల నుంచి దిగుమతి అవుతున్నాయి. అక్కడ పంట కాలం పూర్తి కావస్తుండడం, ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొంత పంట దెబ్బతినడం, ఎగుమతులకు అనువైన వాతావరణం లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. గత వారంతో పోల్చుకుంటే వీటి ధరలు స్వల్పంగా తగ్గినా సాధారణ స్థాయికి వీటి వచ్చే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ముంచిన వరదలు గోదావరికి వచ్చిన వరదలు కూరగాయ రైతులను ఎక్కువగా నష్టపరిచాయి. ఆలమూరు, కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయ పంటలు సాగవుతుంటాయి. చిక్కుడు, గోరుచిక్కుడు, ఆనప, దొండ, బీర, పొట్ల, కాకరకాయ వంటి పందిరి కూరగాయలు, బెండ, టమాట, వంగ వంటి కాయగూరలతోపాటు తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల సాగు ఎక్కువ. ముఖ్యంగా ఆలమూరు, పి.గన్నవరం, అయినవిల్లిలో విస్తృతంగా వీటిని సాగు చేస్తుంటారు. గోదావరి వరదల ప్రభావం ఈ మండలాలపైనే ఎక్కువగా ఉంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం 2,928 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అయితే వాస్తవంగా ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా. ఈ ప్రభావంతో స్థానికంగా పండే ఈ రకం కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది.