జలపాతం.. జనసందోహం
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం సబ్బితం పంచాయతీ పరిధిలోని గౌరీగుండాలు జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. గౌరీగుండాల అందాలను తిలకించేందుకు అధికసంఖ్యలో జనం తరలిరావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు కురువడంతో రోడ్డు బురదమయంగా మారింది. దీంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. నడిచే ఓపికలేనివారు స్థానికంగా ఉన్న ఎడ్లబండ్లపై జలపాతం చేరుకున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ప్రత్యేక దృష్టి సారించి ఈ రహదారిని బాగు చేయాలని కోరారు.