mugdha godse
-
ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం.. అయితే ఏంటి?
ముంబై: ఎవరైనా, ఎపుడైనా, ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చని, దానికి వయసుతో సంబంధం ఉండదని అంటున్నారు నటి ముగ్ధా గాడ్సే. కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయని, మనసుకు నచ్చిన వారితో జీవితం పంచుకోవడం కంటే ఆనందం మరేదీ ఉండదని పేర్కొన్నారు. కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ముగ్దా గాడ్సే.. మాధుర్ భండార్కర్ ‘ఫ్యాషన్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గలీ గలీ చోర్ హై, విల్ యూ మ్యారీ మీ?, హీరోయిన్ వంటి సినిమాల్లో తళుక్కుమన్నారు. ఇక వ్యక్తిగత విషయాకొనిస్తే, గత కొన్నేళ్లుగా ముగ్ధా, నటుడు రాహుల్ దేవ్(52)తో సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమ బంధానికి త్వరలోనే ఎనిమిదేళ్లు నిండబోతున్నాయి. ఈ నేపథ్యంలో జూమ్ టీవీతో మాట్లాడిన ముగ్ధ.. రాహుల్ దేవ్ తాను తమ బంధం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి చెబుతూ.. ‘‘భాగస్వామిని ఎంచుకోవడం అంటే షాపింగ్ చేయడం వంటిది కాదు కదా. నాకు ఈ కలర్ బ్యాగ్ నచ్చింది కాబట్టి కొనుక్కుంటున్నాను అన్నట్లుగా ఉండదు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికైనా ప్రత్యక్ష అనుభవంలోకి వస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. వయసుతో అసలు సంబంధం ఉండదు’’అని పేర్కొన్నారు. కాగా టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన రాహుల్ దేవ్‌కు గతంలో రీనాతో వివాహం జరిగింది. (చదవండి: ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన నటి) వీరికి సిద్ధాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇక క్యాన్సర్ బారిన పడిన రీనా 2009లో మరణించడంతో రాహుల్ ఒంటరివాడయ్యాడు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో ముగ్ధాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అన్నట్లు.. ముగ్ధా రాహుల్ కంటే వయసులో సుమారు 18 ఏళ్లు చిన్నది. దీంతో గతంలో అనేకమార్లు ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే, రాహుల్ మాత్రం తమ ఇరు కుటుంబాలకు తమ బంధం పట్ల అభ్యంతరాలు లేవని, సంతోషంగా ఉంటే వయస్సు అనేది పెద్ద సమస్య కాదంటూ కౌంటర్ ఇచ్చాడు. (చదవండి: వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు) -
ఆమె నాకంటే 18 ఏళ్లు చిన్నది, అయితే
తెలుగు చిత్రసీమతో పాటు దక్షిణాదిలో ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా మెప్పించిన రాహుల్ దేవ్ తాజాగా మోడల్, నటి ముగ్ధా గాడ్సేతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వారి ప్రేమను గతంలోనే రాహుల్ మీడియాకు వెల్లడించాడు. అయితే రాహుల్ దేవ్‌కు 51ఏళ్లు కాగా ముగ్ధా గాడ్సేకు 33ఏళ్లు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా రాహుల్ స్పందిస్తూ..మా అమ్మ నాన్న కంటే పది యేళ్లు చిన్నదని.. అయినా వారు చాలా సంతోషంగా ఉంటారన్నాడు. అలాగే ముగ్ధా తన కంటే 18ఏళ్లు చిన్నదని చెప్పుకొచ్చాడు. అయినా మనం సంతోషంగా ఉంటే వయస్సు అనేది పెద్ద సమస్య కాదని రాహుల్ అభిప్రాయపడ్డాడు. అయితే రాహుల్‌కు ఇదివరకే చిన్ననాటి స్నేహితురాలు రైనాతో వివాహం జరగ్గా వీరికి సిద్ధార్థ అనే కుమారుడు జన్మించాడు. 2009లో రైనా క్యాన్సర్‌తో మరణించింది. ముగ్ధా గాడ్సేను తొలి చూపులోనే ప్రేమించలేదని..మొదట తాను ఓ ఫ్రెండ్ పెళ్లిలో ఆమెను చూశానన్నాడు. మొదట మేము మంచి స్నేహితులయ్యామని తరచూ కుటుంబ ఫంక్షన్లో కలిసే వాళ్లమని పేర్కొన్నాడు. అలా మా మధ్య బంధం మరింత ధృడపడిందని పేర్కొన్నాడు. తమ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు సమ్మతమేనని రాహుల్ చెప్పుకొచ్చాడు. -
ఆయనంటే క్రేజ్
హైదరాబాద్: నొవాటెల్‌లో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను గురువారం ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి ముగ్ధ గాడ్సే ప్రారంభించారు. ఈమెతో ‘సాక్షి’ కాసేపు ముచ్చటించింది. ఆమె మాటల్లోనే.. ‘నేను పుట్టింది.. పెరిగింది మహారాష్ట్రలో. స్కూల్లో జరిగే ప్రతి పోటీల్లో నేనే విన్నర్. చదువు విషయానికొస్తే డిగ్రీ పూర్తి చేశాను. నిజానికి నేను ఇండస్ట్రీకి రాక ముందు చదువుకునే రోజుల్లో మాది చాలా సాదాసీదా పేద కుటుంబం. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. పాకెట్ మనీ, కాలేజ్ ఫీజు కోసం పార్ట్ టైంగా వంట నూనె అమ్మి రోజు రూ. 80 సంపాదించేదాన్ని. అప్పట్లో నన్ను చూసిన వాళ్లలో కొంతమంది నన్ను బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనమని సలహా ఇస్తుంటే మొదట్లో నవ్వుకునేదాన్ని. తెలిసిన ఆవిడ సహాయంతో ఆమెతో పాటు జిమ్‌కి వెళ్లటం మొదలు పెట్టాను. అలా అక్కడ నుంచి చిన్న చిన్న బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనటం మొదలు పెట్టా. క్రమంగా పట్టుదల కూడా పెరిగింది. అలా ‘ఫెమీనా మిస్ ఇండియా’ కాంటెస్ట్‌లో ‘మిస్ పెర్ఫెక్ట్’ టైటిల్ గెలుచుకున్నా. అలా అలా మోడలింగ్ చేస్తూ యాడ్స్, సినిమాలు, రియాలిటీ షోలు.. ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నాను. నాలో ఉన్న టాలెంట్‌ని నాకన్నా ముందు నా చుట్టూ ఉన్న ప్రజలే గుర్తించి నన్ను ఈ స్టేజ్‌లో ఉంచారు. నా మొదటి మూవీ ‘ఫ్యాషన్’ అవడం, ఆ సినిమా సక్సెస్‌తో మా జీవితాలు మారిపోయాయి. నాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. హైదరాబాద్ అనగానే వెస్ట్రన్ అమ్మాయిలే ఎక్కువగా ఉంటారని.. నేను కూడా వెస్ట్రన్ వేర్లో ఈ ఎక్స్‌పోలో అడుగు పెట్టాను. ఇక్కడి కల్చర్ చూశాక అమ్మాయిలు ట్రెడిషన్‌కి ఎంత వేల్యూ ఇస్తారో తెలిసింది. ఇక కామ్‌గా వెళ్లి ఈ ఎక్స్ పోలోనే ఒక మంచి సంప్రదాయ డ్రెస్ మార్చుకున్నా. ప్రస్తుతం నేను నటించిన బాలీవుడ్ సినిమా ‘క్రేజీ కియా రే’ వచ్చే నెల రిలీజ్ కాబోతుంది. తమిళ్లో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే తెలుగు ప్రజల మనసులో నాకు స్థానం కల్పించుకోవాలని ఎంతో ఆశ. మంచి స్టోరీ, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర ఇస్తే కచ్చితంగా తెలుగులో కూడా నటిస్తాను. హీరో ‘నాగ్’ అంటే చాలా క్రేజ్. ఆయనతో కలిసి నటించాలని ఉంది’.