ఆమె నాకంటే 18 ఏళ్లు చిన్నది, అయితే | Rahul Dev On Age Gap With Mugdha Godse | Sakshi
Sakshi News home page

ప్రేమకు వయసు సంబంధం లేదు: నటుడు

Published Mon, Mar 9 2020 8:19 PM | Last Updated on Mon, Mar 9 2020 8:36 PM

Rahul Dev On Age Gap With Mugdha Godse - Sakshi

తెలుగు చిత్రసీమతో పాటు దక్షిణాదిలో ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా మెప్పించిన రాహుల్‌ దేవ్‌ తాజాగా మోడల్, నటి ముగ్ధా గాడ్సేతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వారి ప్రేమను గతంలోనే రాహుల్‌ మీడియాకు వెల్లడించాడు. అయితే రాహుల్‌ దేవ్‌కు 51ఏళ్లు కాగా ముగ్ధా గాడ్సేకు 33ఏళ్లు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా రాహుల్‌ స్పందిస్తూ..మా అమ్మ నాన్న కంటే పది యేళ్లు చిన్నదని.. అయినా వారు చాలా సంతోషంగా ఉంటారన్నాడు. అలాగే ముగ్ధా తన కంటే 18ఏళ్లు చిన్నదని చెప్పుకొచ్చాడు.

అయినా మనం సంతోషంగా ఉంటే వయస్సు అనేది పెద్ద సమస్య కాదని రాహుల్‌ అభిప్రాయపడ్డాడు. అయితే రాహుల్‌కు ఇదివరకే చిన్ననాటి స్నేహితురాలు రైనాతో వివాహం జరగ్గా వీరికి సిద్ధార్థ అనే కుమారుడు జన్మించాడు. 2009లో రైనా క్యాన్సర్‌తో మరణించింది. ముగ్ధా గాడ్సేను తొలి చూపులోనే ప్రేమించలేదని..మొదట తాను ఓ ఫ్రెండ్‌ పెళ్లిలో ఆమెను చూశానన్నాడు. మొదట మేము మంచి స్నేహితులయ్యామని తరచూ కుటుంబ ఫంక్షన్‌లో కలిసే వాళ్లమని పేర్కొన్నాడు. అలా మా మధ్య బంధం మరింత ధృడపడిందని పేర్కొన్నాడు. తమ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు సమ్మతమేనని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement