Rahul Dev
-
థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా 1920
‘‘నాకు హారర్ సినిమాలు చూడాలంటే భయం. కానీ ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమా చూడాలనిపిస్తోంది. చూడాలని పించేలా ఈ సినిమాను చేశారు’’ అన్నారు నాగార్జున. అవికా గోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్ పండోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’. దర్శక–నిర్మాత మహేశ్‌భట్ రచన, సమర్పణలో కృష్ణాభట్ దర్శకత్వంలో రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్ డా.రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘మహేశ్భట్గారు చాలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ‘తెలుసా మనసా’ (‘క్రిమినల్’) పాటను ఆయన చేయించుకున్న విధానం నాకిప్పటికీ గుర్తు ఉంది. ఇక ‘1920’ ట్రైలర్ బాగుంది. ఇలాంటి సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. అవికా కెరీర్లో ఈ సినిమా పెద్దహిట్‌గా నిలవాలి. అలాగే ఇవాళ ఒక పెద్ద సినిమా ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా అందరినీ మళ్లీ థియేటర్లోకి తీసుకు రావాలి.. జై శ్రీరామ్’’ అన్నారు నాగార్జున. ‘‘నాగార్జునగారి వల్లే ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ను తెలుగులో విడుదల చేస్తున్నాం. వాళ్ల నాన్నగారి విలువలు, సంస్కారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు నాగార్జున. విలువలు, సంస్కారం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ‘1920’ సినిమా కథ ఈ అంశాల గురించే’’ అన్నారు మహేశ్‌భట్. ‘‘నా తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ నుంచి నాగార్జునగారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీలో నా తొలి చిత్రం ‘1920’ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. ‘1920’ నా కెరీర్లో స్పెషల్ మూవీ’’ అన్నారు అవికా గోర్. ‘‘ఇదొక ఎమోషనల్ లవ్‌స్టోరీ. హారర్‌లో ఎమోషన్ ను ప్రయత్నించడం ఇదే తొలిసారి’’ అన్నారు కృష్ణాభట్. -
సౌత్ సినిమాల్లో ఇప్పటికీ అదే ధోరణి.. రాహుల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దక్షిణాది సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నటుడు రాహుల్ దేవ్. ఇప్పటికీ వారు ఇంకా 1970-80ల్లో వచ్చిన ధోరణినే అనుసరిస్తున్నాయని అన్నారు. వారు చూపించేవి నిజ జీవితంలో జరగపోయినా.. దక్షిణాది సినిమాలు బాగానే నడుస్తున్నాయని రాహుల్ దేవ్ చెప్పారు. ఇటీవల ఆవ్న గ్యాస్‌లైట్ అనే క్రైమ్ థిల్లర్‌లో కనిపించారు. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సారా అలీ ఖాన్, చిత్రాంగద సింగ్, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాహల్‌ను.. బాలీవుడ్‌తో పోలిస్తే ఎక్కువ ప్రాంతీయ చిత్రాలలో నటించడంపై ప్రశ్నించారు. దీంతో రాహుల్ దేవ్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ తనను చాలా తక్కువగా ఉపయోగించుకుందని అన్నారు. అయితే టాలీవుడ్ పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు రాహుల్ దేవ్. రాహుల్ మాట్లాడుతూ.. 'సృజనాత్మకతను ఏ విధంగానైనా చెప్పొచ్చు. మీరు దక్షిణాది వైపు చూస్తే, వారి సినిమాలు బాగా ఆడుతున్నాయి, కానీ అవన్నీ 1970- 80ల చిత్రాల ధోరణినే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. అప్పటీ కథనే మళ్లీ చెబుతున్నారు. వారి డైలాగ్‌లు, నటీనటుల జీవితం కంటే పెద్దవి. కొన్ని ఓవర్ ది టాప్ యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. కానీ కథ పాతదే అయినా అదే కథను చెప్పే విధానం.. ప్రేక్షకులను మెప్పించడం చాలా ముఖ్యం. కాబట్టి కథను వ్యక్తీకరించిన విధానం, ఆడియన్స్ దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ముఖ్యం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నా'. అని అన్నారు. తన నటన జీవితంపై మాట్లాడుతూ..' ఓటీటీలతో ప్రస్తుత నటుడి నైపుణ్యం చాలా సహజంగా మారిపోయింది. ఉదాహరణకు నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు మధ్య ఫైటింగ్ జరుగుతోంది. అందులో ఎవరిదీ తప్పు అని మనం నిర్ణయిస్తాం. అదే సినిమా విషయాకొనిస్తే అదే ఎక్కువమంది ఇష్టపడతారు. సినిమాల్లో అదే ఫైట్‌ను ఆ ధోరణితో చూడరు. అంటే సృజనాత్మకత ఒక వ్యక్తీకరణ మాత్రమే. ఇది మీరు ఏ విధంగానైనా వ్యక్తీకరించవచ్చు.' అని అన్నారు. కాగా.. ఛాంపియన్, ఓంకార, టోర్బాజ, రాత్ బాకీ హై వంటి చిత్రాలలో రాహుల్ నటించారు. ఇటీవల కిచ్చా సుదీప్తో కలిసి కన్నడ చిత్రం కబ్జాలో కూడా కనిపించారు. ఇందులో ఉపేంద్ర, శ్రియ శరణ్ కూడా నటించగా.. ఈ చిత్రం గత నెలలోనే విడుదలైంది. -
ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం.. అయితే ఏంటి?
ముంబై: ఎవరైనా, ఎపుడైనా, ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చని, దానికి వయసుతో సంబంధం ఉండదని అంటున్నారు నటి ముగ్ధా గాడ్సే. కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయని, మనసుకు నచ్చిన వారితో జీవితం పంచుకోవడం కంటే ఆనందం మరేదీ ఉండదని పేర్కొన్నారు. కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ముగ్దా గాడ్సే.. మాధుర్ భండార్కర్ ‘ఫ్యాషన్’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గలీ గలీ చోర్ హై, విల్ యూ మ్యారీ మీ?, హీరోయిన్ వంటి సినిమాల్లో తళుక్కుమన్నారు. ఇక వ్యక్తిగత విషయాకొనిస్తే, గత కొన్నేళ్లుగా ముగ్ధా, నటుడు రాహుల్ దేవ్(52)తో సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమ బంధానికి త్వరలోనే ఎనిమిదేళ్లు నిండబోతున్నాయి. ఈ నేపథ్యంలో జూమ్ టీవీతో మాట్లాడిన ముగ్ధ.. రాహుల్ దేవ్ తాను తమ బంధం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి చెబుతూ.. ‘‘భాగస్వామిని ఎంచుకోవడం అంటే షాపింగ్ చేయడం వంటిది కాదు కదా. నాకు ఈ కలర్ బ్యాగ్ నచ్చింది కాబట్టి కొనుక్కుంటున్నాను అన్నట్లుగా ఉండదు. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికైనా ప్రత్యక్ష అనుభవంలోకి వస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. వయసుతో అసలు సంబంధం ఉండదు’’అని పేర్కొన్నారు. కాగా టాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన రాహుల్ దేవ్‌కు గతంలో రీనాతో వివాహం జరిగింది. (చదవండి: ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన నటి) వీరికి సిద్ధాంత్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇక క్యాన్సర్ బారిన పడిన రీనా 2009లో మరణించడంతో రాహుల్ ఒంటరివాడయ్యాడు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో ముగ్ధాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అన్నట్లు.. ముగ్ధా రాహుల్ కంటే వయసులో సుమారు 18 ఏళ్లు చిన్నది. దీంతో గతంలో అనేకమార్లు ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే, రాహుల్ మాత్రం తమ ఇరు కుటుంబాలకు తమ బంధం పట్ల అభ్యంతరాలు లేవని, సంతోషంగా ఉంటే వయస్సు అనేది పెద్ద సమస్య కాదంటూ కౌంటర్ ఇచ్చాడు. (చదవండి: వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు) -
ఆమె నాకంటే 18 ఏళ్లు చిన్నది, అయితే
తెలుగు చిత్రసీమతో పాటు దక్షిణాదిలో ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా మెప్పించిన రాహుల్ దేవ్ తాజాగా మోడల్, నటి ముగ్ధా గాడ్సేతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వారి ప్రేమను గతంలోనే రాహుల్ మీడియాకు వెల్లడించాడు. అయితే రాహుల్ దేవ్‌కు 51ఏళ్లు కాగా ముగ్ధా గాడ్సేకు 33ఏళ్లు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా రాహుల్ స్పందిస్తూ..మా అమ్మ నాన్న కంటే పది యేళ్లు చిన్నదని.. అయినా వారు చాలా సంతోషంగా ఉంటారన్నాడు. అలాగే ముగ్ధా తన కంటే 18ఏళ్లు చిన్నదని చెప్పుకొచ్చాడు. అయినా మనం సంతోషంగా ఉంటే వయస్సు అనేది పెద్ద సమస్య కాదని రాహుల్ అభిప్రాయపడ్డాడు. అయితే రాహుల్‌కు ఇదివరకే చిన్ననాటి స్నేహితురాలు రైనాతో వివాహం జరగ్గా వీరికి సిద్ధార్థ అనే కుమారుడు జన్మించాడు. 2009లో రైనా క్యాన్సర్‌తో మరణించింది. ముగ్ధా గాడ్సేను తొలి చూపులోనే ప్రేమించలేదని..మొదట తాను ఓ ఫ్రెండ్ పెళ్లిలో ఆమెను చూశానన్నాడు. మొదట మేము మంచి స్నేహితులయ్యామని తరచూ కుటుంబ ఫంక్షన్లో కలిసే వాళ్లమని పేర్కొన్నాడు. అలా మా మధ్య బంధం మరింత ధృడపడిందని పేర్కొన్నాడు. తమ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు సమ్మతమేనని రాహుల్ చెప్పుకొచ్చాడు. -
ఈ బసవరాజు బయటికి వస్తే... ఇక అంతే!
ఉత్తమ విలన్ ఇతని పేరు బసవరాజు. తను సహజంగా బయటికి రాడు. వచ్చాడంటే ఏదో ఒక దారుణం జరుగుతుంది. అతడి అన్న రామరాజు... లోకల్ ఎం.ఎల్.ఏ. ఆలోచన అతనిది. ఆచరణ ఇతనిది. పై పరిచయ వాక్యాలు బసవరాజుగా నటించిన ‘రాహుల్ దేవ్’ గురించి ‘తులసి’ సినిమాలో వినిపిస్తాయి. విలన్ అంటే... డైలాగులతోనైనా భయపెట్టాలి. దేహదారుఢ్యంతోనైనా భయపెట్టాలి. హావభావాలతోనైనా భయపెట్టాలి. అలా అని... రాహుల్ దేవ్ వీర శూర భీకర... పంచ్ డైలాగులు వాడలేదు. అదే పనిగా తన ‘ప్యాక్’ బాడీని ప్రదర్శించలేదు. హావభావాలు కూడా అతిగా ప్రదర్శించలేదు. ‘ఎంత చేయాలో అంత’ అనే లెక్క ప్రకారమే నటిస్తున్నట్లుగా ఉంటుంది తప్ప... ప్రేక్షకులను భయపెట్టడానికి నటనతో నానా తిప్పలు పడినట్లు కనిపించదు. ‘టక్కరి దొంగ’ సినిమాలో ‘రేయ్ నేను నీ తమ్ముడిని రా’ అని ఒకవైపు బంధం గుర్తు తెస్తూనే... మరోవైపు... నిజం చెప్పించడానికి పది ఛాన్సులు ఇవ్వగలడు. ఆ తరువాత... ఏ ఛాన్సూ ఉండదు. అడకత్తెరతో వేళ్లను ఒక్కటొక్కడిగా కట్ చేయగలడు.మహేష్‌బాబు ‘టక్కరిదొంగ’లో ‘శాకా’గా తెలుగు తెరకు పరిచయం అయిన రాహుల్‌దేవ్... మొదటి సీన్‌తోనే ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. ఆ సినిమా బాగా ఆడి ఉంటే... తెలుగు తెరపై రాహుల్ దేవ్ మరింత బాగా పాపులరై ఉండేవాడేమో. ‘నా బెంగుళూరులో నన్ను కొట్టి బతుకుదామనే’ అని ‘బసరావజు’గా వార్నింగ్ ఇచ్చినా...‘నన్ను ఎదిరించాలంటే... ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలి’ అంటూ శ్రీశైలంగా ‘చిన్నోడు’ సినిమాలో తన శక్తి ఏమిటో చెప్పదలిచినా.... రాహుల్ దేవ్ అంటే విలన్. ఒక స్టైలిష్ విలన్. అతని విలనిజం నడకలో ఉందా, పల్చటి పొడవాటి తల వెంట్రుకలలో ఉందా, కండల్లో ఉందా... కళ్లలో ఉందా... కాస్త లోతుగా తెలుసుకోవాల్సిందే! హీరో పర్సనాలిటీ ఉన్న రాహుల్ ‘విలన్’ ఎలా అయ్యాడు?తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందట. డైరీలో మనమొకటి రాసుకుంటే... విధి మన నుదుట మరొకటి రాస్తుందట. రాహల్ దేవ్ మొదట మోడల్. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాడు.అయితే ‘మోడల్’ కావాలనిగానీ, ‘యాక్టర్’ కావాలనిగానీ ఎప్పుడూ అనుకోలేదు. క్రికెటర్ కావాలనుకున్నాడు. ‘ఇలా కావాలనుకుంటున్నాను’ అని చెప్పే పరిస్థితి ఇంట్లో లేదు. ఒంట్లోనేమో ధైర్యం లేదు.నాన్న ఐపీఎస్ ఆఫీసర్, అమ్మ టీచర్. చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో తన డ్రీమ్ గురించి రాహుల్‌కు పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. కాలేజీ రోజుల్లో ఒక డిస్కోలో రాహుల్‌ను చూసిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ ఖోల్సా రేమండ్స్ కోసం మోడలింగ్ చేయమని అడిగాడు. రాహుల్‌కు మోడలింగ్ గురించి ఏమీ తెలియదు, రోహిత్ ఖోల్సా గురించి కూడా ఎప్పుడూ విని ఉండలేదు. ‘ఒక్కసారి ట్రై చేసి చూద్దాం’ అని రంగంలోకి దూకాడు. అలా... మోడల్ అయ్యాడు.ఆ తరువాత... ‘దస్’ సినిమాతో వెండితెర మీదికి వచ్చాడు.సాధారణంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన తరువాత... సినిమాల్లోకి వస్తారు. రాహుల్ మాత్రం... సినిమాల్లోకి వచ్చాక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ‘ఛాంపియన్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ‘నసీర్ అహ్మద్’గా ఆకట్టుకునే నటనను ప్రదర్శించాడు. ‘‘మోడలింగ్‌లో పర్సనల్ స్టైల్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. అయితే నటన ఇందుకు విరుద్ధం. ఒక పాత్ర పోషిస్తున్నప్పుడు పాత్రే కనిపించాలి తప్ప మనం కాదు’’ అంటాడు రాహుల్. అందుకే... తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా తన పేరుతో కంటే... ‘సాధు’ ‘బసవరాజు’ ‘వీరుభాయి’ మొదలైన పాత్రలతోనే రాహుల్ దేవ్ ఫేమస్ అయ్యాడు.‘మోడల్స్ నటులుగా మారితే వారి నటన అంతంత మాత్రంగానే ఉంటుంది’ అనే విమర్శ తప్పని... రాహుల్ దేవ్ విలనిజాన్ని చూస్తే మరోసారి అర్థమవుతుంది. అందుకే... రాహుల్ కేవలం నటుడు మాత్రమే కాదు ‘ఉత్తమ విలన్’ కూడా. -
విఐపి రిపోర్టర్ - పార్వతిపురం ఏఎస్పి రాహుల్ దేవ్