mukunda reddy
-
తేల్చే వరకు తెగించి కొట్లాడుడే..
సాక్షి, మంకమ్మతోట(కరీంనగర్)/హుజూరాబాద్ : సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. కార్మికులకు ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది. ఆర్టీసీ సమ్మె గురువారం ఆరో రోజుకు చేరుకుంది. దసరా పండుగ వరకు వేచి చూసిన కార్మికులు పోరాటాలను క్రమంగా ఉధృతం చేస్తున్నారు. జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు కరీంనగర్ బస్టాండ్ నుంచి తెలంగాణచౌక్ మీదుగా బస్టాండ్వరకు అఖిప పక్షం నాయకులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలుపారు. కార్మికులు బస్టాండ్ ఆవరణలోని డిపోల వద్ద ఆందోళన చేశారు. హుజూరాబాద్‌లో ఆర్టీసి డిపో నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్డీవో చెన్నయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వ ఇచ్చే రాయితీలు చెల్లించాలని, అన్ని రకాల ట్యాక్స్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఖండించారు. దసరా పండుగ జరుపుకుని తిరుగి వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ రద్దీగా కనిపించింది. కార్మికులెవరూ విదులకు హాజరు కాలేదు. అ«ధికారులు ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించే ఏర్పాటు చేశారు. బస్సుల్లో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపించారు. హుజూరాబాద్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఆర్టీసీ కార్మికులు వెనుకడుగు వేయం.. ప్రభుత్వం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపేంతవరకు సమ్మె విషయంలో వెనుకగుడు వేసేది లేదని, ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామని అఖిల పక్ష నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీని విలీనం చేసి కార్మికులకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సాధించుకుంటే మన రాష్ట్రంలో మన నీళ్లు, మన నిధులతో బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పి పండుగ పూట కార్మికుల కుటుంబాలను పస్తులుంచిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల జీతభత్యాల సవరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన అన్ని బెన్ఫిట్స్ ప్రభుత్వం కల్పించాలని, కార్మికులు సంతోషంగా ఉంటేనే ఏసంస్థ అయినా అభివృద్ధి పథంలో నడుస్తుందనే విషయాన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వెంటనే ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. సంఘీభావ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, నగర అధ్యక్షుతు బేతి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శులు కూన శోభారాణి, సృజన్‌కుమార్, ఏఐటీయుసీ నాయకుడు టేకుమల్ల సమ్మయ్య,టీడీపీ నగర అధ్యక్షుడు ఆగయ్య, జేఏసీ నాయకులు జక్కుల మల్లేశం, కె.సురేందర్‌రాజు, గుర్రాల రవీందర్, టీఆర్.రెడ్డి, ఎన్‌కె.రాజు, ఎంపీ.రెడ్డి, కాళిదాసు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పీఎల్.రావు, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, రమేశ్, జె.రవీందర్, టీఎస్.సింగ్, యాకుబ్‌పాషా, సమ్మిరెడ్డి, సర్దార్, అశోక్‌బాబు, రాజమణి, ఎస్ఎస్.రాణి, విజయలక్ష్మి, శ్రీదేవి, పద్మ, సారయ్య, ఎన్వీ రెడ్డి, యూసఫ్‌అలీ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ 567 బస్సులు ఏర్పాటు.. సమ్మె జరుగుతున్నప్పటికీ తాత్కాళిక డ్రైవర్లు, కండక్టర్లతో గురువారం మొత్తం 642 బస్సులకుగాను 567 బస్సులు నడిపించినట్లు ఆర్ఎం జీవన్‌ప్రసాద్ తెలిపారు. 364 మంది తాత్కాలిక డ్రైవర్లు, 364 మంది కండక్టర్లతో బస్సులు నడిపిస్తున్నారు. 1.03 లక్షల కిలోమీటర్లు బస్సులు నడుపగా రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. -
ఇల్లాలికి అదనపు కట్నం వేధింపులు
-
ముకుంద రెడ్డికి 'బిగ్గెస్ట్ లేయర్ ఫార్మర్ అవార్డు'
మండపేట : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పౌల్ట్రీలు నెలకొల్పి అత్యధికంగా కోళ్లను పెంచుతున్న శ్రీలక్ష్మీ ఎగ్ ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ కర్రి వెంకట ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (నెక్) బిగ్గెస్ట్ లేయర్ ఫార్మర్ అవార్డుతో సత్కరించింది. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, సుదర్శన్ భగత్ చేతులమీదుగా ముకుందరెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ముగ్గురిని ఎంపిక చేయగా అందులో జిల్లాకు చెందిన ముకుందరెడ్డి ఒకరు కావడం గమనార్హం. కేపీఆర్ గ్రూప్స్‌లో భాగంగా 1998లో 2 లక్షల కోళ్లతో తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో శ్రీలక్ష్మీ పౌల్ట్రీ కాంప్లెక్స్‌ను నెలకొల్పిన ముకుందరెడ్డి అంచెలంచెలుగా విస్తరించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 28 లక్షల లేయర్ కోళ్లను పెంచుతున్నారు. అత్యధికంగా లేయర్ కోళ్లను పెంచుతున్నందుకుగానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర వ్యవసాయ శాఖ సహకారం అందించాల్సిందిగా కేంద్ర మంత్రులను కోరినట్టు ముకుందరెడ్డి తెలిపారు. న్యూఢిల్లీ నుంచి 'సాక్షి'తో ఆయన ఫోన్లో మాట్లాడారు. స్థానికంగా గుడ్ల వినియోగం పెంచేందుకు కృషి చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు ముకుందరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా తెగుళ్ల బెడదతో పౌల్ట్రీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, చిన్న పౌల్ట్రీలు మూతపడుతున్న విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కోళ్ల మేతల కృత్రిమ కొరత సమస్యను పరిష్కరించాలని, మొక్కజొన్న, ఇతర ఉత్పత్తులను కోళ్ల రైతులకు రాయితీపై సరఫరా చేయాలని కోరామని తెలిపారు. ఈ మేరకు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్టు ముకుందరెడ్డి తెలిపారు. -
వెంటిలేటర్‌పై గీట్ల ముకుందరెడ్డి
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డ ఆయనకు వెంటిలేటర్ సహాయం అందించారు. గీట్ల కొద్ది రోజులుగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను తన పెద్ద కుమారుడు రాజేందర్‌రెడ్డి ఇంటికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న ముకుందరెడ్డి కూతురు వాణి బుధవారం ఏ రాత్రి వరకైనా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. గీట్ల పరిస్థితి పూర్తి విషమంగా ఉందని తెలిసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దపల్లిలోని గీట్ల నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని విషాదంలో మునిగిపోయారు. ఎంపీ వివేకానంద, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు భానుప్రసాదరావు, దాసరి మనోహర్‌రెడ్డి, విజయరమణారావు తదిత రులు మంగళవారం సాయంత్రం తమ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా.. కూనారం గ్రామానికి 1970, 1976లో రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికైన గీట్ల 1981లో పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 1983 నుంచి వరుసగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన చరిత్ర ఆయనది. ఇందులో మూడుసార్లు గెలిచి ఐదుసార్లు ఓడిపోయా రు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గీట్ల ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎ మ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సైతం దాఖలు చేశారు. అధిష్టానం భానుప్రసాదరావుకు టికెట్ ఇచ్చిం ది. ముకుం దరెడ్డికే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఉన్న సీనియర్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటారని ప్రచారం జరిగినప్పటికీ... అధిష్టానం బుజ్జగింపులు, హామీలతో పోటీ నుంచి తప్పుకున్నారు. గీట్లనే టార్గెట్ 1983 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులెందరో వచ్చినా వారందరికీ గీట్ల ముకుందరెడ్డే టార్గెట్. 1983లో గోనె ప్రకాశరావుపై ఓడిపోయిన ఆయన తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన గీట్లను స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఢిల్లీకి రప్పించుకుని అభినందించారు. అప్పటినుంచి ఇప్పటివరకు గోనె ప్రకాశరావు, వేముల రమణయ్య, బిరుదు రాజమల్లు, కాల్వ రాంచంద్రారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సి.సత్యనారాయణరెడ్డి, విజయరమణారావు ఇలా అందరికీ ఆయనే ప్రత్యర్థి. 2009లో ఓటమి తర్వాత కొంత కాలంపాటు స్తబ్ధుగాఉన్న ఆయన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తీరుకు నొచ్చుకున్నారు. సీనియర్లను గౌరవించడం లేదని ఆయనతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలని ఏడాదికాలంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఊరూరా తిరిగి బూత్‌స్థాయి కమిటీలు నియమించారు. ప్రచార బాధ్యతలు కార్యకర్తలకు అప్పగించారు. పార్టీలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ప్రాబల్యం పెరిగిపోతోందని గ్రహించినప్పటికీ... ప్రజలమధ్యే ఉంటున్న తనను అధిష్టానం గుర్తిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్న ఆయనకు అధిష్టానం షాక్ ఇచ్చింది. బుజ్జగింపులతో బరిలోంచి తప్పుకున్నా టికెట్ తనకు ఇవ్వలేదని మనస్తాపానికి గురయ్యారు.