Mullakatta
-
రాజుల సొమ్ము రాళ్లపాలు..
నిరుపయోగంగాముల్లకట్ట పుష్కరఘాట్ అధికారుల అత్యుత్సాహమే కారణం వరంగల్ :‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ లా తయూరైంది ముల్లకట్ట వద్ద నిర్మించిన పుష్కరఘాట్ పరిస్థి తి. జిల్లాలో పుష్కర ఏర్పాట్లు కోసం ప్రభుత్వం సు మారు రూ.35కోట్లు వ్యయం చేసింది. అందులో ముల్లకట్ట వద్ద 160మీటర్ల పుష్కరఘాట్ నిర్మాణానికి సుమారు రూ.5కోట్లు వెచ్చింది. తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణకు రో రూ.కోటి వ్యయం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరిలో ని నీరు ఘాట్‌కు దాదాపు 150మీటర్ల దూరం నుం చి ప్రవహిస్తోంది. పుష్కరాలు జూలై రెండోవారం లో ప్రారంభమవుతాయని, అప్పుడు ఏ స్థాయిలో నీరు ఉంటుందన్న విషయాలను నీటిపారుదల శా ఖ అధికారులు అంచనా వేయూల్సి ఉంది. గతానుభవవాలను పరిగణనలోకి తీసుకుంటే రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయ్యేదికాదంటున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణల మధ్య ముఖ్య వారధి కావడంతో అక్కడి మావోయిస్టులు వస్తారన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేసినా ఇంజినీరింగ్ అధికారులు అదేమీ పట్టించుకోలేదని తెలిసింది. కేవలం కాంట్రాక్టర్ల మేలు కోరి, వారి సూచనల మేరకే బ్రిడ్జి వద్ద స్నానఘట్లాలు నిర్మించారని ఆరోపణలు వస్తున్నారుు. ముల్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు గోదావరి ప్రవహిస్తోంది. ముల్లకట్ట నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న జాతీయ రహదారికి సుమారు 300మీటర్ల దూరంలో నది ఒడ్డు వెంట ప్రవహిస్తోంది. ముల్లకట్ట బ్రిడ్జి పరిశీలనకు వచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇదే విషయంపై నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ముల్లకట్ట వద్ద బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించడంతో పలువురు భక్తులు ఇదే ప్రాంతాల్లో స్నానాలు చేసేందుకు వెళ్తున్నారు. ఈ ఘాట్ వద్ద సుమారు వందకు పైగా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నా...భక్తులు మాత్రం రెండంకెలు దాటకపోవడం గమనార్హం. -
తెరుచుకోని ముల్లకట్ట ప్రాథమిక పాఠశాల
ఏటూరునాగారం : మారుమూల అటవీ గ్రామమైన ముల్లకట్టలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంగళవారం తెరుచుకోలేదు. ఇక్కడ బడి గంటలు మోగలేదు. చదువుకునే పిల్లలు చెట్ల కింద కోతికొమ్మచ్చి ఆడుకుంటూ కనిపించారు. ఎందుకు ఆడుతున్నారంటే... బడికి సారత్తలేడు.. మేం ఆడుకుంటానం అన్నారు. ముల్లకట్ట పాఠశాలకు గత ఏడాది నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేక విద్యార్థుల చదువు కుంటుపడుతోంది. చదువుకోవాల్సిన పిల్లలు చెట్లు, పుట్టలు, తునికికాయలు ఏరడానికి వె ళుతున్నారు. గత ఏడాది మెటర్నటీ సెలవుపై ఉపాధ్యాయురాలు సజిత వె ళ్లిపోగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠశాల ఒక రోజు తె రిస్తే రెండు రోజులు మూత పడి ఉంటుంది. దీంతో విద్యార్థులు చదువుకోలేని దుస్థితి నెలకొంది. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 38 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయురాలు లేకపోవడంతో తోలెం భాగ్యలక్ష్మి అనే మహిళ ను ఎంఈఓ గొర్రె కొమురయ్య విద్యావలంటీర్‌గా నియమించారు. ఆమెకు నెలకు రూ.2,500 వేతనం ఇస్తానని చెప్పి కేవలం రెండు నెలలు కలిపి రూ.2,200 ఇచ్చారు. అయితే ఆ వేతనానికి పని చేయలేనని భాగ్యలక్ష్మి బడికి వెళ్లడం మానేసింది. అప్పటి నుంచి సీఆర్పీలను వంతుల వారిగా పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నప్పటికీ పాఠశాలకు ఎవరు రాకపోవడంతో మూసి ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంఆర్సీ భవనంలో డిప్యూటేషన్‌పై ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, వారిని ముల్లకట్టకు పంపించేలా విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఎంఈఓ గొర్రె కొమురయ్యను వివరణ కోరగా సీఆర్పీలను ప్రతి రోజు పాఠశాలకు వెళ్లాలని ఆదేశించామన్నారు. అయితే మంగళవారం పరీక్ష పేపర్లు రావడం వల్ల క్లస్టర్ వారీగా సరఫరా చేయాలని సీఆర్పీలను కోరానని, అందువల్లనే ముల్లకట్టకు వెళ్లలేదన్నారు.