Multiplex Construction
-
మరోసారి..
తూర్పుగోదావరి ,సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఏవీ అప్పారావు రోడ్డు గెయిల్ కార్యాలయం ఎదురుగా గతంలో ప్రసాదిత్య మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 30 అడుగుల లోతు తవ్వడంతో పక్కనే ఉన్న అపార్టుమెంటు ఒరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం పూడ్చిన మట్టి ఒక్కసారిగా కిందకి జారిపోయింది. దాంతో అపార్టుమెంటు వాసులు భయాందోళనలు వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 24న జరిగిన సంఘటనతోనైనా నిర్మాణదారులు కనీసం చర్యలు తీసుకోకపోవడం విడ్డురంగా ఉందని అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు ఎకరాల స్థలంలో 70 అడుగల మేర లోపలికి తవ్వారు. పార్కింగ్ కోసం రెండు సెల్లార్లు, ఆపై భవనం నిర్మించేలా ప్రణాళికలు రచించారు. చుట్టూ 13 అడుగుల మేర స్థలం వదిలి పునాదులు తవ్వాల్సి ఉండగా అడుగు కూడా వదలకుండా నాలుగు వైపులా తవ్వేయడంతో ఆ స్థలానికి అనుకుని ఉన్న జీఈవీ గ్రాండు అపార్టుమెంటు ప్రహరీ దెబ్బతింది. అయినా ఆగకుండా పనులు చేయడంతో గత ఏడాది నవంబర్ 24న అపార్టుమెంటు సెట్‌బ్యాక్ స్థలం కుంగిపోవడంతో పాటు వంద అడుగుల మేర ప్రహరీ కూలిపోయింది. దీంతో అపార్టుమెంటులో నివసిస్తున్న కుటుంబాలు భయాందోళనతో బయటకు పరుగులు తీశాయి. తరువాత జేఎన్టీయూకే ప్రొఫెసర్లు, నిపుణులతో సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అపార్టుమెంటుకు ఎటువంటి ప్రమాదం లేకుండా రిటైనింగ్ వాల్‌ను అంచెల విధానంలో బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించారు. కానీ భవన యాజమానుల నిర్లక్ష్యం వలన సోమవారం రాత్రి మరలా కొంతమేర రక్షణ గోడ కూలిపోయింది. దీంతో మరలా ఆపార్టుమెంటు వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. సోమవారం జరిగిన సంఘటనతో నగరపాలక సంస్థ కమిషనర్ సుమిత్ కుమార్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పరిస్థితిని సమీక్షించారు. మట్టి జారిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్లాట్లలోని రెండు కుటుంబాలను ఖాళీచేయించారు. నిర్లక్ష్య సమాధానంఇస్తున్న నిర్మాణ సిబ్బంది సోమవారం రాత్రి ఆపార్టుమెంటుకు విద్యుత్‌ను సరఫరా చేసే ఒక ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. ఇదేంటిని నిర్మాణానికి సంబంధించిన సిబ్బందిని అడిగితే తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, ట్రాన్స్ఫార్మర్ కూలిన మాట వాస్తవమేనని, దీని నుంచి విద్యుత్ సరఫరా అయ్యే అపార్టుమెంటు బ్లాకులోని వారిని హోటల్ రూమ్‌లకు మార్చామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పూర్తయ్యాక మరలా వారిని అపార్ట్మెంట్కి చేరుస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా పరిశీలించారని చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం అక్కడ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్లిన పాత్రికేయులను లోనికి అనుమతించలేదు. ‘గుడా’ నుంచిఅన్ని అనుమతులు పొందారా? మల్టీప్లెక్స్ నిర్మాణ సమయంలో ఏడు లేయర్ల లోతు అంటే సుమారు 10 మీటర్లు లోతు తవ్వుకోవడానికి అనుమతులు ఉంటాయి. కానీ మొదట నాలుగు లేయర్ల తవ్వకం పూర్తయిన వెంటనే నిర్మాణానికి సుమారు ఐదారు మీటర్ల దూరంలో ఉండే అపార్టుమెంటు ప్రహరీ కూలిపోయింది. దాంతో అక్కడ మల్టీప్లెక్స్ నిర్మాణానికి అనువైన ప్రాంతమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. గుడా నుంచి భవన నిర్మాణానికి కావలసిన అనుమతులు అన్నీ ఉన్నాయా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, గుడా సంబంధిత వ్యక్తులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది మరో ప్రశ్న. అధికార టీడీపీ నాయకులు వెనుకుండడం వల్లే వారందరూ నోరుమెదపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నవంబర్ 24, 2018ఏవీ అప్పారావు రోడ్డు.. గెయిల్ కార్యాలయం ఎదురుగాప్రసాదిత్య మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.సుమారు 30 అడుగుల లోతులో మట్టి తవ్వకం పనులు చేపట్టగా.. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పిల్లర్లు ఒరిగాయి. అప్పట్లో ఈ సంఘటన జిల్లాలోసంచలనం సృష్టించింది.వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. అయితే జేఎన్టీయూకే బృందం భూ పరీక్షలు నిర్వహించి కొన్ని సూచనలు చేయడంతో ఆ ప్రకారం అక్కడ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అక్కడే తిరిగి నివాసం ఉంటున్నారు. ఆరు నెలల తర్వాత.. జేఎన్టీయూకే బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం అపార్ట్మెంట్ చుట్టూ మట్టితో పూడ్చి పటిష్టం చేసే పనులు చేపట్టారు. పూడ్చిన మట్టి సోమవారం ఒక్కసారిగా కిందకి అండలుగా జారిపోయింది. దీంతో అపార్ట్మెంట్ వాసుల్లో మళ్లీకలకలం మొదలైంది. -
ఉమ్మడి పాస్ విధానంపై ఆర్టీసీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ఉమ్మడి పాస్‌పై విధానంపై, తదితర అంశాంలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో సునీల్ మాట్లాడారు. ఆర్టీసీ లాభాల బాట పట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనట్టు తెలిపారు. అదేవిధంగా నష్టాలను తగ్గించే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆర్టీసీ స్థలాల్లోని షాపులపై పది శాతం రెంట్ పెంచాలని, అదేవిధంగా ఖాళీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 40 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు వారం రోజుల్లో ప్రారంభమవనున్నాయన్నారు. కొత్తగా వెయ్యి బస్సులను కొనుగోలూ చేస్తామన్నారు. 15 రోజుల్లో ఆర్ఎం, డీఎంలతో మరో సమీక్ష నిర్వహిస్తామని సునీల్ తెలిపారు. -
మెట్రో మాల్స్
4 ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌ల నిర్మాణం అనుమతి కోసం హెచ్ఎంఆర్ దర ఖాస్తు జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే, ఎంపిక చేసిన నాలుగు ప్రాంతాల్లో భారీ షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మించనున్నారు. ఎర్రమంజిల్, పంజగుట్ట, గడ్డిఅన్నారం, మాదాపూర్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ జీహెచ్ఎంసీకి హెచ్ఎంఆర్ దరఖాస్తు చేసింది. వాటిలో ఒకదానికి ఇప్పటికే అనుమతి లభించింది. మరో రెండింటికి అతి త్వరలో మంజూరు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకొకటి పరిశీలన దశలో ఉంది. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం దానికి అనుమతి ఇవ్వనున్నారు. జీహెచ్ఎంసీ ఖజానాకు వీటి ఫీజుల రూపంలో దాదాపు రూ.50 కోట్లు సమకూరనుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం లక్ష్యం రూ.500 కోట్లు కాగా... ఇప్పటి వరకు దాదాపు రూ.390 కోట్లు వచ్చినట్లు తెలిసింది. రైలుతో పాటే ప్రారంభం? మెట్రో రైలు ప్రయాణికులకు రవాణా సదుపాయం మాత్రమే కాక... వివిధ మార్గాల్లో వ్యాపారాల నిర్వహణకు హెచ్ఎంఆర్ నిర్ణయించడం తెలిసిందే. అందులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో నాలుగు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి గత ఏడాది దరఖాస్తు చేసుకుంది. బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులిచ్చే ఎంఎస్బీ కమిటీ సమావేశాల్లో ఇటీవలే పరిశీలన పూర్తయింది. దీంతో త్వరలోనే అనుమతులు జారీ కానున్నట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండడంతో రైలు పట్టాల పైకి వచ్చే నాటికి ఈ కాంప్లెక్స్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాంప్లెక్స్‌ల నిర్మాణం తీరిదీ... ఖైరతాబాద్ ఎర్రమంజిల్ వద్ద షాపింగ్‌మాల్ కమ్ మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్నారు. స్టిల్ట్ ప్లస్ ఆరు అంతస్తులతో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్‌లో రెండు బేస్మెంట్లు ఉంటాయి. పంజగుట్ట వద్ద షాపింగ్ మాల్ కమ్ మల్టీప్లెక్స్‌ను రెండు బ్లాకులుగా నిర్మించనున్నారు. వీటిల్లో ఒక బ్లాకులో జీ ప్లస్ ఐదంతస్తులు, మరో బ్లాకులో జీ ప్లస్ ఆరంతస్తులు నిర్మించనున్నారు. మూడు బేస్మెంట్లను పార్కింగ్‌కు వినియోగిస్తారు. దీనికి ప్రాథమిక అనుమతి లభించడమే కాక ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలిసింది. సైదాబాద్ గడ్డిఅన్నారం వద్ద షాపింగ్‌మాల్ కమ్ మల్టీప్లెక్స్‌ను జీ ప్లస్ రెండంతస్తులతో నిర్మించనున్నారు. మూడు బేస్మెంట్లతో నిర్మాణం జరుగనున్న ఈ కాంప్లెక్స్‌కు సంబంధించిన దరఖాస్తు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.మాదాపూర్‌లో జీ ప్లస్ ఐదంతస్తులతో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఒక మెజానైన్ ఫ్లోర్ ఉంటుంది. సినిమా ప్రొజెక్టర్ల కోసం దీనిని నిర్మించనున్నట్లు సమాచారం. -
తిరుపతిలో రూ.134 కోట్లతో మల్టీప్లెక్స్
- స్మార్ట్ సిటీ నేపథ్యంలో తెరపైకి వచ్చిన మల్టీప్లెక్స్ నిర్మాణం - పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఎస్బీపీఎల్ సంస్థ - కాంప్లెక్స్ పూర్తయితే 4 భారీ సినిమా స్క్రీన్ల్లు, ఫుడ్‌కోర్టు, మాల్స్ తిరుపతి కార్పొరేషన్ : తిరుపతిని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వాణి జ్యపరంగా భారీప్రాజెక్టులు చేపట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. హెదరాబాద్, విశాఖపట్నం తరహాలో తిరుపతిలో భారీ మల్టీప్లెక్స్ ప్రాజెక్టు రూపకల్పనకు తుడా శ్రీకారంచుట్టింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి 2 కిలోమీటర్ల లోపున్న తుడా స్థలం అనువైనదిగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు రూ.134 కోట్లతో.. తిరుపతిని స్మార్ట్‌సిటీగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మల్టీకాంప్లెక్స్ నిర్మాణం పనులు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన ఎస్బీపీఎల్ సంస్థ తిరిగి పను లు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. 2009లో అప్పటి లీజు ప్రకారం రూ.114 కోట్లకు ఒప్పుకున్న తుడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అందులో భాగంగా రూ.134 కోట్లతో మెగా షాపింగ్‌మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఎస్బీపీఎల్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై వంద రోజుల్లో ఆసంస్థతో పూర్తిస్థాయిలో అగ్రిమెంట్ చేసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మల్టీప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తుడా అందిస్తుంది. ఈ స్థలంలో నిర్మాణం చేపట్టే సంస్థ 33 సంవత్సరాల వరకు లీజు పద్ధతిలో మల్టీప్లెక్స్ నిర్వహ ణ బాధ్యతలు చేపడుతుంది. వంద రోజుల్లో అగ్రిమెంట్ గతంలో రూ.114 కోట్లతో నిర్మించాలనుకున్న మల్టీప్లెక్స్ నిర్మాణం అనివార్య కారణాలతో ఆగిపోయింది. ప్రస్తుతం అదే సంస్థతో తిరిగి నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వంద రోజుల్లో ఆసంస్థతో అగ్రిమెంట్ చేసుకోనున్నాం. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. - ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు,తుడా