సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ఉమ్మడి పాస్‌పై విధానంపై, తదితర అంశాంలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో సునీల్ మాట్లాడారు. ఆర్టీసీ లాభాల బాట పట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనట్టు తెలిపారు. అదేవిధంగా నష్టాలను తగ్గించే అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఆర్టీసీ స్థలాల్లోని షాపులపై పది శాతం రెంట్ పెంచాలని, అదేవిధంగా ఖాళీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 40 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు వారం రోజుల్లో ప్రారంభమవనున్నాయన్నారు. కొత్తగా వెయ్యి బస్సులను కొనుగోలూ చేస్తామన్నారు. 15 రోజుల్లో ఆర్‌ఎం, డీఎంలతో మరో సమీక్ష నిర్వహిస్తామని సునీల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment