Mumbai Rockets
-
అవధ్ వారియర్స్ రెండో గెలుపు
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో అవధ్ వారియర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 5–0తో ముంబై రాకెట్స్‌ను చిత్తు చేసింది. తొలుత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో కొ సుంగ్ హ్యూన్–క్రిస్టినా పెడర్సెన్ (అవధ్ వారియర్స్) 9–15, 14–15తో కిమ్ స రంగ్–పియా జెబదియా (ముంబై) జంట చేతిలో ఓడింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన అవధ్ వారియర్స్ ప్లేయర్ బీవెన్ జాంగ్ 15–3, 15–4తో కుహూ గార్గ్ (ముంబై)పై గెలిచి జట్టుకు 2–1 ఆధిక్యాన్నిచ్చింది. పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పారుపల్లి కశ్యప్ (ముంబై) 8–15, 10–15తో విన్సెంట్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడటంతో... ముంబై జట్టుకు ఒక పాయింట్ పెనాల్టీ పడింది. దాంతో అవధ్ వారియర్స్ 3–0తో ఆధిక్యంలో నిలిచింది.తర్వాత జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో అజయ్ జయరామ్ (అవధ్ వారియర్స్) 12–15, 15–6, 15–7తో లీ డాంగ్ కెయున్ (ముంబై)పై గెలిచాడు. ఇక చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో కొ సుంగ్ హ్యూన్– షిన్ బేక్ (అవధ్ వారియర్స్) జంట 14–15, 15–10, 15–14తో కిమ్ జి జుంగ్–కిమ్ స రంగ్ (ముంబై) జోడీపై గెలిచింది. నేటి నుంచి హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభమవుతాయి. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
పీబీఎల్‌లో పుణే బోణీ
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్–5లో పుణే సెవెన్ ఏసెస్ జట్టు బోణీ కొట్టింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పుణే 5–2తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. తొలుత జరిగిన పరుషుల డబుల్స్ పోరులో చిరాగ్ శెట్టి–హెండ్రా సెటియావన్ (పుణే) ద్వయం 14–15, 15–5, 15–6తో కిమ్ జుంగ్– కిమ్ స రంగ్ (ముంబై) జంటపై గెలిచింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పుణే ప్లేయర్ రితుపర్ణ దాస్ 11–15, 15–9, 15–9తో శ్రేయాన్షి పర్దేశి (ముంబై)పై గెలవడంతో... పుణే 3–0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత జరిగిన పురుషుల మొదటి సింగిల్స్‌లో లోహ్ కియాన్ య్యూ (పుణే) 15–7, 15–14తో పారుపల్లి కశ్యప్ (ముంబై)పై నెగ్గడంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే పుణే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇక నామమాత్రంగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌లో సకాయ్ (పుణే) 7–15, 13–15తో లీ డాంగ్ కెయున్ (ముంబై) చేతిలో ఓడాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ‘ట్రంప్ కార్డు’తో ఆడటంతో... ఆ జట్టుకు రెండు పాయింట్లు లభించాయి. చివరి మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్–గ్యాబీ (పుణే) ద్వయం 15–12, 10–15, 15–6తో కిమ్ జి జుంగ్–పియా జెబిదియా (ముంబై) జంటపై గెలిచింది. నేటి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
సెమీస్‌లో ముంబై రాకెట్స్
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో ముంబై రాకెట్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐదు జట్లతో తలపడిన ముంబై మూడింటిపై గెలిచి 19 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన పోరులో ముంబై 5–0తో చెన్నై స్మాషర్స్‌ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ముంబై ఆటగాడు ఆండెర్స్ ఆంటోన్సెన్ 15–14, 15–11తో రాజీవ్ ఒసెఫ్‌పై గెలిచాడు. చెన్నై ‘ట్రంప్’మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ కిమ్ జీ జాంగ్–బెర్నాడ్త్ (ముంబై) జంట 15–14, 15–14తో క్రిస్ అడ్కాక్–గాబ్రియల్ అడ్కాక్ జోడీపై గెలవడంతో ముంబై 2–(–1)తో ఆధిక్యంలోకి వెళ్లింది. మహిళల సింగిల్స్‌లో చెన్నై ప్లేయర్ సుంగ్ జీ హ్యూన్ 15–7, 15–8తో అనురా ప్రభుదేశాయ్‌పై నెగ్గింది. ముంబై ‘ట్రంప్’అయిన పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 12–15, 15–13, 15–9తో పారుపల్లి కశ్యప్‌పై గెలిచి 4–0తో విజయాన్ని ఖాయం చేశాడు. చివరి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో కిమ్ జీ జాంగ్–లీ యాంగ్ డై జోడీ 15–8, 15–10తో ఆర్ చిన్ చుంగ్–సుమీత్ రెడ్డి ద్వయంపై గెలిచి 5–0తో ముగించింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్ 4–3తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై గెలిచింది. నేడు ఢిల్లీ డాషర్స్‌తో పుణే సెవెన్ ఏసెస్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో హైదరాబాద్ హంటర్స్‌తో తలపడతాయి. -
ముంబై రాకెట్స్ దూకుడు
పుణే: ఉత్కంఠగా సాగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన ముంబై రాకెట్స్ 5–2తో అవధ్ వారియర్స్‌పై గెలిచింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో తమ ఖాతాలో రెండో విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లనే ‘ట్రంప్’గా ఎంచుకున్నాయి. మహిళల సింగిల్స్‌లో బీవెన్ జాంగ్ (అవధ్) 15–10, 15–10 తేడాతో శ్రేయాన్షి పరదేశి (ముంబై)పై నెగ్గి జట్టును 2–0 ఆధిక్యంలో నిలిపింది. అనంతరం పురుషుల డబుల్స్‌ను ముంబై ‘ట్రంప్’గా ఎంచుకుంది. లియాంగ్ డె–కిమ్ జి జంగ్ జోడీ 15–7, 15–9తో లి చాంగ్ వి–ఎంఆర్ అర్జున్ జంటపై గెలుపొందింది. స్కోర్లు 2–2తో సమంగా నిలిచిన ఈ స్థితిలో పురుషుల సింగిల్స్ హోరాహోరీగా సాగాయి. తొలి మ్యాచ్‌లో ఆండర్స్ ఆంటోన్సెన్ (ముంబై) 6–15, 15–11, 15–14తో సన్ వాన్ హోపై, రెండో మ్యాచ్‌లో సమీర్ వర్మ (ముంబై) 15–11, 8–15, 15–11తో లీ డాంగ్ కుయెన్‌పై శ్రమించి నెగ్గారు. దీంతో 4–2తో ఫలితం తేలిపోయింది. నామమాత్రంగా మారిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ ముంబై పట్టు విడవలేదు. కిమ్ జి జంగ్–పియా బెర్నాడెత్ జంట 15–10, 7–15, 15–13తో అశ్విని పొన్నప్ప–మథియాస్ క్రిస్టియన్‌సెన్‌లపై జయభేరి మోగించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్‌తో నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ తలపడుతుంది. -
చెన్నై స్మాషర్స్దే టైటిల్
ఢిల్లీ: ప్రీమియర్ లీగ్ బ్యాడ్మింటన్(పీబీఎల్) -2017టైటిల్‌ను చెన్నై స్మాషర్స్ కైవసం చేసుకుంది. నగరంలో శనివారం జరిగిన తుదిపోరులో చెన్నై స్మాషర్స్ 4-3 తేడాతో ముంబై రాకెట్స్‌ను ఓడించి టైటిల్ ను చేజిక్కించుకుంది. మహిళల సింగిల్స్ లో చెన్నై స్మాషర్స్ క్రీడాకారిణి పివి సింధు 11-8, 11-8 తేడాతో సంగ్ జి హ్యూన్ పై గెలిచి ఆ జట్టు టైటిల్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతకుముందు పురుషుల డబుల్స్ క్రిస్ అడ్కాక్-గాబ్రియల్ అడ్కాక్ జంట 11-9,11-6 తేడాతో నిపిట్‌ఫోన్-నడిజ్డా జీబా ద్వయం గెలిచింది. ఇది చెన్నై స్మాషర్స్ కు ట్రంప్ మ్యాచ్ కావడంతో ఆ జట్టు 2-0 ఆధిక్యం సాధించింది. అనంతరం సింధు మ్యాచ్‌ను గెలవడంతో చెన్నై ముందుకు దూసుకుపోయింది. అయితే ఆ తరుణంలో ముంబై తన ట్రంప్ మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నై ఆధిక్యాన్ని 3-2కు తగ్గించింది. ఆ తరువాత ముంబై రాకెట్స్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ 11-4, 8-11,11-8 తేడాతో పారుపల్లి కశ్యప్‌ను ఓడించి స్కోరును 3-3 తో సమం చేశాడు. కాగా, ముంబై రాకెట్స్ ఆటగాడు అజయ్ జయరామ్, చెన్నై స్మాషర్స్ ఆటగాడు తనోంగ్సాక్ల మధ్య ఫలితం కోసం జరిగిన పోరు ఆసక్తిగా సాగింది. ఇరువురు ఆటగాళ్లు ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ పోరులో తనోంగ్‌సాక్ 9-11, 11-7,11-3 తేడాతో అజయ్ జయరామ్‌ను ఓడించాడు. దాంతో చెన్నై స్మాషర్స్ 4-3 తేడాతో గెలిచి టైటిల్ ను సొంతం చేసుకుంది. -
ముంబై మెరిసె...
* తొలి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌పై గెలుపు * సింగిల్స్‌లో గురుసాయిదత్, రుత్విక విజయం * గాయంతో బరిలోకి దిగని సైనా నెహ్వాల్ * ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ముంబై: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే ముంబై రాకెట్స్ మెరిసింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన అవధ్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శుభారంభం చేసింది. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ జట్టు 2-1 పాయింట్ల తేడాతో అవధ్ వారియర్స్‌ను ఓడించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై రాకెట్స్ విజయాన్ని ఖరారు చేసుకోగా... నామమాత్రమైన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వారియర్స్ నెగ్గినా ఫలితం లేకపోయింది. కొత్త నిబంధన ‘ట్రంప్ మ్యాచ్’ రెండు జట్లకు కలసి రాలేదు. అవధ్ వారియర్స్ తొలుత పురుషుల డబుల్స్ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకొని ఓడిపోగా... ముంబై రాకెట్స్ రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొని ఓటమి పాలైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు టాప్‌గన్స్‌తో హైదరాబాద్ హంటర్స్; ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడతాయి. ఇద్దరు తెలుగు తేజాల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్ గురుసాయిదత్ (ముంబై) 14-15, 15-10, 15-8తో ప్రపంచ 34వ ర్యాంకర్ సాయిప్రణీత్ (అవధ్ వారియర్స్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ పోటీలో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై రాకెట్స్) ద్వయం 15-11, 15-11తో కాయ్ యున్-హెంద్రా గుణవాన్ (అవధ్ వారియర్స్) జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని (ముంబై) 15-13, 15-10తో మరో తెలుగు అమ్మాయి గుమ్మడి వృశాలి(వారియర్స్)ని ఓడించడంతో ముంబై విజయం ఖరారైంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో వృశాలి బదులుగా సైనా నెహ్వాల్ ఆడాలి. అయితే గాయం కారణంగా సైనా తొలి లీగ్ మ్యాచ్‌కు దూరం కావడంతో ఆమె స్థానంలో వృశాలి బరిలోకి దిగింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (అవధ్ వారియర్స్) 15-12, 14-15, 15-14తో ప్రపంచ 20వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై రాకెట్స్)పై సంచలన విజయం సాధించడంతో అవధ్ వారియర్స్ ఖాతాలో తొలి విజయం చేరింది. చివరిదైన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో బోదిన్ ఇసారా-క్రిస్టినా (వారియర్స్) జంట 15-9, 14-15, 15-14తో కామిల్లా జుల్-ఇవనోవ్ (ముంబై) జోడీని ఓడించింది. వైభవంగా ఆరంభం కొత్త రూపుతో.. సరికొత్త ఆటతీరుతో అభిమానులను అలరించాలని చూస్తున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) శనివారం వైభవంగా ఆరంభమైంది. తారల నృత్యాలతో పాటు బాలీవుడ్ మధుర గీతాలతో ప్రారంభోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ టాప్ స్టార్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా శ్రీలంక బ్యూటీ, హిందీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలు హిట్ గీతాలకు స్టెప్పులేసి హుషారు తెచ్చింది. అనంతరం సంగీత ద్వయం సలీం, సులేమాన్ చక్‌దే ఇండియా, బాండ్ బాజా బరాత్ తదితర సినిమాల్లోని పాటలను మరోసారి ప్రేక్షకులకు వినిపించారు. వీరే స్వరపర్చిన పీబీఎల్ అధికారిక గీతం ‘హల్లా మచాదే’ను కూడా ఆలపించి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. అయితే ఈ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ తొలి రోజు హాజరుకాలేదు. రెండో రోజు ఆదివారం రానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ‘పీబీఎల్‌కు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఫ్రాం చైజీలకు, యజమానులకు, మద్దతుదారులకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరం కలిసి లీగ్‌ను సక్సెస్ చేయాలి’ అని పీబీఎల్ చైర్మన్ అఖిలేశ్ దాస్‌గుప్తా కోరారు.