mumtaz ahmed khan
-
చార్మినార్‌లో ఉద్రిక్తత
చార్మినార్: అక్రమ డబ్బు విషయంలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కుమారుడు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్‌తో పాటు గులాం ఖాదర్ జిలానీ అలియాస్ మన్నాన్లపై చార్మినార్ పోలీసులు సుమోటో కేసులు నమోదు చేశారు. గులాం ఖాదర్ జిలానీపై ఈ కేసుతో పాటు ఫైజల్ ఖాన్ అనే బాధితుడికి సంబంధించిన మహిళలను దుర్భాషలాడిన ఘటనలో మరో సుమోటో కేసు నమోదైంది. చార్మినార్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ ప్రాంతానికి చెందిన ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్, గులాం ఖాదర్ జిలానీలు స్నేహితులు. ముఖీద్ చౌదరి అనే వ్యక్తి నుంచి అధిక మొత్తంలో డబ్బు దోపిడీ చేసిన వీరిరువురి మధ్య.. డబ్బుల పంపకంలో వివాదం తలెత్తింది. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారనే విషయంపై ఒక వాట్సాప్ వాయిస్ వీడియో ద్వారా వెల్లడైంది. సోషల్ మీడియా యూ ట్యూబ్ ద్వారా ఈ విషయం చార్మినార్ సబ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే ఈ నెల 4న చార్మినార్ పోలీసు స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో 387 ఐపీసీ సెక్షన్ కింద సుమోటో కేసు నమోదైంది. అలాగే మరో వాట్సాప్ వైరల్ వీడియోలో గులాం ఖాదర్ జిలానీ అలియాస్ మన్నాన్.. ఫజల్ ఖాన్ అనే మరో వ్యక్తితో జరిగిన సంభాషణలో అతని ఇంట్లోని మహిళలను దుర్భాషలాడినట్లు స్పష్టమైంది. దీంతో గులాం ఖాదర్ జిలానీ అలియాస్ మన్నాన్పై ఐపీసీ 354, 505, 509 సెక్షన్ల కింద మరో సుమోటో కేసు నమోదైందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. భారీ ర్యాలీతో.. వాట్సాప్ వాయిస్ వీడియో ఆధారంగా దక్షిణ మండలం పోలీసులు శనివారం రాత్రి ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కుమారుడు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్‌ను అదుపులోకి తీసుకుని నేరుగా పురానీహవేలీలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయానికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే తన అనుచరులు, మజ్లిస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు డీసీపీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. అరెస్టులను వ్యతిరేకించారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. విచారణ అనంతరం 41 ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసి వదిలేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. భారీ ర్యాలీతో చార్మినార్ పంచ్ మోహల్లాలోని తన నివాసానికి చేరుకున్నారు. కేసులతో భయపెట్ట లేరు తమపై అక్రమంగా కేసులు నమోదు చేసి మానసికంగా దెబ్బతీస్తూ వేధింపులకు గురి చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ అన్నారు. తన కుమారుడు ఇంటికి చేరుకున్న అనంతరం శనివారం అర్ధరాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఉద్దేశపూర్వకంగా పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఎటువంటి కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తామని..ఎవరికీ భయపడేది లేదని కుమారుడితో కలిసి ఆయన స్పష్టం చేశారు. -
మజ్లిస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో ఛాన్స్!
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. మజ్లిస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. ఈసారి చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు టికెట్ లభించదని ప్రచారాలు జరగుతుండడంతో.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కాకుండా మరెవరికి టికెట్ కేటాహిస్తారోనని చార్మినార్నియోజకవర్గం మజ్లిస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈసారి ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు పార్టీ టికెట్ లభించకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని మరీ పోటీ చేయించడానికి ఆయన కుమారులు పట్టుబడుతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చారి్మనార్, యాకుత్‌పురా నుంచి కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్లు గతంలోనే చెప్పారని.. దీంతో ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో పాటు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీలకు ఈసారి టికెట్లు లభించవని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ నిశబ్దంగా ఉన్నప్పటికీ.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాత్రం తనకు టికెట్ ఇవ్వకపోతే.. తన తనయునికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. చివరి నిమిషం వరకు వేచి ఉండి.. ఇక టికెట్ రాదని తెలిస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారడం తప్పా.. ఆయన వద్ద మరో మార్గం లేదంటున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీ మారడానికి సిద్ధంగా ఉంటే.. తమ పార్టీలోకి ఆహా్వనించి చార్మినార్ నుంచి టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో దింపడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే టీటీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అలీ మస్కతిని చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపుతున్నట్లు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించినప్పటికీ.. ఇప్పటికే రెండు దఫాలుగా విడుదలైన అధికారిక లిస్టులలో ఎక్కడా అలీ మస్కతి పేరు లేకపోవడంతో ముంతాజ్‌ఖాన్ కోసం ఈ సీటు రిజర్వ్ పెట్టినట్లు పాతబస్తీలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చార్మినార్ నుంచి ముంతాజ్ ఖాన్‌కు టికెట్ లభిస్తే.. అలీ మస్కతిని హైదరాబాద్ పార్లమెంట్‌కు పోటీ చేయించే యోచనలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఇంత వరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పార్టీ చార్మినార్ అభ్యరి్థని ప్రకటించడం లేదని అంటున్నారు. ఈసారి మజ్లిస్ పార్టీకి దీటుగా.. కాంగ్రెస్ చార్మినార్ నుంచి మజ్లిస్ పార్టీకి దీటుగా తమ అభ్యర్థని ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. 2009, 2014, 2018 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో మజ్లిసేతర పార్టీలు హోరాహోరి ఎన్నికల పోరాటం చేసినప్పటికీ.. అంతిమ విజయం మజ్లిస్ పార్టీకే దక్కింది. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈసారి పాతబస్తీలో కూడా ఊహించని రాజకీయ పరిణాలు ఎదురవుతాయని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు. మజ్లిస్ పార్టీలో సిట్టింగ్‌లకు టికెట్లు లభించకపోతే.. పాతబస్తీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని అంటున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజకీయ అరంగేటం బజ్లిస్ బజావ్ తెహ్రీఖ్(ఎంబీటీ)తో మొదలైంది. ఎంబీటీ పార్టీ టికెట్‌పై యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం పార్టీ ఫిరాయించి మజ్లిస్ పారీ్టలో చేరారు. అప్పటి నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. ప్రస్తుతం చారి్మనార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ పార్టీ మారే ప్రసక్తే ఉండదని.. ఇవన్నీ రాజకీయ ఊహాగానాలేనని దారుస్సలాం నాయకులు అంటున్నారు. -
టీఆర్ఎస్పై ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ‘మేం తలుచుకుంటే గ్రేటర్ ఎన్నికల్లోనే కాదు.. రాబోయే రెండు నెలల్లో మొత్తమే గెంటేస్తాం.. మజ్లిస్ పార్టీ నిన్న కళ్లు తెరవలేదు.. మంత్రి కేటీఆర్ ఒక చిలుక.. నిన్న కళ్లు తెరిచాడేమో ఎక్కువ మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాకు కొత్త కాదు. మాతో పెట్టుకుంటే కనుమరుగవుతారు. గతంలో ఎంతో మంది సమాధి అయ్యారు’ అంటూ చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఆదివారం చార్మినార్‌లో మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సీట్లో కూర్చో బెట్టడం తెలుసు.. కింద పడేయడం తెలుసునని సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. తమతో కలిసి ఉంటే బావుంటుందని.. గతంలో తమతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వారి పరిస్థితి ఏమైందో అందరికి తెలుసన్నారు. ఏది పడితే అది అంటుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. -
‘రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలం’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీపై చార్మినార్ ఎమ్మెల్యే, మజ్లీస్ పార్టీ సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, తమ అధినేత చెప్పినట్టు రాజకీయం తమ ఇంటి గుమస్తాతో సమానం అన్నారు. కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన చిలుక అని ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాల్లో ఒకరిని గద్దే మీద కూరోచబెట్టడం తెలుసు.. గద్దె దించడం తెలుసు అని పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు షెడ్యూల్..
సాక్షి హైదరాబాద్ : తెలంగాణ రెండో శాసనసభ తొలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు శాసనసభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మిగతా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మండలి సభ్యులు, ఎమ్మెలేయలు జూబ్లీహాలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ శాసనసభ షెడ్యూల్.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభాపతి ఎంపిక కోసం నామినేషన్ దాఖలు ప్రక్రియ. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్‌లో తెలంగాణ అమరులకు నివాళులు. 11.20కి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు చేరుకుంటారు. 11.30కి ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన శాసనసభా సమావేశం ప్రారంభం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ముందుగా సీఎం కేసీఆర్ చేత ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం స్వీకారం చేశారు. అక్షర క్రమంలో మొదటగా ఉన్నా ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, తర్వాత కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణం చేశారు. ఆ తరువాత ఆరుగురు మహిళా సభ్యుల ప్రమాణం చేశారు. అటు తర్వాత మొదటగా ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రమాణ స్వీకారం చేశారు. చివరగా వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో తాత్కాలిక సభాపతి అహ్మద్‌ఖాన్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం కొనసాగనుంది అనంతరం మండలి ప్రాంగణంలో జరిగే విందుకు అంతా హాజరవుతారు. తాత్కాలిక సభాపతి స్థానంలో శాశ్వత సభాపతిని ఎంపిక చేసేందుకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉంటుంది. 18న శాసనసభాపతి ఎన్నిక ఉంటుంది. 19న శాసనసభ, మండలి ఉభయసభల సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. 20న శాసనసభ, మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. -
ఎంఐఎం ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : యాకుత్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సమయంలో ముంతాజ్ ఖాన్ పూర్తి ఆస్తుల వివరాలు వెల్లడించలేదని రూప్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆధారాలతో పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. దీనిని విచారించిన హైకోర్టు ఈ నెల 18 వరకు ఆస్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ఎమ్మెల్యేకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. -
తప్పుగా అర్థం చేసుకోకండి : పీవీ సింధూ
తనను వాలీబాల్ ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించిన ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను పీవీ సింధూ వెనకేసుకొచ్చారు. తాను వాలీ బాల్ ప్లేయర్ అని చెప్పడం ఎమ్మెల్యే సర్ ఉద్దేశం కాదని సింధూ ట్విట్టర్లో పేర్కొన్నారు. స్టేజీ పైనే ఉన్న తన తండ్రిని ఉద్దేశించి నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అన్నారని, ముంతాజ్ అహ్మద్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోకండి అని తెలిపారు. చార్మినార్‌లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించిన విషయం తెలిసిందే. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్‌ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్‌పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ, డిప్యూటీ సీఎం చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్‌గా ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు. అయితే ముంతాజ్ వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు సంధిస్తున్నారు. ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్‌తో ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను పోల్చుతున్నారు. ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకువచ్చిన పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారని నెటిజన్లు సదరు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. Here MLA sir doesn't mean that I am a volleyball player.He has expressed my dad's presence on the stage as national volleyball player.(1/2) pic.twitter.com/akm27Hxri6 — Pvsindhu (@Pvsindhu1) February 19, 2017 -
పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరా!
హైదరాబాద్ : ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. చార్మినార్‌లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించారు. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్‌ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్‌పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్‌గా ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫామ్‌పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఎంఎల్ఏ పొరపాటున తనను వాలీబాల్ ప్లేయర్ అనడంతో పీవీ సింధూ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. కాగా సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు. మన లీడర్లకు నాన్-పొలిటికల్ వ్యవహారాలపై ఏమేర నాలెడ్జ్ ఉందో ఇటీవల ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్న అంశాల వల్ల బయటపడుతున్నాయి.