చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు?
విశాఖపట్నం: ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఎన్నికలయ్యాక ఆయన ఏం చేస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. విశాఖపట్నం జిల్లా మునగపాకలో సోమవారం జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎవర్నీ వదలిపెట్టకుండా హామీలు ఇచ్చాడని, గెలిచాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వైఎస్ జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరం తీరిపోయిందని చంద్రబాబు భావిస్తున్నాడని విమర్శించారు. ప్రజలకు మేలు చేయని ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలని ప్రశ్నించారు. రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇలాంటి వ్యక్తిని నిలదీయాలని ప్రజలను కోరారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు
రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పారు
జాబు రావాలంటే బాబు రావాలన్నారు
ఇల్లులేని వారికి ఇల్లు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు
చంద్రబాబు ఎవర్నీ వదిలిపెట్టకుండా హామీలిచ్చారు
అబద్ధపు హామీలతో ముఖ్యమంత్రి అయ్యారు
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా?
చివరకు నిరుద్యోగభృతి కూడా ఇవ్వడం లేదు
అబద్ధాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి రాజకీయ వ్యవస్థను దిగజార్చారు
గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఇదే విషయం అడిగాం
చంద్రబాబు పాలనకు మార్కులు వేయాలని ప్రజలను కోరాం
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫలానా చేస్తానని చెప్పిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక ప్రజల అవసరం తీరిపోయిందని భావించి, ప్రజలకు మేలు చేయకుంటే ఏం చేయాలి?
ముఖ్యమంత్రి అయితే ఏం చేసినా నడుస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు
రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇలాంటి వ్యక్తిని నిలదీయాలి
ఎన్నికలపుడు ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావని బాబును నిలదీయాలి
అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది
దీనికోసమే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టాం
చంద్రబాబు పాలనలో జరుగుతున్న మోసాలను నిలదీయాలని పార్టీ నేతలకు చెప్పాను
ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడకు వచ్చిన మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా