Murat trading
-
మూరత్ ట్రేడింగ్ ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే?
ముంబై: సంవత్ 2079 ఏడాదికి స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో వీడ్కోలు పలికింది. ట్రేడింగ్ చివర్లో మెటల్, ఫైనాన్స్, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 251 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 72 పాయింట్ల లాభంతో 64,905 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 66 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఆఖరికి 30 పాయింట్లు పెరిగి 19,425 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఐటీ, టెలికమ్యూనికేషన్, ఆటో, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అధిక ద్రవ్యోల్బణ కట్టడికి అవసరమైతే కఠిన ద్రవ్య పాలసీ విధాన అమలుకు వెనకాడమని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఈ సంవత్ 2079 ఏడాదిలో సెన్సెక్స్ 5,073 పాయింట్లు, నిఫ్టీ 1,694 పాయింట్లు చొప్పున పెరిగాయి. ఇదే కాలంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.44 లక్షల కోట్లు పెరిగింది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు లిస్టింగ్ రోజు 15% లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.60)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.71 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 24% ర్యాలీ చేసి రూ.75 వద్ద గరిష్టాన్ని తాకింది. చివర్లో లాభాల స్వీకరణతో 15% లాభంతో రూ.69 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,555 కోట్లుగా నమోదైంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 4 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్టం 83.33 స్థాయి వద్ద స్థిరపడింది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఉపసంహరణ, క్రూడాయిల్ ధరల్లో అస్థిరతలు దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఈ సెప్టెంబర్ 18న 83.32 స్థాయి వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ డేటా రూపాయి గమనాన్ని నిర్ధేశిస్తాయని ట్రేడర్లు పేర్కొన్నారు. ఆదివారం మూరత్ ట్రేడింగ్ దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు ఆదివారం గంట పాటు ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు మొదలై 7.15 గంటలకు ట్రేడింగ్ ముగియనుంది. ఈ ఘడియల్లో షేర్లు కొనుగోలు చేస్తే మంచి లాభాలు గడిస్తాయిని మార్కెట్ వర్గాల నమ్మకం. బలిప్రతిపద సందర్భంగా నవంబర్ 14న(మంగళవారం) ఎక్సే్చంజీలకు సెలవు. -
మూరత్ ట్రేడింగ్ మురిపించెన్..!
ముంబై: దీపావళి రోజు గంటసేపు జరిగిన మూరత్ ప్రత్యేక ట్రేడింగ్ మురిపించింది. స్టాక్ సూచీలు సంవత్ 2078 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికాయి. మూరత్ ట్రేడింగ్‌లో ఎంపిక చేసుకున్న షేర్లు లాభాల్ని పంచుతాయనే నమ్మకంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడటంతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. రెండురోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ గురువారం సాయంత్రం 6:15 నిమిషాలకు సెన్సెక్స్ 436 పాయింట్ల లాభంతో 60,208 వద్ద మొదలైంది. నిఫ్టీ 106 పాయింట్ల పెరిగి 17,935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆటో షేర్లకు కలిసొచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకూ అధిక డిమాండ్ నెలకొంది. అయితే చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ సూచీలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను విక్రయించగా.., దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.38 కోట్ల షేర్లను కొన్నారు. బలిప్రతిపదా సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఎక్సే్ఛంజీలతో పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు పనిచేయలేదు. నేడు, రేపు(శని,ఆది) సాధారణ సెలవు రోజులు. సోమవారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి. ప్రపంచ మార్కెట్లకు ఫెడ్ బూస్ట్... ఫెడ్ రిజర్వ్ కమిటి గురువారం రాత్రి ప్రకటించిన పాలసీ నిర్ణయాలు మెప్పించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. తక్షణమే ఫెడ్ ట్యాపరింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. నెలవారీగా చేపడుతున్న బాండ్ల కొనుగోళ్లను ఈ నవంబర్ నుంచి ప్రతి నెలా 15 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉందని హామీనిచ్చింది. ఆసియా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అమెరికా అక్టోబర్ ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం ఐరోపా మార్కెట్లు ఒకశాతం లాభంతో ముగిశాయి. యూఎస్ సూచీలు అరశాతం లాభంతో ప్రారంభమయ్యాయి. -
పెరుగుతున్న ఖాతాలు...తగ్గుతున్న బ్రోకింగ్ సంస్థలు
* నగదు మార్కెట్లో క్షీణిస్తున్న లావాదేవీలు * ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పెరుగుతున్న ట్రేడింగ్ పరిమాణం సాక్షి ప్రత్యేక ప్రతినిధి,హైదరాబాద్: ధమాకా దీపావళి వచ్చేసింది. మూరత్ ట్రేడింగ్‌తో కొత్త సంవత్సరం ఖాతాలు తెరుచుకుంటున్నాయ్. గతేడాదితో పోలిస్తే..కొన్ని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు రాకెట్లా దూసుకుపోతోంది. గత నాలుగైదునెలలుగా స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడి వ్యాపార పరిమాణం పెరుగుతోంది. పది లక్షల కొత్తఇన్వెస్టర్ అకౌంట్లు రెండు ప్రధాన డిపాజిటరీ సంస్థలయిన ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్లలో ఈ ఏడాది నమోదయ్యాయి.అయితే అదేం విచిత్రమోకానీ, ఒక వైపు బ్రోకింగ్ బిజినెస్ పెరుగుతున్నా, ఎంతో కాలంగా ఈ వ్యాపారంలో స్థిరపడ్డ బ్రోకర్లు వైదొలగుతుండటం ఆందోళనకలిగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో 335 మంది వ్యక్తిగత స్టాక్ బ్రోకర్లు, 136 కార్పొరేట్ బ్రోకర్లు, 5,773 మంది సబ్‌బ్రోకర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలిగారు. రిటైల్ ఇన్వెస్టర్ లావాదేవీలు ఆశించినంతగా లేకపోవడం, తక్కువ మార్జిన్లుండే ఆప్షన్ల వ్యాపారంపై డే ట్రేడర్లు ఆసక్తి చూపించడం, పెరిగిపోతున్న నిర్వహణా వ్యయాలను తట్టుకోలేకపోవడంతో బ్రోకర్లు వ్యాపారం నుండి వైదొలుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాష్ మార్కెట్లో మందకొడి లావాదేవీలు... మార్కెట్లో 90 శాతం వ్యాపారం కేవలం 10 మంది టాప్ బ్రోకర్ల చేతిలో ఉందని, షేర్ల లావాదేవీల్లో 90 శాతం వ్యాపారం కేవలం ఆప్షన్స్ సెగ్మెంట్లో జరుగుతుందని ఆర్ఎల్పీ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ మురళి తెలిపారు.గతంలో లాగా షేర్లు కొని డెలివరీ తీసుకునేవారు బాగా తగ్గిపోయారన్నారు. బ్రోకరేజీతో పాటు, సెక్యూరిటీ ట్రేడ్ టాక్స్ (ఎస్టీటీ), సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ లాంటి వ్యయాలతో పాటు ఒకే ఏడాది వ్యవధిలో షేర్లు కొని అమ్మితే షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ లావాదేవీ పరిమాణంలో 15 శాతం చెల్లించాల్సిరావడంతో క్యాష్ మార్కెట్లో లావాదేవీలు గ ణనీయంగా తగ్గాయన్నారు. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో మంచి ట్రేడింగ్ పరిమాణం నమోదవుతోందని, బ్రోకరేజ్ సంస్థలు ట్రేడర్ను బట్టి మార్జిన్లలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారన్నారు. ఒక్కో ట్రేడర్ జరిపే లావాదేవీల పరిమాణంబట్టి అతి తక్కువ బ్రోకరేజ్కూడా ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సిద్ధపడుతున్నాయన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ పెంపొందించాలి... స్టాక్మార్కెట్లో లావాదేవీలు జరిపే క్లయంట్లకు ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమిస్తోందని ప్రశాంత్ శ్రీమాలి, ఎండీ, పీసీఎస్ సెక్యూరిటీస్ తెలిపారు. తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేసినంత మాత్రాన అందరూ ఆన్లైన్ లావాదేవీలు జరపలేరని, సాంప్రదాయబద్ధంగా షేర్ మార్కెట్ బిజినెస్‌చేసే వారు బ్రోకరేజ్ సంస్థలకు దూరం కాలేరని ఆయన చెప్పారు. గత ఏడెనిమిది దశాబ్దాలుగా తామీ వ్యాపారంలో ఉన్నామని, ఇప్పుడు కూడా తమ వ్యాపారంలో 50 శాతం ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుండగా మిగతా సగం బ్రోకర్ ఇంటరాక్షన్‌తోనే జరుగుతుందన్నారు. రానున్న అడ్వైజరీ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అందిస్తే ఈ వ్యాపారంలో ఎంతకాలమైనా కొనసాగవచ్చన్నారు. అమెరికాలోలా ఇండియాలో ఫుల్సర్వీస్ బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్ అనే విధానంలేదని, ఇక్కడున్నదల్లా డిస్కౌంట్బ్రోకరే జ్ సంస్థలేని వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వివికే ప్రసాద్ సాక్షి ప్రతినిధికి తెలిపారు. కుటుంబ యాజమాన్యంలో ఉన్న స్టాక్‌బ్రోకింగ్ సంస్థలు హైస్పీడ్ ట్రేడింగ్‌కు అనుగుణంగా సేవలందించేందుకు ముంబైలో కోలొకేషన్ సర్వర్లను ఏర్పాటుచేసుకోలేకపోవడంతోనే ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలతో పోటీపడలేకపోతున్నాయన్నారు. ఒక్కో కోలొకేషన్ సర్వర్‌కు రూ. కోటి రూపాయలు ఖర్చవుతుందని, దీనితో పాటు ముంబైలో కార్యాలయం నిర్వహించాలంటే అయ్యే ఖర్చులు అదనం కావడంతో పోటీలో నిలవలేని సంస్థలు వ్యాపారం నుంచి వైదొలగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. చౌక ధరలే ఆకర్షణ... ఆన్లైన్ ట్రేడింగ్ పుంజుకోవడంతో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల నుండి స్టాక్స్ కొనుగోళ్లు, విక్రయాలు జోరందుకున్నాయి. నిఫ్టీ ఆప్షన్స్ ఒక లాట్ కొనుగోలు చేయాలంటే గతంలో వంద రూపాయలు బ్రోకరేజ్ చెల్లించాల్సి వచ్చేది. టెక్నాలజీ వినియోగం బాగా పెరగటంతో ఇప్పుడు ఒక లాట్ ఆప్షన్స్ బ్రోకరేజీ రూ. 10-20కి పడిపోయింది. దీంతో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే బ్రోకరేజీ సంస్థలు పోటీలో నిలబడలేకపోతున్నాయని జాజూ సెక్యూరిటీస్ ప్రతినిధి సంజయ్‌జాజూ చెప్పారు.