Murugesh Nirani
-
‘సీఎం అవుతానని చెప్పలేదే’
యశవంతపుర (కర్ణాటక): తాను సీఎం అవుతానని ఎక్కడా చెప్పలేదని మంత్రి మురుగేశ్ నిరాణి అన్నారు. శుక్రవారం బాగలకోటె జిల్లా బీళగి పట్టణ పంచాయతీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి బొమ్మై సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: వరద బాధితులపై కేంద్రానిది బాధ్యతారాహిత్యం అయితే ఇటీవల మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. మంత్రి మురుగేశ్ నిరాణి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నిరాణికి సీఎం అయ్యే సత్తా ఉందని, బీసీలు, పేదలు, అట్టడుగు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు ఆయన సేవ చేయగలరని కొనియాడారు. నిరాణి సీఎం అవుతారని అనగానే కార్యకర్తలు పెద్దపెట్టున హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
కారు వాడకంపై వెనక్కుతగ్గిన మాజీ సీఎం
బెంగళూరు: ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతుంటే.. లగ్జరీ కారులో పర్యటనలేంటని తీవ్రవిమర్శలు రావడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప వెనక్కు తగ్గారు. మాజీ మంత్రి, తన విధేయుడు, వ్యాపారవేత్త మురుగేష్ నిరాణి తనకు అందజేసిన లగ్జరీ కారును తిరిగి ఇచ్చేశారు. ట్రైన్ లలో ప్రయాణించి కరువు ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. కర్ణాటక బీజేపీ చీఫ్‌గా ఇటీవల పగ్గాలు చేపట్టిన బీఎస్ యడ్యూరప్ప కరువు ప్రాంతాల్లో పర్యటించేందుకు మురుగేష్ నిరాణి రూ.1.15కోట్ల ఖరీదైన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. 73 ఏళ్ల యడ్యూరప్ప రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఖరీదైన కారును సమకూర్చానని నిరాణి తెలిపారు. -
రెండేళ్ల తర్వాత కారు తిరిగిచ్చేస్తా...
నిరాణి అందజేసిన లగ్జరీ కార్‌పై యడ్యూరప్ప వ్యాఖ్య బెంగళూరు: మాజీ మంత్రి మురుగేష్ నిరాణి తనకు అందజేసిన రూ.1.16 కోట్ల విలువైన లగ్జరీ కారును రెండేళ్ల తర్వాత ఆయనకే తిరిగి ఇచ్చేస్తానని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప వెల్లడించారు. శనివారమిక్కడి డాలర్స్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాణి తనకు బహుమానంగా ఇచ్చిన కారును కరువు ప్రాంతాల పర్యటన పూర్తి చేయడంతో పాటు రెండేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. కరువు పర్యటన సమయంలో ఈ కారును కేవలం జిల్లా కేంద్రాల వరకు మాత్రమే పరిమితం చేస్తానని, గ్రామాలకు వేరే వాహనంలో వెళతానని యడ్యూరప్ప తెలిపారు. కారు ఖరీదును రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో పోల్చి వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. ఈనెల 29 నుంచి తాను కరువు పర్యటనను ప్రారంభించనున్నానని వెల్లడించారు. ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేపట్టిన కరువు పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు భయపడి కరువు పర్యటనను సీఎం సిద్ధరామయ్య చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల కంటే మంత్రి వర్గ విస్తరణపైనే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తోందని మండిపడ్డారు.