mustafa dossa
-
ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి
ముంబై: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) బుధవారం గుండెపోటుతో మరణించాడు. దావూద్ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలోని జైలులో ఉండగా బుధవారం తెల్లవారుజామున దోసాకు ఛాతీలో నొప్పి మొదలైంది. అధికారులు వెంటనే ముంబైలోని జేజే ఆసుపత్రికి అతణ్ని తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం రెండున్నర గంటలప్పుడు దోసా ప్రాణాలు విడిచాడని వైద్యులు వెల్లడించారు. ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు సరఫరా చేసింది దోసానే. దోషులు పాకిస్తాన్‌కు వెళ్లి శిక్షణ పొందడానికి కూడా దోసా సోదరులు సహాయం చేశారు. గతంలో ఇదే కేసులో ఉరితీతకు గురైన యాకుబ్ మెమన్ కన్నా దోసా పాత్ర ఎంతో ప్రధానమైనదనీ, దోసాకు కూడా మరణశిక్ష విధించాల్సిందిగా కేసు విచారణ సమయంలో సీబీఐ కోర్టుకు విన్నవించింది. కాగా, ముస్తఫా మరణించినందున శిక్షా కాలం నిర్ణయించడానికి సంబంధించిన విచారణను కోర్టు శుక్రవారం వరకు వాయిదా వేసింది. -
‘సీబీఐ ఉరి తీయాలంది.. ఆలోపే చనిపోయాడు’
ముంబయి: 1993నాటి ముంబయి పేలుళ్ల కేసులో దోషి ముస్తఫా దోసా మృతిచెందాడు. తీవ్ర అనారోగ్యంతో జేజే ఆస్పత్రిలో చేరిన అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ముంబయి పేలుళ్ల కేసులో ఇటీవలె టాడా కోర్టు దోసాను దోషిగా తేల్చింది. శిక్ష కాలాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ముంబయిలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న దోసాకు తీవ్ర జ్వరం రావడంతోపాటు అధిక రక్తపోటు సమస్య తలెత్తడంతో జేజే ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం 2.30గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు ఆస్పత్రిలోని టీపీ లహానే అనే వైద్యుడు తెలిపారు. గతంలోనే అతడికి బైపాస్ సర్జరీ అయిందని.. తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి రావడంతో ఈ రోజు ఉదయం నుంచి పలుమార్లు గుండెపోటు వచ్చిందని వివరించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసులు చెప్పారు. ముంబయి పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన యాకుబ్ మీనన్‌కు, ముస్తాఫా దోసాకు, ఫిరోజ్ ఖాన్‌కు మరణ శిక్ష విధించాలంటూ ఈ కేసును విచారిస్తున్న సీబీఐ నిన్ననే కోర్టును కోరింది. -
1993 పేలుళ్లు: నిందితుడు రైల్లో భార్యతో ఎంజాయ్
ముంబై: 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు ముస్తఫా దొస్సా రాత్రి రైల్లో భార్యతో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయాడు. పేలుళ్లలో దొస్సా పాత్రపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 2015లో మోడళ్లకు ఆడిషన్ నిర్వహిస్తూ దొస్సా పోలీసులకు దొరికిపోయాడు. ఇదిలా వుండగా పేలుళ్ల కోసం ఉపయోగించిన మందు సామగ్రిని ఎక్కడి నుంచి సేకరించారనే విషయంపై విచారించడానికి దొస్సాను పోలీసులు ముంబై నుంచి పోర్ బందర్ కు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అందుకు రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, దొస్సా రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో అతని భార్య కూడా వెంటే ఉంది. అహ్మదాబాద్ లో సౌరాష్ట్ర ఎక్స్ ప్రెస్ ఆగిన సమయంలో దొస్సా భార్య షబీనా ఖత్రీ బోగీలోపలికి ప్రవేశించింది. వీరిద్దరు కలిసివున్న ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సమయంలో పోలీసులు కూడా పక్కనే ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. కాగా, గతేడాది పేలుళ్లలో మరో నిందితుడైన అబూ సలేం కూడా విచారణకు వేరే ప్రదేశానికి వెళ్లే సమయంలో భార్యతో రైల్లో కనిపించాడు. బిజినెస్ మీటింగ్స్ పోర్ బందర్ కు వెళ్తున్న సమయంలో రైల్లో కొందరితో వ్యాపార విషయాలపై దొస్సా చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో జైలు నుంచి తన వ్యాపారాలన్నింటిని దొస్సా చక్కబెట్టుకుంటున్న వ్యవహారం బయటపడింది. భార్యతో రైలు అహ్మదాబాద్ చేరుకోగానే.. దొస్సా భార్య ఖత్రీ రైల్లో భర్తను కలిసింది. ఆ తర్వాత పోలీసులు వారిద్దరిని ఒంటరిగా వదిలేసి.. తిరిగి రైలు పోర్ బందర్ చేరుకున్న తర్వాత మాత్రమే తిరిగి దొస్సా వద్దకు వెళ్లినట్లు తెలిసింది.