musthabad
-
IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్!
ముస్తాబాద్(సిరిసిల్ల): క్రికెట్ అండర్–19 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికై , సంచలనం సృష్టించాడు 18 ఏళ్ల ఎరవెల్లి అవనీష్‌రావు. అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుకు ఆడబోతున్నాడు కూడా! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన అవనీష్రావును.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు దక్కించుకుంది. దుబాయ్‌లో గత మంగళవారం జరిగిన ఐపీఎల్-2024 వేలంలో అతడిని సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసులో ఆట ప్రారంభం వికెట్ కీపర్‌గా, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా రాణిస్తున్న అవనీష్‌రావు.. నెల రోజుల వ్యవధిలో ఆసియా కప్, ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ట్రై సీరిస్‌తోపాటు.. జనవరి 19 నుంచి జరగనున్న అండర్–19 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఐపీఎల్లో పెద్ద జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమారుడు పోతుగల్‌కు చెందిన ఎరవెల్లి బాలకిషన్‌రావు సబ్‌రిజిస్ట్రార్‌గా రిటైరయ్యారు. ఆయన కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ లక్ష్మణ్‌రావు–సుష్మ దంపతుల కుమారుడు అవనీష్‌రావు బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించగా తండ్రి ప్రోత్సహించారు. నిత్యం జింఖానా మైదానంలో 10 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడు. పాఠశాల చదువు సమయంలోనే అవనీష్‌రావు హైదరాబాద్ అండర్–14, 16కు ఎంపికయ్యాడు. హెచ్‌సీఏ సైతం అతని ప్రతిభ చూసి, చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. బీసీసీఐ దృష్టిలో పడగా, అండర్–19 భారత జట్టుకు ఎంపిక చేసింది. తక్కువ వయసులో క్రికెట్లో రాణిస్తున్న అవనీష్‌రావు రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్ఫూర్తి.. చిన్నప్పటి నుంచి తనకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటే ఇష్టమని అవనీష్‌రావు తెలిపాడు. ఎడమ చేతివాటంతో ఆయన ఎంత ఫేమస్ అయ్యారో.. తాను కూడా అలా కావాలనుకున్నానని తెలిపాడు. తాను మొదట హైదరాబాద్‌లోని హిందూ మహావిద్యాలయలో చేరి, కోచ్ చందు ఆధ్వర్యంలో ఆటపై పట్టు సాధించానని, అనంతరం ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అకాడమీలో చేరి, మరింత రాటుదేలినట్లు తెలిపాడు. పలు టోర్నీల్లో అవకాశాలు వచ్చాయని, అండర్–19 వరల్డ్ కప్‌కు ఎంపికవ్వాలనే లక్ష్యంతో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేశానన్నాడు. తన లక్ష్యం భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడమేనని పేర్కొన్నాడు. చదవండి: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
మిషన్ చెరువుకు గండి
‘మిషన్ కాకతీయ’లో నాణ్యతకు పాతర గంటల్లో వెళ్లిపోయిన నీరు విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు ధ్వంసం కొట్టుకుపోయిన గంగమ్మ ఆలయం ఆందోళన చెందుతున్న రైతులు ముస్తాబాద్: ముస్తాబాద్ పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది. గంటల వ్యవధిలో చెరువులోని నీరంతా ఖాళీ అయింది. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. సుమారు 200 ఎకరాల్లోని వరిపొలాలు నీటిపాలయ్యాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, పోత్గల్‌లోని గంగమ్మ ఆలయం కొట్టుకుపోయాయి. సిద్దిపేట–ముస్తాబాద్ వంతెన తెగిపోయింది. కట్టకవింద నిర్మిస్తున్న శ్మశానవాటిక ధ్వంసమైంది. గ్రామానికి చెందిన రాగం భిక్షపతి, నిమ్మ ప్రవీణ్‌కు చెందిన రెండు గేదెలు గల్లంతయ్యాయి. చెరువు అడుగున బండరాళ్లు ఉండడంతో కట్ట బలహీనంగా మారి గండిపడిందని ఈఈ చిరంజీవులు తెలిపారు. అన్నదాతల ఆశలకు గండి అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి. 24 ఏళ్ల తర్వాత నిండిన చెరువు చూస్తుండగానే ఖాళీ అయ్యింది. చాలా రోజుల తర్వాత జలకళ సంతరించుకున్న చెరువును చూసి మండలవాసులు ఆనందపడ్డారు. సాగు, తాగునీటికి ఢోకాలేదని నిశ్చింతంగా ఉన్నారు. కానీ.. వారి ఆనందం ఎంతో కాలం నిల్వలేదు. నిజాం కాలంనాటి చెరువు ఏనాడు చెక్కుచెరదలేదు. ఇటీవల మిషన్ కాకతీయ పథకంలో ఈ చెరువును చేర్చి మరమ్మతులు అంటూ పనులు చేపట్టారు. పనులు ఎలా చేపట్టారో దేవుడెరుగు. ఏళ్లతరబడి చెక్కుచెదరని చెరువు అలా నిండి ఇలా ఖాళీ అయింది. రబీకు ఇబ్బంది లేదనుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. రైతులు, నాయకుల ఆందోళన మిషన్ కాకతీయలో భాగంగా రూ.47 లక్షలు వెచ్చించి చేపట్టిన పనులు నాసిరకంగా ఉండడంతోనే పెద్దచెరువుకు గండిపడిందని రైతులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ కక్కుర్తితో ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కట్టకు ఉన్న రివిట్మెంట్ను తొలగించారని.. కనీసం కట్టపై మట్టిపోసి రోలర్లతో తొక్కించలేదని ఆరోపించారు. ‘మిషన్ కాకతీయ’ కమీషన్ల పథకంగా మారిందని ఆరోపించారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీ గజ్జెల రాజు, అఖిలపక్షం నాయకులు తిరుపతి, రాములు, రాంగోపాల్, చాకలి రమేశ్, చింతోజు బాలయ్య, కార్తీక్, మహేశ్‌రెడ్డి, రాజిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఉపేంద్ర, రైతులు పాల్గొన్నారు. ఎవరిదీ పాపం? రెండు దశాబ్దాల తర్వాత నిండిన చెరువును చూసి ముస్తాబాద్ వాసులు మురిసిపోయారు. మూడు రోజుల క్రితమే పెద్ద చెరువుకు పలుచోట్ల లీకేజీలు ఉన్నాయని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. చెరవుకు గండిపడేవరకు చూశారు. రైతులను నిండా ముంచారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేదికాదని పలువురు పేర్కొంటున్నారు. -
ఎస్సై శ్రీధర్ అంత్యక్రియలు
ముస్తాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కెరమెరి ఎస్సై కాశమేని శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌లో పోలీస్ అధికారిక లాంఛనలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీధర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగానే బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ప్రజల సందర్శనార్థం మృతదేహన్ని ఆయన ఇంటిలో ఉంచారు. కరీంనగర్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్, సిరిసిల్ల రూరల్ సీఐ శ్రీధర్, టౌన్ సీఐ విజయ్‌కుమార్, ఎస్సైలు ప్రవీణ్, ఉపేందర్, లక్ష్మారెడ్డి, ఎస్బీ ఎస్సై మారుతి, ప్రత్యేక పోలీస్ బృందం సెల్యూట్ చేశారు. మానేరు వాగులో ఆశ్రునయనాలతో శ్రీధర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వందలాది మంది తరలివచ్చారు. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. శ్రీధర్ తల్లిదండ్రులు స్వతంత్ర, ధర్మయ్యలను పోలీస్ అధికారులు ఓదార్చారు. -
మానస...మనోజ్ అయ్యాడు..
కామారెడ్డి : తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మిదేవత ఇంటికి వచ్చిందని మురిసిపోయారు. చూడచక్కగా ఉన్న పాపకు మానస పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏడాది.. రెండేళ్లు.. మూడేళ్లు..పదేళ్లు గడిచాయి. అంతలోనే మానసకు కడుపులో నొప్పి రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తల్లిదండ్రులు డాక్టర్ల వద్ద చూపించారు. రకరకాల పరీక్షలు, స్కానింగ్ తరువాత ఆమెలో మగ లక్షణాలున్నాయని తేల్చారు. గర్భాశయం, అండాశయం లేవని నిర్ధారించారు. పురుషాంగాలు లోపల ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు డబ్బు చాలానే ఖర్చవుతుందన్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పులు చేసి ఈ నెల 9న కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లోని పీపుల్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపు లోపలి భాగంలో ఉన్న వృషణాలను బయటకు తీసి సరిచేశారు. ఇది అరుదైన ఘటనగా చెప్పారు. మానస పేరును మనోజ్‌గా మార్చేశారు. ఇప్పుడు మనోజ్‌గా కొత్త జీవితం మొదలైంది. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్య దంపతులు కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్‌లో 20 ఏళ్లుగా నివసిస్తారు. రాజు బీడీ కంపెనీలో పనిచేస్తుండగా, లావణ్య బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. వారికి 2005 జూన్ 26న మానస జన్మించింది. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్‌లోని వాగ్దేవి పాఠశాలలో మానస చదువుతోంది. గత యేడాది 4వ తరగతి చదివింది. ఏడాదిగా సంఘర్షణ... మానస ఆడపిల్ల కాదని తెలిసిన నాటి నుంచి తల్లిదండ్రులు ఎంతో సంఘర్షణకు లోనయ్యా రు. తమ కూతురి సమస్య ఎలా పరిష్కారమవుతుందోనని ఆ తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. కూతురిని వెంటబెట్టుకుని ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. బీడీలపైనే ఆధారపడ్డ ఆ దంపతులు కూతురిని కాపాడుకునేందుకు అప్పు లు చేసి మరీ ప్రయత్నాలు చేశారు. ఎలాగోలా ఆపరేషన్ చేయించారు. ఏడాది కాలం గా పడ్డ సంఘర్షణకు తెరపడడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కాని మరో మూడు నెలలకు మరో ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పిన మీదట మరిన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేవాలనేది ఆ తల్లిదండ్రులకు తీవ్ర సమస్యగా మారింది. ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం బీడీ కంపెనీలో పనిచేసే రాజు, బీడీలు చుట్టే లావణ్యల సంపాదన సంసారానికే సరిపోతుంది. అయితే తమ కూతురి సమస్యతో ఇబ్బందులు పడ్డ రాజు, లావణ్యలు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏడాదిపాటు తిరగడానికి, వైద్యానికి రూ. లక్షన్నర అప్పు చేశారు. చేసిన అప్పు తీర్చడం ఒక ఎత్తయితే, మరో ఆపరేషన్‌కు కావలసిన డబ్బులు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి భారంగా మారాయి. తమకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.