ఎస్సై శ్రీధర్‌ అంత్యక్రియలు | fumeral of SI | Sakshi
Sakshi News home page

ఎస్సై శ్రీధర్‌ అంత్యక్రియలు

Published Wed, Aug 31 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

ఎస్సై శ్రీధర్‌ అంత్యక్రియలు

ఎస్సై శ్రీధర్‌ అంత్యక్రియలు

ముస్తాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్సై కాశమేని శ్రీధర్‌ ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌లో పోలీస్‌ అధికారిక లాంఛనలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీధర్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగానే బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ప్రజల సందర్శనార్థం మృతదేహన్ని ఆయన ఇంటిలో ఉంచారు. కరీంనగర్‌ జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు సురేందర్, సిరిసిల్ల రూరల్‌ సీఐ శ్రీధర్, టౌన్‌ సీఐ విజయ్‌కుమార్, ఎస్సైలు ప్రవీణ్, ఉపేందర్, లక్ష్మారెడ్డి, ఎస్‌బీ ఎస్సై మారుతి, ప్రత్యేక పోలీస్‌ బృందం సెల్యూట్‌ చేశారు. మానేరు వాగులో ఆశ్రునయనాలతో శ్రీధర్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వందలాది మంది తరలివచ్చారు. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. శ్రీధర్‌ తల్లిదండ్రులు స్వతంత్ర, ధర్మయ్యలను పోలీస్‌ అధికారులు ఓదార్చారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement