ఇద్దరూ ఇద్దరే!
ఇద్దరు అమ్మాయిలు. ఒకరు మలయ పవనమైతే ఒకరు సుడిగాలి. ఒకరు మంచుముక్క అయితే ఒకరు నిప్పుకణిక. వారిద్దరూ తారసపడితే? ఒకరితో ఒకరు పోటీ పడితే? ఒకరికొకరు ఎదురు నిలిస్తే? ఏమవుతుందో తెలుసుకోవాలంటే ‘ముత్యాలముగ్గు’ సీరియల్ చూడాలి.
అసలు ‘ముత్యాలముగ్గు’ అన్న పేరు విన్నప్పుడే మన మనసులో దాని మీద ఆసక్తి ఏర్పడుతుంది. ఓ గొప్ప సినిమా పేరు పెట్టారు, కథ కథనాలు ఎలా ఉంటాయో, పాత్రల చిత్రణ ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్సుకత ఉంటుంది. అందుకే ‘ముత్యాలముగ్గు’ సీరియల్ పట్ల మొదటే అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఉందా ధారావాహిక. రెండు విభిన్నమైన కుటుంబాలు, రెండు విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన హీరోయిన్లు, వారి మధ్య వచ్చే వివాదాలు, పరిష్కారాలు, సర్దుబాట్ల మేళవింపు ఈ సీరియల్. ఈ మధ్యనే మొదలైంది. ఆసక్తికరంగా సాగిపోతోంది. మరి ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతోందో చూడాలి!