Mutyalaraju
-
ధిక్కార కేసులో కోర్టుకు హాజరైన ముత్యాలరాజు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో పశ్చిమ గోదావరి జిల్లా అప్పటి కలెక్టర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు గురువారం వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరయ్యారు. అప్పటి నిడదవోలు తహసీల్దార్ శాస్త్రి, పంచాయతీరాజ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ గంగరాజు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం ఆక్రమణలను తొలగించి, పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలన్న తమ ఆదేశాల అమలులో ఎందుకు జాప్యం జరిగిందని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు. అప్పట్లో అధికారులందరూ కోవిడ్ విధుల్లో తీరికలేకుండా ఉన్నారని, దీంతో కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరిగిందని ముత్యాలరాజు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. జాప్యం ఉద్దేశపూర్వకం కాదని చెప్పారు. ఇందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నామన్నారు. ఇప్పటికే సర్వేచేసి ఆక్రమణలను తొలగించామన్నారు. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అధికారులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. -
ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఐఐటీ ర్యాంకర్లకు సీఎం జగన్ అభినందన
-
అమ్మా.. క్షమించండి!
ఏలూరు : ‘అమ్మా.. క్షమించండి. ఏమైనా బాధపెట్టి ఉంటే వెరీ వెరీ సారీ’.. ఈ మాటలు సామాన్య వ్యక్తులు పలికినవి కాదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగంను ఉద్దేశించి అన్న మాటలివి. జేడీ గౌసియాబేగం అత్త శనివారం మృతి చెందారు. అయితే, కొత్త ప్రభుత్వంలో మొదటిసారిగా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించడంతో ఆమె విధులకు హాజరయ్యారు. సమావేశం మొదట్లో వ్యవసాయ శాఖపై సమీక్షలో నాయకులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఎమ్మెల్యేలు సూచించిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్నారు. అనంతరం ఆమె అత్త మృతి చెందిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఉప ముఖ్యమంత్రి సుభాష్‌చంద్రబోస్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ శాఖ విభాగంపై సమీక్ష ముగిసిన వెంటనే.. గౌసియా బేగంకు సమావేశం నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ ‘అమ్మా.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి’ అని ఉప ముఖ్యమంత్రి కోరారు. -
విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు
కలెక్టరేట్ (కాకినాడ) : ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లి తిరిగి వచ్చిన తహశీల్దార్లు తక్షణం విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు హెచ్చరించారు. కలెక్టరేట్లో ఆయన ఆర్డీవోలతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల అనంతరం తిరిగి జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు వివిధ మండలాల్లో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకూ పలువురు విధుల్లో చేరలేదు. దీనిపై మండిపడిన జేసీ బుధవారం సాయంత్రంలోగా వారు విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అమలాపురం డివిజన్లోని అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం; రామచంద్రపురం డివిజన్లోని అనపర్తి, రాయవరం; రాజమండ్రి డివిజన్లోని కడియం, సీతానగరం, ఆలమూరు; రంపచోడవరం డివిజన్లోని గంగవరం, రాజవొమ్మంగి తహశీల్దార్లు; కలెక్టరేట్లోని ఏవోతోపాటు హెచ్ సెక్షన్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్లు; రాజమండ్రి, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల ఏవోలు ఇంతవరకూ విధుల్లో చేరలేదు. నాలుగు రోజుల కిందట స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వారు బాధ్యతలు తీసుకోలేదు. వారందరూ బుధవారం సాయంత్రం లోగా విధుల్లో చేరాలని చివరిసారిగా జేసీ డెడ్‌లైన్ విధించారు. లేకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ధ్రువపత్రాల కోసం మీసేవా కేంద్రాల నుంచి వచ్చిన దరఖాస్తులు సుమారు 25 వేలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటికి నిర్దేశించిన గడువు పూర్తయినప్పటికీ ధ్రువపత్రాలు జారీ నిలిచిపోయిందన్నారు. ఈ విషయాన్ని ఆర్డీవోలు సీరియస్‌గా తీసుకుని తక్షణమే పెండింగ్ దరఖాస్తులు క్లియర్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు బీఆర్ అంబేద్కర్, కూర్మనాధ్, నాన్‌రాజ్, వరప్రసాద్‌తోపాటు పలువురు తీర ప్రాంత తహశీల్దార్లు పాల్గొన్నారు.