MV Ramana Reddy
-
కమనీయం..‘రమణీ’యం
నగరంలో నిత్యం కళాభిమానుల్ని పలుకరించే పలు ముఖ్యమైన కూడళ్లలో కనిపించే కళాత్మకత వెనుక ఆయన సృజన ఉంటుంది. నగరవాసులు, నగరేతరులైన కళాభిమానులు సందర్శించే పలు శిల్పాకృతుల వెనుక నగరం కళల రాజధాని కావాలనే కల సాకారం చేసుకోవాలనే తపన ఉంది. అలుపెరుగని ఆ తపన పేరు ఎంవీ.రమణారెడ్డి. దాదాపు మూడు దశాబ్దాల కళా ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నగర శిల్ప కళాకారునితో ముచ్చటించిన సందర్భంగా ఆయన పంచుకున్న జ్ఞాపకాల ప్రయాణం ఆయన మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో జన్మతః సిద్దిపేట వాస్తవ్యుడైనా నగరంలోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి స్కల్ప్చర్ (శిల్పకళ)లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడలిస్ట్గా నిలిచాడు.. ఆ తర్వాత నుంచి నా కళా ప్రయాణం నగరంతో మమేకమై సాగింది. అడుగడుగునా.. ఆవిష్కరణ.. నగరానికి తలమానికమైన ఎయిర్‌పోర్ట్‌లోని నోవోటెల్ హోటల్‌తో మొదలుపెడితే.. నగరంలోని అనేక చోట్ల, ముఖ్య కూడళ్లలో కొలువుదీరిన కళాకృతులెన్నో రూపొందించాను. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రూపకల్పనలో ప్రధాన ఆర్కిటెక్ట్‌గా పనిచేయడం ద్వారా అందిన ఎన్నో భావోద్వేగాలను మరచిపోలేని అనుభవం. అదే విధంగా ఢిల్లీ రిపబ్లిక్ వేడుకల్లో మన రాష్ట్రం తరపున శకటం రూపకల్పన మరో చిరస్మరణీయ జ్ఞాపకం. నగరం విశ్వనగరంగా మారనుందని ఆనాడే జోస్యం చెబుతూ.. విప్రో సర్కిల్లో ఏర్పాటైన తొలి అత్యాధునిక శిల్పాకృతి.. స్టేట్ గ్యాలరీలోని గాంధీజీ స్టీల్ వర్క్స్, రవీంద్రభారతిలోని శిల్పాకృతులు, మెట్రో రైల్ కోసం 30 అడుగుల స్టెయిన్ లెస్ స్టీల్ స్కల్ప్చర్ పైలాన్ కాన్సెప్ట్ డిజైన్, ‘శిల్పారామం’ కోసం 25 అడుగుల స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పం.. అలాగే టీజీపీఎస్సీ లోగో కావచ్చు ప్రపంచ తెలుగు మహాసభల సదస్సు లోగో. వంటివెన్నో నా నగరం కోసం.. నా రాష్ట్రంలో నన్ను మమేకం చేశాయి. కల సాకారం కావాలని.. ప్రస్తుతం నగరంలో కళలకు అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఇలా అన్ని వైపుల నుంచి మంచి సహకారం లభిస్తోంది. దీన్ని ఉపయోగించుకుని మరింత మంది కళాకారులు వెలుగులోకి రావాలి. ఆర్ట్ అనేది అభిరుచి మాత్రమే కాదు అద్భుతమైన కెరీర్ కూడా అనే నమ్మకం యువతలో రావాలి. నగరం కళాసాగరం కావాలి. అదే నా తపన.. ఆలోచన అందుకు అనుగుణంగానే నా కార్యాచరణ.ఎన్నో హోదాలు.. పురస్కారాలు.. తెలంగాణ రాష్ట్రం నుంచి 2020లో న్యూఢిల్లీలో లలిత్ కళా అకాడమీ, మొదటి జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యా. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి అధ్యక్షుడిగా 2015 నుంచి 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాటు సొసైటీ సభ్యుల సంఖ్య పెంచడంలోనూ కృషిచేశా. తద్వారా సొసైటీని చురుకుగా మార్చగలిగాను. నేను అందించిన సేవలకు గానూ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘విశిష్ట పురస్కారం’ అందుకున్నా. నేనే స్వయంగా ‘బయో–డైవర్సిటీ ఈస్తటిక్స్’ యాన్ ఆర్టిస్టిక్ రిఫ్లెక్షన్ అనే పుస్తకం రచించగా.. నా గురించి ‘ఎంవి. రమణారెడ్డి.. పాత్ టూ ఆరి్టస్టిక్ బ్రిలియన్స్.. ఏ జర్నీ పేరిట నా ప్రయాణాన్ని రచయిత కోయిలీ ముఖర్జీ ఘోష్ లిఖించారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర 109
వేకువ జ్ఞానం పొందేందుకు రకరకాలుగా ప్రయత్నించాడు సిద్ధార్థుడు. కుటుంబాన్ని వదిలేసి, ‘రాజగృహ’ దిశగా బయలుదేరాడు. బయలుదేరే సమయానికి యశోధర కొడుకును ప్రసవించింది. పుత్ర వాత్సల్యమనే మోహపాశమైనా సిద్దార్థుని ప్రయత్నాన్ని ఆపలేకపోయింది. ఆశ్రమాన్ని వదిలి, వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక కొండగుహను ఎన్నుకుని తపస్సులో కూర్చున్నాడు. కొన్ని రోజులకు సిద్దార్థుని శరీర బలం పూర్తిగా నీరసించిందేగానీ జ్ఞానం జాడ దొరకలేదు. ఇలా లాభం లేదనుకుని నదివొడ్డునే ఉన్న రావిచెట్టు నీడలో కూర్చుని, నెలల పర్యంతం తనలో తాను తర్కించుకోవడం మొదలెట్టాడు. అలా తర్కించుకోగా తర్కించుకోగా... మెదడును కమ్ముకున్న మబ్బులు కొద్దికొద్దిగా విచ్చిపోవడం ప్రారంభించాయి. కొంతకాలానికి జ్ఞానోదయమైన సంతృప్తితో బుద్ధుడైన సిద్దార్థుడు సంచారానికి బయలుదేరాడు. లోకంలోని బాధలన్నింటికీ మూలం స్వార్థచింతన; మానవుని అంతరంగానికి ‘దురాశ’ అనేది అంతులేని యాతనకు గురిచేస్తుందనేది బుద్ధుని తాత్వికచింతనకు పునాది.అందువల్ల, వదులుకోవలసినవాటిలో మొదటిది - ఇంద్రియాలను తృప్తిపరచాలనే కోరిక; రెండవది - కీర్తి, సంపదలను ఆర్జించాలనే ఆశ; మూడవది - చిరంజీవిగా ఉండాలనే తాపత్రయం. మనిషి ఆలోచనా ప్రపంచం నుండి ‘నేను’ (అహం) అనే సర్వనామం తొలగించుకుంటే, మహోన్నతమైన జ్ఞానానికి దారి ఏర్పడుతుంది. ‘నిర్వాణం’ అంటే ప్రాణాలను త్యజించడం కాదు, ‘అహం’ అనే భావాన్ని త్యజించడం. ఈ లక్ష్యాల సాధన కోసం తప్పనిసరిగా పాటించవలసిన క్రమశిక్షణగా ఎనిమిది నియమాలనూ గౌతమబుద్ధుడు నిర్దేశించాడు. వాటిల్లో మొదటిది మాటలో నిజాయితి; రెండవది నడవడికలో నిజాయితి; మూడవది బతుకు తెరువులో నిజాయితి; నాలుగవది వాంఛలో పరిశుద్ధత; ఐదవది సరైన దృక్పథం; ఆరవది ప్రయత్నంలో నిజాయితి; ఏడవది ఉద్రేకాల నిగ్రహం; ఎనిమిదవది ఆత్మపరిశీలనలో నిజాయితి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది కోరికలు చంపుకోవాలని కాదు బుద్ధుడు చెప్పింది; వాటిని సరైన మార్గానికి మరలించమని. కోరికలు చంపుకోగలిగినవి కావు; అవి చచ్చిపోతే మనిషికి బతుకు మీద ఆశే చచ్చిపోతుంది. పైగా, కోరికలను వదులుకోవడం ఆచరణ సాధ్యం కాని ప్రయత్నం.అందువల్ల, కోరికలను సరైన మార్గంలో నడిపేందుకు ప్రతిమనిషి సరైన దృక్పథం ఏర్పరుచుకోవాలి. ఉదాహరణకు సమాజానికి సేవ చేయడం, న్యాయం నిలబెట్టేందుకు పాటుపడటం. కళల పట్ల ఆసక్తి వంటివి పెంపొందించుకోవాలని ఉద్దేశం. ప్రయత్నంలో నిజాయితి అంటే - పనేమో మంచిదే, కానీ దాన్ని సాధించేందుకు అవలంబించిన మార్గం నీచమైనదై, ఫలితాన్ని బట్టి మార్గాన్ని సమర్థించుకోవడం తగదని ఉద్దేశం. ఉద్రేకాలనేవి జీవికి సహజ లక్షణం. వాటిని అదుపులో పెట్టుకోగలిగినప్పుడే పశుత్వం వదలిన మనిషౌతాడు. అందువల్ల, ఉద్రేకాలను నియంత్రించడమే కాదు, ఆ దశ నిరంతరం కొనసాగాలంటే మనం చేసుకునే ఆత్మపరిశీలనలో నిజాయితీ ఉంటేనే సాధ్యం అనేది వాటి సారాంశం. ఈ బోధనలకు తోడు బుద్ధుడు పునర్జన్మల వంటి విశ్వాసాలను ఖండించాడు. బుద్ధుని ప్రచారాలు వైదికులకు వ్యతిరేకం కాకపోయినా, ఆ కోవకు చెందినవాళ్లకు అవి కంటగింపు కలిగించినా, ప్రజాబాహుళ్యాన్ని ఆ తత్వం ఆకర్షించింది. జీవితాంతం ఆదరాభిమానాలు చూరగొన్న తాత్వికునిగా తన 80వ ఏట గౌతమబుద్ధుడు ‘కుశినర (నేటి ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్)’లో జీవిత ప్రస్థానం ముగించాడు. బుద్ధుని బోధనలు స్పష్టమైనవిగాను, అర్థం చేసుకునేందుకు తేలికైనవిగాను ఉండటమే కాక, అత్యాధునిక భావాలకు దగ్గరగా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. (సమాప్తం) ఇన్ని రోజులుగా మీ ఆదరణ పొందిన ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ను నేటితో ముగిస్తున్నాము. దీనిని పుస్తకరూపంలో చూడాలనుకునేవారు ఈ క్రింది రచయితను సంప్రదించవచ్చు. - ఎడిటర్ -
టూకీగా ప్రపంచ చరిత్ర 107
వేకువ ఈనాడు ‘భారతదేశం’ భూభాగం సరిహద్దుల పరిధిలో దావానలంలో నెరుసుకున్న ‘వర్ణవ్యవస్థ’ ఆర్యులకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంక్రమించిందో కాలానుక్రమంగా రుజువు చేయడం కష్టమైనా, వేదకాలంలో ఉండేది కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. రుగ్వేదం తొమ్మిది మండలాలకు గాను ఒకే ఒక్కచోట ‘క్షత్రియ’ అనే పదం కనిపిస్తుంది. సామవేద మొత్తానికి ఒకేవొక సందర్భంలో ‘బ్రాహ్మణులం’ అనే పదం చోటుచేసుకుంది. మౌఖికంగా ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవుతున్నప్పుడు ప్రక్షిప్తాలు అతి గుప్తంగా జరిగిపోయే అవినీతి. ఒకవేళ అప్పటివే అయినా, ఆ కాలంవారు వాటిని ఏ అర్థంలో ప్రయోగించారో చెప్పడం సాధ్యపడదు. ఈనాడు అందరూ ఆమోదిస్తున్న వేదభాష్యం శాయనుని వ్యాఖ్యానం. శాయనుడు క్రీస్తు తరువాత 1500 కాలానికి చెందినవాడు. ఎంత లేదన్నా వేదం పుట్టిన కాలానికీ శాయనుని కాలానికీ మధ్య 3000 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. పెరైండు తావులను మినహాయిస్తే, మూలవేదంలో వర్ణవ్యవస్థ మచ్చుకైనా కనిపించదు. గంగా మైదానంలో అధర్వవేదం పుట్టుకొచ్చేదాకా వర్ణవ్యవస్థ ఘనీభవించినట్టు కనిపించదు. రుగ్వేదంలో ఒకటి రెండు చోట్ల మాటమాత్రంగా కనిపించే ‘మనువు’ పురాణ పురుషుడే గానీ, వేద పురుషుడు కాజాలడు. వేదకాలంలో ఆర్యుల్లో తరగతి విభజన లేదు. మహావుంటే రుషుల వంటి ప్రముఖులు, తదితరులు అనే తేడా. కానీ, గంగామైదానం చేరిన తరువాతి రోజుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తరగతులుగా, లేదా వర్ణాలుగా, సమాజం విభజించబడింది. విద్య, విజ్ఞానం కలిగినవారుగా ఆర్యులు బ్రాహ్మణులైనారు. ఆలమందల యజమానులు వైశ్యులైనారు. అదివరకటి పశువుల కాపరులు, క్షురకుల వంటి సేవకులతో కలిపి, రైతులను వృత్తిపనివాళ్లను మెలూహన్ల నుండి విలీనం చేసుకున్నారు. వృత్తిపనుల యజమానులుగా ఉండిన మెలూహ్హన్లు కమ్మరి, సాలె, కంసలి వంటి అగ్రస్థాయి శూద్రులైనారు. వ్యాపారానికి ప్రాముఖ్యత లేనందువల్ల మెలుహ్హన్ వణిజులు విడతలు విడతలుగా దక్షిణాదికి చేరుకుని చిల్లర వర్తకులైనారు. అలాంటివారి ప్రయత్నంలో దక్షిణాదిలో సముద్రయానం ముమ్మరమైంది. ఇంతకూ క్షత్రియులు ఎవరి నుండి ఏర్పడ్డారో ఇదమిత్తంగా చెప్పలేం. వేదకాలం ఆర్యుల్లో ప్రభుత్వాలు లేవు. సింధూప్రాంతంలోని పరిపాలనా విధానం తీరే ఇప్పటికి తెలిసిరాలేదు. పరస్పర అన్యోన్యతా, వేదత్రయం మినహా మిగతా సంస్కృత సాహిత్యం నేర్చుకునేందుకు క్షత్రియులు పొందిన అర్హతలను బట్టి, ఆ వర్ణం ఆర్యుల నుండి ఉద్భవించినదే అయ్యుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంశాలు ‘గోత్రం’ ద్వారా గుర్తింపబడ్డాయి. ఆర్యత్వానికి సంకేతంగా ‘యజ్ఞోపవీతం’ ఉనికిలోకొచ్చింది. శూద్రుల గుర్తింపు వృత్తిపరమైన ‘కులం’తో జరిగింది. శూద్రుల్లోనూ గోత్రం ఉంది గానీ, దాని ప్రయోజనం ‘నిషేదాల’ను సూచించడం మాత్రమే. వేదకాలం ఆర్యుల వివాహవిధానం ఎలా ఉండేదో వేదం వల్ల తెలిసిరాదు. బహుశా పాణిగ్రహణంతో సరిపెట్టుకోనుండచ్చు. వాళ్లకు బియ్యమే లేవుగాబట్టి, తలంబ్రాలూ అక్షింతల వంటి ఆచారానికి తావులేదు. మనుధర్మ స్మృతిలో ఎనిమిది రకాల వివాహ విధానాలు ఆమోదయోగ్యమైనవిగా పేర్కొనబడ్డాయి. అవి కూడా వర్ణాలవారిగా అనుసంధానమైనవి. తాళిబొట్టును గురించిన ప్రస్తావన అందులోనూ లేదు. బ్రాహ్మణ, క్షత్రియుల్లో తాళిబొట్టు ఆచారం ఎప్పుడు ప్రవేశించిందో చెప్పటానికి ఆధారాలు లేవు. హరిశ్చంద్రుని భార్య చంద్రమతికున్న తాళిబొట్టు వృత్తాంతమొక్కటే క్షత్రియుల్లో కనిపించే ఉదాహరణ. మహాభారతంలోనూ ఆ సంప్రదాయం ఎక్కడా కనిపించదు. మెలూహన్ల నుండి వచ్చిన తరగతుల్లో తాళి ఆచారం ఇప్పటికీ తప్పనిసరి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com