mylaram
-
క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం
సాక్షి, కొత్తగూడెం : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. స్కూళ్లు తెరవకున్నా క్లాసులు చెబుతానంటూ తీసుకొచ్చి మరీ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలు మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామపంచాయతీ పరిధిలోని చింతవర్రెలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఐదుగురు బాలికలున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొడ్డే సునీల్‌కుమార్ వీరిపై కొద్దిరోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరిౖకైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు. దీంతో భయపడ్డ వారు మిన్నకుండి పోయారు. చదవండి: పరువు పోయిందని.. ప్రాణం తీసుకుంది ఈ క్రమంలోనే లైంగికదాడి కారణంగా ఓ విద్యార్థిని ఆస్పత్రి పాలైంది. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియగా.. మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులతో కలసి ఆ హెచ్ఎంను నిలదీశారు. గత రెండ్రోజులుగా ఈ విషయంపై మరో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించాడు. అది కాస్త బయటకు పొక్కడంతో గ్రామస్తులందరూ ఉపాధ్యాయుడిని మంగళవారం నిలదీసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్ భద్రకాళి, ఎంపీడీఓ రామారావు, సీడీపీఓ కనకదుర్గ, సీఐ గురుస్వామి, ఎస్సై అంజయ్య, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఆ చిన్నారులతో మాట్లాడారు. గ్రామస్తులు, తల్లిదండ్రులతో విషయంపై చర్చించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే డీఈఓ సోమశేఖరశర్మ.. సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. దీనిపై స్థానిక ఎస్సై అంజయ్యను వివరణ కోరగా.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
రెండు ఎంపీటీసీలకు నేడు ఎన్నిక
ఇందూరు/ ధర్పల్లి, న్యూస్‌లైన్: జిల్లాలో రద్దయిన రెండు ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. పిట్లం మండలంలోని బండపల్లి, ధర్పల్లి మండలంలోని మైలారం ఎంపీటీసీ స్థానాలు నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారనే ఆరోపణలతో గత నెల 12న ఆ రెండు స్థానాల ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి నామినేషన్ లు స్వీకరించారు. మైలారం స్థానానికి స్వతంత్ర అభ్యర్థి సీహెచ్ ప్రకాష్, కాం గ్రెస్ అభ్యర్థి లలితా నాయక్‌లు బరిలో ఉన్నారు. ఎంపీటీసీ పరిధిలో మై లా రం, కేశారం గ్రామాలు ఉన్నాయి. మొత్తం 1823 మంది ఓటర్లు ఉన్నారు. కేశారం గ్రామంలోని ఒకటో నంబర్ పోలింగ్ కేంద్రంలో 565 మంది, మై లారంలో రెండో నంబర్ పోలింగ్ బూత్‌లో 615 మంది, మూడో బూత్‌లో 643 మంది ఓటర్లు ఉన్నారు. బండపల్లి స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి రజినీ కాంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నడ్పి గంగారాం పోటీలో నిలిచారు. ఇక్కడ మొ త్తం 2235 మంది ఓటర్లు ఉండగా, మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందిని నియమించారు. బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ ఉ.7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఫలితాలను సోమవారం వెల్లడిస్తారు. వేతనంతో కూడిన సెలవు మైలారం, బండపల్లి ఎంపీటీసీ స్థానాల పరిధిలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఆదివారం వేతనంతో కూడిన సెల వును జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ప్రకటించారు.యజమానులు కార్మికులకు సెలవునిస్తూ ఓటు వేసే విధంగా సహకరించాలని ఒక ప్రకటనలో కోరా రు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.