Mysore Zoo
-
వైరల్ వీడియో: గున్న ఏనుగు వాకింగ్!
సాక్షి, బెంగుళూరు: సాధారణంగా పెంపుడు జంతువులు తమతో పాటు వాకింగ్ చేస్తే యజమానులు చాలా సంతోష పడతారు. అవి తమతో పాటు నడవటం, పరుగెత్తటం చూసి మురిసిపోతారు. తాజాగా మైసూర్‌లోని జూ సంరక్షణలో ఉన్న ఓ గున్న ఏనుగు తన కేర్ టేకర్ వెంట నడుస్తూ, పరుగెత్తే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కర్ణాటక జూ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి అనే చిన్నఏనుగు సోము సంరక్షణలో పెరుగుతోంది. వేదవతి కాకుండా మరో ఐదు గున్న ఏనుగులు అతని సంరక్షణలో ఉన్నాయి’ అని పేర్కొంది. మరో వీడియోను పోస్ట్ చేసి.. ‘వేదవతి ఎలా పరుగెత్తుతుందో చూడండి. ఈ చిన్న ఏనుగు రోజూ నడవటానికి ఇష్టపడుతుంది. మైసూర్ జంతు ప్రదర్శనశాలలో వేదవతి చేరినప్పుడు కేవలం 89 కిలోల బరువు మాత్రమే ఉండేది. రెండు నెలల వ్యవధిలో సోము సంరక్షణలో సుమారు 20 కేజీల బరువు పెరిగింది. కేర్ టేకర్ సోము ప్రతి రోజు వేదవతిని జూ చూట్టు వాకింగ్‌కి తీసుకెళ్తాడు. ఈ గున్న ఏనుగు రోజుకు మూడు సార్లు జూ చుట్టు పరుగులు తీస్తూ వ్యాయామం పూర్తి చేసుకుంటుంది’ అని కామెంట్ కర్ణాటక జూ తెలిపింది. ‘కరోనా కాలంలో మేము బంధీలమయ్యాంది. గున్న ఏనుగుకు ఎప్పుడూ స్వేచ్ఛే’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #Vedavathi lives walking and running, #Somu takes around three times in a day. Look how she runs!! She was 89 kgs , when arrived now 110kgs, gained any 20kgs in two months.@aranya_kfd @CZA_Delhi @AnandSinghBS @KarnatakaWorld @PIBBengaluru pic.twitter.com/PFPlpFshWi — Zoos of Karnataka (@ZKarnataka) July 13, 2020 -
గున్న ఏనుగు పరుగు..
-
నరభక్షక పులి పట్టివేత
= ఊపిరి పీల్చుకున్న మైసూరు, హెచ్డీ కోట గ్రామస్తులు = పులిని చంపేయాలని డిమాండ్ మైసూరు, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు నరభక్షక పులి పట్టుబడింది. వారం రోజుల్లో నలుగురిని పొట్టన పెట్టుకున్న నరభక్షక పులి ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక మైసూరు, హెచ్డీ కోట అటవీ సమీప గ్రామాల్లో కునుకు కరువైంది. గురువారం పులి పట్టుబడటంతో మైసూరు, హెచ్డీ కోట సమీప ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. బుధవారం పశువులు కాయడానికి వెళ్లిన బసప్పపై పులి దాడి చేసి చంపేయడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సమీపంలోని అటవీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో దిగి వచ్చిన ఉన్నతాధికారులు పులిని కాల్చివేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన అటవీ, పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం అటవీ సిబ్బంది, పోలీసులు హెచ్డీ కోట తాలూకాలో ఉన్న చిక్కబరగి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి జాడ ఉన్నట్లు గుర్తించి అక్కడి చేరుకున్నారు. డాక్టర్ సనత్ నేతృత్వంలోని సిబ్బంది సమీపంలోని పొదల్లో ఉన్న పులిపై మూడు రౌండ్లు మత్తు ఇంజక్షన్లు వేసి బంధించారు. పట్టుబడిన పులిని మైసూరు జూకి తరలిస్తామని డాక్టర్ సన త్ తెలిపారు. పులిని చంపేయాలి : పులి పట్టుబడిన విషయం తెలుసుకున్న చిక్కబరెగ గ్రామస్తులు పులిని చంపివేయాలని డిమాండ్ చేశారు. నలుగురిని బలి తీసుకున్న పులిని చంపుతారా.. మమ్మల్ని చంపమంటారా అంటూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను శాంతింపజేశారు.