= ఊపిరి పీల్చుకున్న మైసూరు, హెచ్‌డీ కోట గ్రామస్తులు
= పులిని చంపేయాలని డిమాండ్
మైసూరు, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు నరభక్షక పులి పట్టుబడింది. వారం రోజుల్లో నలుగురిని పొట్టన పెట్టుకున్న నరభక్షక పులి ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక మైసూరు, హెచ్‌డీ కోట అటవీ సమీప గ్రామాల్లో కునుకు కరువైంది. గురువారం పులి పట్టుబడటంతో మైసూరు, హెచ్‌డీ కోట సమీప ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. బుధవారం పశువులు కాయడానికి వెళ్లిన బసప్పపై పులి దాడి చేసి చంపేయడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సమీపంలోని అటవీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో దిగి వచ్చిన ఉన్నతాధికారులు పులిని కాల్చివేయాలని ఆదేశించారు.
రంగంలోకి దిగిన అటవీ, పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం అటవీ సిబ్బంది, పోలీసులు హెచ్‌డీ కోట తాలూకాలో ఉన్న చిక్కబరగి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి జాడ ఉన్నట్లు గుర్తించి అక్కడి చేరుకున్నారు. డాక్టర్ సనత్ నేతృత్వంలోని సిబ్బంది సమీపంలోని పొదల్లో ఉన్న పులిపై మూడు రౌండ్లు మత్తు ఇంజక్షన్లు వేసి బంధించారు. పట్టుబడిన పులిని మైసూరు జూకి తరలిస్తామని డాక్టర్ సన త్ తెలిపారు.
పులిని చంపేయాలి : పులి పట్టుబడిన విషయం తెలుసుకున్న చిక్కబరెగ గ్రామస్తులు పులిని చంపివేయాలని డిమాండ్ చేశారు. నలుగురిని బలి తీసుకున్న పులిని చంపుతారా.. మమ్మల్ని చంపమంటారా అంటూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను శాంతింపజేశారు.
నరభక్షక పులి పట్టివేత
Published Fri, Dec 6 2013 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement
Advertisement