The mysterious death
-
బావిలో గుర్తు తెలియని మృతదేహం
రాయచోటి మున్సిపల్ పరిధిలోని మాసాపేట గొల్లపల్లిలో గుర్తుతెలియని మహిళ మృత దేహం బావిలో లభ్యమైంది. మంగళవారం అటుగా వెళ్లిన స్థానికులు మహిళ మృత దేహం బావిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. మృతి చెందిన మహిళ ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. మృతురాలి వివరాలు తెలియ రాలేదు. -
ఆటోడ్రైవర్‌పైనే అనుమానాలు
ప్రియయాంకతో కలిసి మూడుసార్లుసినిమాకు వెళ్లిన రాము ! మొదట్లో విచారించి వదిలేసిన పోలీసులు పర్వతగిరి : వరంగల్ జిల్లాలో కంబాలకుంట తండా బాలికలు బానోత్ భూమిక, బానోత్ ప్రియాంక మృతిపై మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే.. విద్యార్థినుల మృతితో ఓ ఆటోడ్రైవర్‌కు సంబంధముందనే అనుమానాలు వస్తున్నాయి. ఇదే మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జేరిపోతుల రాము నవంబర్ 10న రోజువారీ ఫైనాన్స్‌లో రూ.15 వేలు రుణం తీసుకున్నాడు. అంతకు ముందురోజైన దీపావళినాడు సెలవు ఉండడంతో కోసం ప్రియాంక ఇంటికి వచ్చింది. రాము, ప్రియూంక కలిసి నవంబర్ 22 వరకు రెండు, మూడు సార్లు నెక్కొండ సినిమా థియేటర్‌కు వచ్చినట్లు ఓ విద్యార్థిని చెప్పడం అనుమానాలకు బలాన్నిస్తోంది. 23న వారిద్దరు మరోసారి నెక్కొండలో కలుసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నవంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు రూ.150 చొప్పున గిరిగిరి డబ్బులు చెల్లించిన రాము 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయూడు. దీన్ని బట్టి రాము ప్రియూంకతో ఉన్నట్లు ఆటో డ్రైవర్లు అనుమానిస్తున్నారు. 23న సినిమాకు వెళ్లిన వారిలో రాము కూడా ఉన్నట్లు సమాచారం. భూమిక కోసం రాముతో కలిసి మూడు వెంకన్న అనే వ్యక్తి వచ్చేవాడని అదే హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని చెప్పడం గమనార్హం. కాగా 10 నెలల క్రితమే రాముకు పెళ్లి కాగా రెండు నెలలకే భార్యతో గొడవపెట్టుకుని కట్నం కావాలని ఆమెను పుట్టింటికి పంపినట్లు స్థానికులు తెలిపారు. రోజూ అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చేవాడని వెల్లడించారు. నవంబర్ 25న ప్రియాంక, భూమిక తప్పిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకు రాము, వెంకన్న కూడా ఊర్లో లేరు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రామును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా ప్రియాంకతో కలిసి మూడుసార్లు సిని మాకు వెళ్లిన విషయూన్ని వెల్లడించినట్లు తెలి సింది. అరుుతే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియదని చెప్పడంతో వదిలేశారు. అప్పటి నుంచి అతడు స్వగ్రామాన్ని వదిలేసి వేరొక ఊర్లో భార్యతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉంటే.. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ అనేక విషయూలను చెప్పినా నామమాత్రంగా కేసు నమోదు చేశారు. ప్రియాంక, భూమిక తల్లిదండ్రులు మాత్రం పోలీసులు ఏ మాత్రం సహకరించలేదని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ములు గు, నల్లబెల్లి, పర్వతగిరి పోలీసులు ఎవరికి వారే దర్యాప్తులో నిర్లక్ష్యం ప్రదర్శించారు. -
యువకుని అనుమానాస్పద మృతి
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామ శివారులోని వరి పొలాల్లో సోమవారం ఉదయం యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామానికి చెందిన కిష్టయ్య, చెన్నమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివ(22) ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవి అయి కనిపించాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డీఎస్పీ అశోక్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. -
టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి
విశాఖపట్టణం జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి తాళపరెడ్డి కోదండరాం(15) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లక్ష్మీపురానికి చెందిన అప్పారావు, లక్ష్మి దంపతుల కుమారుడైన కోదండరామ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాల విద్యార్థులందరూ వనభోజనాలకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం నుండి అతను కనిపించలేదు. బడి వదిలినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్నేహితులను వాకబుచేశారు. మధ్యాహ్నం నుంచి కనిపించలేదని వారు చెప్పడంతో పాఠశాల పరిసరాల్లో, వనభోజనాలకు వెళ్లిన ప్రదేశంలో వెతికారు. పాఠశాల సమీపంలో బోరు బావి వద్ద గుంతలో విగతజీవుడై పడిఉన్న కోదండరామ్‌ను కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుని గొంతుపై నులిమినట్లు గుర్తులున్నాయి. శరీరంపై అక్కడక్కడా దెబ్బలు ఉన్నాయి. దీంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
-
నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మహిళా ఐఏఎస్ అధికారికి డి.కె.రవి 44సార్లు ఫోన్ చేశారన్న సీఎం వ్యాఖ్యలపై కుమారస్వామి సవాల్ బెంగళూరు:డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించి ప్రజల మనసుల్లో విష బీజాలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. సోమవారమిక్కడ తన ను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ....‘ముఖ్యమం త్రి సిద్ధరామయ్య ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఏఎస్ అధికారి డి.కె.రవి చనిపోవడానికి ముందు ఓ గంట వ్యవధిలో ఓ మహిళా ఐఏఎస్ అధికారికి 44 సార్లు ఫోన్ చేశారని చెప్పారు. తద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించారు. డి.కె.రవి అన్ని సార్లు మహిళా ఐఏఎస్ అధికారికి ఫోన్ చేశారని సిద్ధరామయ్య కనుక నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచే తప్పుకుంటాను. ఒకవేళ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలను నిరూపించలేక పోతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’ అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ సీబీఐ విచారణకు ఆదేశించింది వారి హైకమాండ్ ఆదేశాల ప్రకారమే కానీ, ప్రజల మనోభావాలను గౌరవించి కాదని విమర్శించారు. -
యువతి అనుమానాస్పద మృతి
నంద్యాలటౌన్:స్వయం ఉపాధి కోసం వచ్చిన యువతిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు ఓ ప్రభుత్వోద్యోగి. పెళ్లయి, పిల్లలున్న ఆ ప్రబుద్దుడు ఏడాదిగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. అతడు అనుమానంతో పెడుతున్న వేధింపులు తాళలేక చివరకు ఆ యువతి అనుమానాస్పద రీతిలో తనువు చాలింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం మూలసాగరంలో వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న వ్యక్తే కొట్టి చంపాడని మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గడివేముల మండలం బూజునూరుకు చెందిన ఎల్లమ్మ (25)అలియాస్శాంతి తండ్రి సుబ్బరాయుడు 8ఏళ్లక్రితమే మరణించాడు. ఎల్లమ్మకు తల్లి లక్ష్మీదేవి, నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన ఎల్లమ్మ కుటుంబ పోషణ నిమిత్తం స్వయం ఉపాధి కింద మీ-సేవా కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి యత్నించింది. ఈ విషయమై దాదాపు ఏడాదిన్నర క్రితం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చింది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాగాంజనేయులు (40) తాను సాయం చేస్తానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమెకు మూలసాగరంలో మీ-సేవ కేంద్రం ఏర్పాటు చేయించడంతో గుడ్డిగా అతడిని ఆమె నమ్మింది. అన్నీ తానే చూసుకుంటానంటూ నాగాంజనేయులు మీ-సేవా కేంద్రం ఉన్న భవనంలోని మూడో అంతస్తులో ఎల్లమ్మతో సహజీవనం చేశాడు. వాస్తవానికి అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ నాగాంజనేయులు ఎల్లమ్మ ఎవరితో మాట్లాడినా అనుమానంతో వేధించేవాడు. ఈ నేపథ్యంలో, ఆమె మంగళవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇంటి తలుపులు రాకపోవడంతో నాగాంజనేయులు, మరికొందరు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. ఉరి వేసుకున్న స్థితిలో ఉన్న ఎల్లమ్మను కిందకు దించారు. అప్పటికే ఆమె మరణించి ఉంది. ఇది స్థానికులకు తెలియడంతో నాగాంజనేయులును పట్టుకొని చితకబాదడంతో అతను పరారయ్యాడు. మృతురాలి సోదరి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగాంజనేయులే తన భార్యతో కలిసి హతమార్చాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు త్రీటౌన్ సీఐ దైవప్రసాద్, ఎస్ఐ సూర్యమౌళి విలేకరులకు తెలిపారు.