N prabhakara reddy
-
Andrha Pradesh: ప్రభుత్వ బడికి ఐఏఎస్ అధికారి పిల్లలు
పటమట (విజయవాడ తూర్పు): ఐఏఎస్ అధికారి, శాప్ ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి తన కుమార్తె, కుమారుడిని ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించారు. విజయవాడ పటమటలోని కోనేరు బసవపున్నయ్య జెడ్పీ హైస్కూల్‌కు మంగళవారం విచ్చేసిన ప్రభాకరరెడ్డి సతీమణి లక్ష్మి తమ పిల్లలకు అడ్మిషన్ తీసుకున్నారు. ‘నాడు–నేడు’ పథకం కింద పాఠశాలలో చేపట్టిన వసతులు, అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం కుమార్తెను 8వ తరగతిలో, కుమారుడిని 6వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. ‘నాడు–నేడు’తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఇంగ్లిష్ మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టటంతో తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, స్కూల్లో వసతులు, తరగతి గదులు, ప్లే గ్రౌండ్ చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. చదవండి👉🏻వాస్తవాలను కోర్టు ముందుంచుతాం -
ఐటీడీఏ పీవో బదిలీ
శ్రీశైలంప్రాజెక్టు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నక్కల ప్రభాకరరెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు ఇతన్ని బదిలీ చేశారు. ఐటీడీఏ పీవో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలను వెలికి తీసి తండాల అభివృద్ధికి కృషి చేశానన్నారు. చెంచు విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో ప్రవేశాన్ని కల్పించానన్నారు. ప్రత్యేక అనుమతితో 30 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి విద్యా శాతాన్ని పెంచినట్లు చెప్పారు. ఆరోగ్యదీపిక కార్యక్రమంతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేశానన్నారు. ప్రతీ గూడెంలో ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం రూ. 10లక్షలతో వడ్డీలేని రుణాలను మంజూరు చేశామని, 1386 మంది యువతకు ఈజీఎంఎం ద్వారా శిక్షణ ఇచ్చి నియామకాలు జరిపించామన్నారు. అటవీశాఖలో 37 మందికి టైగర్ ట్రాకర్లుగా, శ్రీశైలదేవస్థానంలో 16 మందికి సెక్యూరిటీగార్డులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి కింద నామమాత్రపు అద్దెతో 16 మందికి చెంచు బజార్ షాపులను కేటాయించానని వివరించారు. ట్రైకార్ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రతిగూడెంలో విద్యుత్ సౌకర్యం అందించడం కోసం సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడం వంటి పనులు చేశానన్నారు. సర్పంచ్‌లుగా 20 మందిని, వార్డుమెంబర్లుగా 73 మందిని ఎన్నికయ్యేటట్లు చేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఐటీడీఏలో దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించానన్నారు. ఇదేమార్పును రానున్న అధికారులు తీసుకు రావాలన్నారు. తాను బదిలీపై 27వ తేదీన రిలీవ్ కానున్నట్లు చెప్పారు. అనంతరం చరిత్రలో ఒకరోజు ఒక చెంచుగూడెం పుస్తకాన్ని ఆవిష్కరించారు.