
చిన్నారులకు అడ్మిషన్ తీసుకుంటున్న శాప్ ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి భార్య లక్ష్మి
పటమట (విజయవాడ తూర్పు): ఐఏఎస్ అధికారి, శాప్ ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి తన కుమార్తె, కుమారుడిని ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించారు. విజయవాడ పటమటలోని కోనేరు బసవపున్నయ్య జెడ్పీ హైస్కూల్‌కు మంగళవారం విచ్చేసిన ప్రభాకరరెడ్డి సతీమణి లక్ష్మి తమ పిల్లలకు అడ్మిషన్ తీసుకున్నారు.
‘నాడు–నేడు’ పథకం కింద పాఠశాలలో చేపట్టిన వసతులు, అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం కుమార్తెను 8వ తరగతిలో, కుమారుడిని 6వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. ‘నాడు–నేడు’తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఇంగ్లిష్ మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టటంతో తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, స్కూల్లో వసతులు, తరగతి గదులు, ప్లే గ్రౌండ్ చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి👉🏻వాస్తవాలను కోర్టు ముందుంచుతాం
Comments
Please login to add a commentAdd a comment