N Rangasamy
-
Puducherry: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‌పై భారీగా సబ్సిడీ!
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఓ వైపు, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూ మరో వైపు సామాన్యుడి నెల వారి బడ్జెట్‌పై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇదిలా ఉండగా గ్యాస్ ధరల పెంపు మధ్య తరగతి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పలు రాష్ట్రాలలో పెరిగిన గ్యాస్ ధరలు నుంచి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీపీఎల్ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్ సిలింబర్ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ... అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కాగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరలను పెంచగా.. ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే. -
చెదిరిన రంగసామి కల
పుదుచ్చేరి సీఎం ఎన్.రంగసామి కల చెదిరింది. రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన ఆయనకు ఆశాభంగం ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన రంగసామికి పుదుచ్చేరి ఓటర్లు షాక్ ఇచ్చారు. తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) రెండో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 30 స్థానాల్లో కాంగ్రెస్ 15, ఏఐఎన్ఆర్సీ 8, అన్నాడీఎంకే 4, డీఎంకే 2 సీట్లు గెల్చుకున్నాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగానే కాంగ్రెస్, ఏఐఎన్ఆర్సీ హోరాహోరీగా తలపడినట్టు పరిస్థితి కనిపించింది. చివరికి కాంగ్రెస్-డీఎంకే కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. అధికార ఏఐఎన్ఆర్సీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఒంటరిగా పోటీ చేసిన అన్నా డీఎంకే 4 స్థానాలు దక్కించుకుంది. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఆర్ఎస్పీలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీఎఫ్‌డబ్ల్యూ) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. ఇందిరా నగర్ నుంచి పోటీ చేసిన సీఎం రంగసామి 3,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఆరోసారి విజయం సాధించారు. అంతకుముందు 1996 నుంచి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 1996, 2001 సంవత్సరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. -
పాండిచ్చేరి సీఎం కాన్వాయ్ ఢికొట్టిన వ్యక్తి అరెస్ట్!
చెన్నై: పాండిచ్చేరి ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని కారును ఢీకొట్టిన కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్వాయ్ లోని పైలెట్ కారును అతివేగంగా మరో కారు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి రంగస్వామి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ముబారక్ ఆలీని అరెస్ట్ చేశారు. మద్యం సేవించి.. మితీమిరిన వేగంగా కారు నడిపారని కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. చెన్నైలోని సాంతోమ్ వద్ద ఈ ప్రమాదం గత రాత్రి చోటుచేసుకుంది. గత రాత్రి వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి రంగస్వామి చెన్నైకి వచ్చారు.