NAATU KODI
-
నాటుకోడి రుచి.. ధర పెరిగినా తగ్గేదే లే! రూ.900 పెట్టాల్సిందే, ఆర్డర్లు ఇవ్వాల్సిందే!
సాక్షి, ఆర్మూర్(నిజామాబాద్): ఆర్మూర్ ప్రాంతంలోని ఆర్డర్ మెస్‌ల్లో లోకల్ దేశీ కోళ్ల కొరతతో దేశీకోడి ధర కొండెక్కి కూర్చుంది. పల్లెల్లోని ఇళ్లలో పెంచిన దేశీ కోళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆర్డర్ మెస్‌ల నిర్వాహకులు ధరలను పెంచివేశారు. భోజనప్రియుల నుంచి లోకల్ దేశీ కోడినే వండి ఇవ్వాలనే డిమాండ్ అధికంగా ఉండటంతో ఒక దేశీకోడి, నలుగురు వ్యక్తులు తినగలిగే అన్నం వండి ఇవ్వడానికి రూ.900 ధర నిర్ణయించారు. ఈ ధర గతంలో రూ.650 మాత్రమే ఉండేది. ఏకంగా రూ.250 పెంచినా లోకల్ దేశీకోడిని మాత్రమే తినాలనే భోజన ప్రియులు ఈ ధరను సైతం లెక్క చేయకుండా ఆర్డర్లు ఇస్తూనే ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ప్రతీ గ్రామంలో వెలిసిన ఆర్డర్ మెస్‌ల నిర్వాహకులు చుట్టు పక్కల గ్రామాలతో పాటు అంగళ్లలో లోకల్ దేశీకోళ్లను కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసిన కోళ్లను తమ ఆర్డర్ మెస్‌లో వండి ఇస్తుంటారు. భోజన ప్రియుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో సరిపడా లోకల్ దేశీకోళ్లు లభించడం లేదు. దీంతో కొందరు ప్రత్యేకంగా ఫామ్‌లలో దేశీ కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి కల్పించుకున్నారు. చదవండి: రోడ్డు ప్రమాదం: మానవత్వం చాటుకున్న మంత్రి ‘గంగుల’ అంకాపూర్‌లో ఆర్డర్ మెస్ వద్ద దేశీ కోళ్లు అయితే లోకల్ దేశీకోడి రుచికి ఫామ్‌లో పెంచిన దేశీకోడి రుచికి మధ్య తేడా ఉండటంతో భోజన ప్రియులు లోకల్ కోడికే ప్రాధాన్యనిస్తున్నారు. ఆర్డర్ మెస్‌ల నిర్వాహకులు గ్రామాల్లో గతంలో రూ.320కి ఒక కోడిని కొని తెచ్చేవారు. ప్రస్తుతం రూ.420 వరకు వెచ్చించి లోకల్ కోళ్లను కొ నుగోలు చేస్తున్నారు. ఈ కోడి ధరకు వంట సామగ్రికి అయ్యే ఖర్చు, తమ శ్రమను జోడించి ఆర్డర్ మెస్ నిర్వాహకులు ఒక దేశీ కోడి ఆర్డర్‌ను రూ.850 నుంచి రూ.900 పెంచేసి అమ్ముతున్నారు. చదవండి: హైదరాబాద్ పోలిస్ కమిషనర్ కీలక ఆదేశాలు.. ‘ఇకపై వేసేయడమే’ -
ముక్కలేనిదే ముద్ద దిగదు.. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచి ఆస్వాదించాల్సిందే
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ముక్కలేనిదే ముద్ద దిగదు. సండే వచ్చిందంటే చాలు మెనూలో మాంసాహారం ఉండాల్సిందే! అందుకే వారాంతాల్లో రెస్టారెంట్లు కిటకిటలాడుతాయి. చికెన్, మటన్ సెంటర్లు కళకళలాడుతాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు కొత్తదారి పడుతున్నారు. రుచి, ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ పల్లె బాట పడుతున్నారు. నాటు కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచిని ఆస్వాదిస్తున్నారు. మాంసాహార ప్రియుల నోరూరిస్తున్న నాటు కోడి మాంసంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – ఖిలా వరంగల్ పౌల్ట్రీ విప్లవం తరుముకొచ్చింది. వీధికో చికెన్ సెంటర్. పల్లెకో(మినీ) పౌల్ట్రీ పరిశ్రమ. ప్రజల నుంచి డిమాండ్ ఉండడాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. బాయిలర్ కోళ్లు వేగంగా పెరగడానికి ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. మూడు నెలలు పెరగాల్సిన కోడి కేవలం నలభై రోజుల్లోనే మూడు కిలోల బరువు వరకు పెరుగుతోంది. ప్రజల డిమాండ్‌కు అనుకూలంగా రసాయనాలు వాడి కోళ్లను సరఫరా చేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పౌష్టిక విలువలున్న నాటు కోళ్లవైపు మాంసాహార ప్రియుల చూపు మళ్లింది. నాటుకే మాంసాహార ప్రియుల ఓటు రసాయనాలతో పని లేకుండా నాటుకోళ్లు పెరుగుతున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే తౌడు, మొక్కజొన్నలు, సజ్జలు, బియ్యం, నూకలు, రాగులు వంటి తృణధాన్యాలు తిని పెరుగుతున్నాయి. దీంతో వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. మంచి రుచి కూడా ఉండటంతో నాటుకోడి చికెన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గ్రామాల్లో సహజంగా కనిపించే కోళ్లతో పాటు దేశవాలీ కోళ్లలోనూ గిరి రాజు, వనరాజు వంటి అనేక జాతులు ఉన్నాయి. నగరం చుట్టుపక్కల గ్రామాల్లో వీటిని పెంచి అనేకమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు. నోరూరించే కోడి కూర నాటుకోడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ‘నాటుకోడి చికెన్ లభించును’ అని కొన్ని రెస్టారెంట్లు వినియోగదారుల్ని ఆకర్షిస్తూ బోర్డులు పెడుతున్నాయి. యువత పార్టీలు చేసుకునే సమయంలో నాటుకోడికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. పెరిగిన డిమాండ్ .. వరంగల్ నగరవాసులకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. బాయిలర్ కోళ్లు తినడానికి చాలామంది ఇష్టపడట్లేదు. ఈ క్రమంలో నాటు కోళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇవి పల్లెల్లో ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో ప్రత్యేకంగా వీటికోసం వారాంతాల్లో పల్లెబాట పడుతున్నారు. నాటుకోడి కిలో ధర రూ.400 పలుకుతోంది. అయినప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నాటు కోళ్లతో రుచి, ఆరోగ్యం ఇతరకోళ్ల కంటే నాటుకోడి మాంసం రుచిగా ఉంటుంది. ఇంటిళ్లిపాది నాటుకోడినే ఇష్టపడుతున్నాం. ధర కాస్త ఎక్కువైనా కూడా నాటుకోడి మాంసమే తింటున్నాం. ఆదివారం వస్తే దేశవాళీ కోళ్ల పెంపకం దారుల వద్ద నాటు కోడిని కొని తెచ్చుకుంటున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా పల్లెబాట పడుతున్నాం. ఆరోగ్యం, రుచి అన్నింటా సహజంగా పెరిగిన నాటుకోళ్లే నయం. – ఎం. శశికాంత్, ఫోర్ట్‌రోడ్డు వరంగల్ -
వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని ఛేదించిన పశువైద్యాధికారులు
సాక్షి, బషీరాబాద్: వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని పశువైద్యాధికారులు ఛేదించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో విచారణ జరిపి ఊపిరాడకనే అవి చనిపోయాయని వెల్లడించారు. ‘వింతవ్యాధితో నాటుకోళ్ల మృత్యువాత’శీర్షికన ఈ నెల 16న ప్రచురితమైన ‘సాక్షి’కథనానికి రాష్ట్ర పశు సంవర్థకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి స్పందించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా వెటర్నరీ అధికారిని ఆదేశించారు. జిల్లా వెటర్నరీ అధికారి ఆదేశాల మేరకు సోమవారం బషీరాబాద్ మండల పశువైద్యాధికారి హతిరామ్ తన సిబ్బందితో కలసి మండంలోని క్యాద్గీరా, గంగ్వార్ గ్రామాల్లో విచారణ జరిపారు. నాటుకోళ్లు మురుగుకాలువల్లోంచి ఆహారం తీసుకుంటున్నట్లు గమనించారు. అనారోగ్యానికి గురైన ఓ నాటు కోడిని పోస్టుమార్టం చేయగా దాని గిజార్డ్ పూర్తిగా ఇసుక రేణువులతో నిండి ఉన్నట్లు గుర్తించారు. పేగుల్లో మొత్తం పరాన్నజీవులు ఉన్నాయని, తద్వారా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాయని హతిరామ్ తెలిపారు. కోళ్ల పెంపకందారులు వాటికి గింజలు వేయకపోవడం, నీళ్లు సరిగ్గా పట్టకపోవడం, ఎండలకు తట్టుకోలేకపోవడం వంటి కారణాలతో చనిపోయాయని వివరించారు. కోళ్లకు ఎలాంటి వ్యాధి సోకలేదని, రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
నాటుకోడి నోరూరిస్తోంది..!
రోగనిరోధకశక్తిని పెంపొందించుకునేందుకు చికెన్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాయిలర్ కంటే నాటు కోడి మాంసంలో పోషకాలు, ప్రొటీన్లు అధికంగా ఉండడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పల్లెలో పెరిగే కోళ్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో నాటు కోళ్ల ధరను మాంసం విక్రయదార్లు విపరీతంగా పెంచేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా కొందరు నాటు కోళ్లకు ప్రత్యేకంగా ఫారాలను ఏర్పాటు చేసి పెంచుతున్నారు. ప్రజల నమ్మకాన్ని తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కలికిరి, నిమ్మనపల్లె, మదనపల్లె, చంద్రగిరి, బంగారుపాళ్యం తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాటుకోళ్ల ఫారాలను నిర్వహిస్తున్నారు. – మదనపల్లె కరోనా మహమ్మారి కాలుమోపిన తొలినాళ్లలో కోళ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తోందనే వదంతులు వెల్లువెత్తాయి. దీంతో జనం చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో ఒక్కసారిగా కోళ్ల పరిశ్రమ దెబ్బతింది. అప్పట్లో చికెన్ వ్యాపారులు రూ.100కి 3కిలోల చొప్పున విక్రయాలు సాగించారు. తర్వాత కరోనాను ఎదుర్కోవాలంటే మనిíÙలో రోగనిరోధకశక్తి అవసరమని, కోడి మాంసం, గుడ్లను తప్పనిసరిగా తినాలని వైద్యనిపుణులు సూచించారు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు జనం ఒక్కసారిగా చికెన్ దుకాణాల వద్ద క్యూ కట్టారు. పట్టణాల్లో దొరికే బ్రాయిలర్ చికెన్ కంటే పల్లెటూళ్లలో లభించే నాటుకోడి మంచిదని పలువురి నమ్మకం. అందుకే ప్రస్తుతం ప్రజలు నాటుకోడి మాంసం తినేందుకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే నాటుకోడి.. రాగి సంగటి అద్భుతమైన కాంబినేషన్‌గా గుర్తింపు పొందింది. వహ్వా.. నాటుకోడి పులుసు బ్రాయిలర్ చికెన్ కంటే నాటుకోడి ఆరోగ్యానికి మంచిదనే ప్రచారంతో ఇటీవల కాలంలో వీటికి గిరాకీ బాగా పెరిగింది. బ్రాయిలర్ చికెన్‌లో రుచి తక్కువ, మటన్ తింటే కొవ్వు పెరుగుతుంది, మంచి చేపలు దొరకడం కష్టంగా ఉంది, దీంతో నాటుకోడి మాంసం వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా రాగి సంగటిలో నాటుకోడి పులుసు వేసుకుతింటే ఆ రుచి వర్ణనాతీతం. పెరిగిన డిమాండ్ బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో విపరీతంగా మందులు వాడుతుండటంతో, అవి తింటే అనారోగ్యం పాలవుతామనే భావన ప్రజల్లో అధికమైంది. దీనికితోడు నాటుకోడి కూర తినండి అంటూ పలువురు ఆహారనిపుణులు సూచించడంతో అందరిచూపు వీటివైపు మళ్లింది. నాటు కోడి ఎలాంటి మందులు అవసరం లేకుండా పెరుగుతుంది. మాంసం గట్టిగా రుచిగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. తొందరగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మేలు తప్ప ఎలాంటి కీడు ఉండదు. ప్రస్తుతం వీటిని పెంచుతున్న ఫారాలలో నాటుకోళ్లకు రాగులు, సజ్జలు, జొన్నలు, నూకలు, వడ్లు, అన్నిరకాల కూరగాయలు, పాలకూర, మెంతి, అరటి, మామిడి, వేపాకులను దాణాగా వేస్తున్నారు. ఎలాంటి రోగాలు రాకుండా పసుపు, అల్లం కలిపిన నీటిని తాగిస్తున్నారు. అందుకే బ్రాయిలర్ చికెన్ కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటే నాటుకోడి రూ.350 నుంచి రూ.550 వరకు ఉంది. ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొందరు పల్లెల్లో తిరిగి నాటు కోళ్లను కొనుగోలుచేసి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. -
శ్రీకాంత్ `నాటుకోడి` స్టిల్స్