పెద్ద శేష వాహనంపై వేంకటాచలపతి
తిరుమలలో గురువారం పెద్దశేష వాహన ఊరేగింపు కన్నులపండువలా సాగింది. నాగుల చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా వాహన సేవ నిర్వహించారు.సాయంత్రం కైంకర్యాలు ముగించుకుని వాహన మండ పంలోకి వేంచేపు చేసిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని పుష్పమాలలు, బంగారు, వజ్ర, వైఢూర్య మరకత మాణిక్యాదులతో కూడిన ఆభరణాలతో అలంకరించారు.