Nadia district
-
సొంత పార్టీ ఎంపీకి పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చిన మమత
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సొంత పార్టీ మహిళా ఎంపీ మహువా మోయిత్రాకు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. గ్రూపులు కడితే సహించేది లేదని స్పష్టం చేశారు. నదియా జిల్లాలో తృణమూల్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ నేతలకు మమత గట్టి హెచ్చరిక జారీ చేశారు. నదియా జిల్లాలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ నాయకులు విభేదాలు పక్కనపెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఆధిపత్యం కోసం రచ్చకెక్కితే వేటు తప్పదని హెచ్చరించారు. ‘మహువా.. నేను ఇక్కడ ఒకటే స్పష్టం చేస్తున్నాను. ఎవరికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది నాకు అవసరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని పోటీకి దింపాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి శాశ్వతంగా ఒక స్థానంలో ఉంటాడని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాల’ని అన్నారు. ఆ సమయంలో వేదికపైనే మొయిత్రా.. మమతా బెనర్జీ వెనుక కూర్చున్నారు. కాగా, పార్టీ నదియా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఇటీవలే ఆమెను తొలగించారు. (చదవండి: తొలిసారి ఆ రాష్ట్ర పర్యటనకు.. భారీగా భద్రతా ఏర్పాట్లు ) టీఎంసీ నాయకత్వంలోని ఓ వర్గం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇటీవల పోస్టర్లు వెలిసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పోలీసు విచారణలో తేలినట్టు మమత తెలిపారు. పథకం ప్రకారం మీడియాను తప్పుదారి పట్టించారని, దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు. త్వరలో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో ‘దీదీ’ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (చదవండి: లోహాఘాట్ అసెంబ్లీ సీటు ఎవరిది? పోటాపోటీగా..) -
మహిళ అండాశయంలో భారీ కణతులు
కోల్‌కతా : ఓ మహిళ అండాశయంలో ఏర్పడిన రెండు భారీ కణతులను విజయవంతగా తొలగించిన వైద్యులు ఆమెకి తిరిగి ప్రాణం పోశారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన అర్తి అధీకరీ అనే 60 ఏళ్ల మహిళకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమె జూలై 14న జేఎన్‌ఎమ్ ఆస్పత్రి లో చేరారు. తొలుత వైద్యులకు ఆమె కడుపు నొప్పికి గల కారణం తెలియరాలేదు. దీంతో ఆమెకు అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష నిర్వహించిన వైద్యులు.. అండాశయంలో రెండు భారీ కణతులు ఉన్నట్టు గుర్తించారు. కణతులు పరిమాణం పెద్దదిగా ఉండటంతో వాటిని తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై తొలుత ఆస్పత్రి సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించింది. ఆపరేషన్ కోసం ప్రముఖ గైనకాలజిస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్రిగాంకా మౌలి షా సారథ్యంలో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. శనివారం రెండు గంటల పాటు శ్రమించిన మౌలి షా నేతృత్వంలోని వైద్యుల బృందం అర్తి అండాశయంలోని ఉన్న రెండు భారీ కణతులను విజయవంతగా తొలగించారు. ఆపరేషన్ అనంతరం మౌలి షా మాట్లాడుతూ.. అండాశయం నుంచి తొలగించిన రెండు కణతులు బరువు 35 కిలోల 300 గ్రాముల ఉన్నట్టు తెలిపారు. ఇంత పెద్ద పరిమాణం ఉన్న కణతులను తొలగించడం తమకు ఇదే తొలిసారి అని వెల్లడించారు. ప్రస్తుతం అర్తి పరిస్థితి నిలకడగా ఉందని.. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచామని పేర్కొన్నారు. -
రైలు పట్టాలపై పడిన పసిగుడ్డుకు తప్పిన ముప్పు
కృష్ణానగర్: కదులుతున్న రైల్లోంచి పట్టాలపై పడిన ఓ పసిగుడ్డు సురక్షితంగా ప్రాణాలతో బయటపడిన ఆశ్చర్యకర సంఘటన పశ్చిమ బెంగాల్లో మంగళవారం చోటు చేసుకుంది. జుమ్కా గ్రామానికి చెందిన రెహానా బీబీ అనే గర్భిణి ముర్షిషాబాద్ వద్ద లాల్గొలా ప్యాసింజర్ రైలు ఎక్కింది. నదియా జిల్లాలోని పాలాషి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న సమయంలో రెహానా బాత్రూమ్కు వెళ్లి బిడ్డను ప్రసవించింది. ఆమె తేరుకునేలోపు బిడ్డ మరుగుదొడ్డి కన్నం నుంచి జారిపోయి రైలు పట్టాలపై పడింది. విషయం తెలుసుకున్న తోటి ప్రయాణికులు రైలు ఆపి చిన్నారిని కాపాడారు. తల్లీబిడ్డను వెంటనే ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే చిన్నారికి చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం.