రోడ్డుప్రమాదంలో తెగిపడిన బాలిక కుడిచెయ్యి
కృష్ణా జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురం గ్రామం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో నాగసౌందర్య(12) అనే బాలిక కుడి చెయ్యి తెగి రోడ్డుపై పడింది. సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో కిటికీ పక్కన సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న నాగసౌందర్య కుడుచేతిని కిటికీ బయట పెట్టింది. దే సమయంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో చెయ్యి తెగి రోడ్డుపై పడింది. కమనించిన స్థానికులు బాలికను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. నూజివీడు పోలీసులు లారీ డ్రైవర్ను దుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.