nagar kurnool mp
-
లోక్‌సభ ఎన్నికల బరిలో ‘బర్రెలక్క’.. నామినేషన్ దాఖలు
సాక్షి,కొల్లాపూర్ : గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 23న (ఇవాళ) నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క నామినేషన్ వేసేందుకు తరలి వచ్చారు. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పెట్టిన వీడియోతో శిరీష్ ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో నిరుద్యోగ సమస్యపై తనగొంతు వినిపించారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీ మద్దతు వచ్చింది. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు. నైతికంగా విజయం సాధించా ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓటమి పాలయినప్పటికీ నైతికంగా గెలిచారు. 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. ఎన్నికల ఫలితా అనంతరం.. ఓటర్లు ఒక్క రూపాయి డబ్బు పంచకుండా నిజాయతీగా నాకు ఓట్లేశారు. నేను గెలిచానని భావిస్తున్నా. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటా. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేస్తా అని బర్రెలక్క చెప్పారు. నాడు చెప్పినట్లుగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా బర్రెలక్క మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాగర్ కర్నూల్లో లోక్‌సభ అభ్యర్ధులు నాగర్‌కర్నూల్ లోక్‌సభ నుంచి పోటీకి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు పోతుగంటి భరత్ప్రసాద్కు టికెట్ ఇప్పించుకోగలిగారు. బీఎస్పీ స్టేట్ చీఫ్హోదాలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. -
గద్వాల – మాచర్ల రైల్వేలైన్‌కు కేంద్రం అంగీకారం
గద్వాల టౌన్: గద్వాల– మాచర్ల రైల్వేలైన్ చేపట్టేలా కృషి చేస్తున్నామని, రాష్ట్రవాటాతో కలిసి చేపట్టేందుకు కేంద్ర మంత్రి అంగీకరించినందున త్వరలోనే ప్రజాప్రతినిధులు అందరం కలిసి సీఎం కేసీఆర్‌ను కలవబోతున్నామని నాగర్‌కర్నూలు పార్లమెంట్ సభ్యులు పి రాములు అన్నారు. శనివారం గద్వాల మండలం జమ్మిచేడు హరిత హోటల్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రాయచూరు నుంచి గుంటూరు జిల్లాలోని మాచర్ల వరకు ఏర్పాటు చేయాల్సిన రైల్వే లైన్లో గద్వాల రాయచూర్ మధ్య మాత్రమే మొదటి దశలో పూర్తయిందని, రెండో దశగా గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిల ద్వారా మాచర్ల వరకు చెపట్టాల్సిన రైల్వే లైన్‌ను చేపట్టేందుకు కృషి చేస్తున్నానమన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి పీయూస్ గోయల్‌ను కోరగా, ప్రాజెక్టులో రాష్ట్ర వాటాకు అంగీకరిస్తే చేపట్టేందుకు వీలుపడుతుందని చెప్పారన్నారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరం కలిసి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలవాలని నిర్ణయించామని తెలిపారు. గద్వాల మాచర్ల లైన్ వల్ల ఈ ప్రాంత అభివృద్దికి జరిగే మేలును ఆయనకు వివరించి, రాష్ట్ర వాటాను కలిపేందుకు కోరుతామన్నారు. త్వరలోనే గద్వాల మాచర్ల లైన్ డీపీఆర్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేసేలా తన వంతు కృషి ఉంటుందని తెలిపారు. గద్వాల, జోగుళాంబ స్టేషన్ల అభివృద్ధికి చర్యలు గద్వాల రైల్వే స్టేషన్లో 21 బోగీల ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తగినట్లుగా ప్లాట్ ఫాంలు 1.2లను పొడగింపురకు జీఎం అంగీకరించారన్నారు. గద్వాల జిల్లా కేంద్రం, జంక్షన్ స్టేషన్‌గా ఉన్న ఈ స్టేషన్ ద్వారా ఆగకుంగా వెళ్తున్న కొంగు, అజరత్ నిజాముద్దీన్, ఘోరక్పూర్, ఓకా రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌లకు హల్టింగ్ ఇవ్వాలని కోరడమైందన్నారు. వాటిలో రెండింటిని ఆపేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారన్నారు. గద్వాల స్టేషన్లో వాహనాల పార్కింగ్‌ను విస్తరించాలని కోరగా.. చేస్తామన్నారని వివరించారు. జోగుళాంబ రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్సించేలా బుకింగ్‌ను అభివృద్ధి, స్టేషన్ ప్రక్కనే ఉన్న రహదారికి అండర్ బ్రిడ్జిని చేపట్టాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపారన్నారు. -
మా ఎంపీ అడ్రస్ చెప్పండి ప్లీజ్...
గద్వాల: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య కనపడటం లేదని టీఎమ్మార్పీఎస్ గద్వాల తాలూకా కన్వీనర్ నందు, కో కన్వీనర్లు ప్రదీప్, రవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీ అయిన దగ్గర నుంచి నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాలేదని, వర్గీకరణ బిల్లు గురించి పట్టించుకోవటంలేదని, దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టటంలేదని ఆరోపించారు. ఈ మేరకు ఓ లేఖ ద్వారా గద్వాల సీఐ సురేష్‌కు ఫిర్యాదు చేశారు.