nagarani
-
ఎంపీడీవో కుటుంబసభ్యులతో మాట్లాడిన సీఎం
సాక్షి, అమరావతి/ పెనమలూరు: నాలుగు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు గురువారం ఫోన్లో మాట్లాడారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని వెంకటరమణారావు ఇంటికి పశ్చిమగోదావరి జల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేరుకున్నారు. ఎంపీడీఓ భార్య సునీత, కుటుంబ సభ్యులతో కలెక్టర్ నాగరాణి మాట్లాడారు. ఆ తరువాత సునీతతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఘటనపై పూర్తి విచారణ చేయిస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలు సీఎంఓకు తెలపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నాగరాణి విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీడీఓ వెంకటరమణారావు రాసిన సూసైడ్ నోట్లో విషయాలపై విచారణ జరిపిస్తామన్నారు. కుటుంబ సభ్యులకు ఏ సమాచారం తెలిసినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మధునాయుడు, పలువురు టీడీపీ నేతలు ఎంపీడీఓ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఏలూరు కాలువలో విస్తృతంగా గాలిస్తోంది. గురువారం రాత్రికి కూడా ఆయన ఆచూకీ తెలియలేదు. శుక్రవారం గాలింపు చర్యలు చేపడుతామని పెనమలూరు సీఐ టి.వి.వి.రామారావు తెలిపారు. -
AP POLYCET 2023 Exam: నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష బుధవారం (నేడు) జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పాలిసెట్‌కు మొత్తం 1,59,144 మంది దరఖాస్తు చేశారని వివరించారు. వీరిలో 96,429 మంది బాలురు, 62,715 మంది బాలికలు ఉన్నారన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 21 వేల దరఖాస్తులు పెరిగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో 26,698 మంది ఎస్సీ, 9113 మంది ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఉచితంగా కోచింగ్ అందించాం.. పాలిటెక్నిక్ విద్యతో ప్రయోజనాలు, ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ద్వారా పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు నాగరాణి తెలిపారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 9 వేల మంది విద్యార్థులకు పాలిసెట్‌కు ఉచితంగా కోచింగ్ అందించి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా మరో మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 29 బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందిస్తున్నామన్నారు. కాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులు ఈ ఏడాది నాలుగు వేలకు పైగా ప్లేస్మెంట్లు సాధించారని వెల్లడించారు. -
పాలిసెట్ ఎంట్రన్స్‌కు ఫ్రీ కోచింగ్
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్–2023 ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పాలిసెట్ తొలివిడత కోచింగ్ ఈ నెల 17న ప్రారంభించగా.. 24వ తేదీ నుంచి మరో బ్యాచ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన ప్రతి విద్యారి్థకి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియంలలో ఉచిత స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నారు. మే 10న పాలిసెట్ మే 10న రాష్ట్రవ్యాప్తంగా 61 పట్టణాల్లోని 410 కేంద్రాల్లో పాలిసెట్–2023 నిర్వహిస్తున్నామని నాగరాణి పేర్కొన్నారు. పరీక్షకు సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన టెన్త్ సిలబస్ నుంచి గణిత శాస్త్రంలో 50 మార్కులు, భౌతిక శాస్త్రంలో 40 మార్కులు, రసాయన శాస్త్రంలో 30 మార్కులు మొత్తం కలిపి 120 మార్కులకు రెండు గంటల కాల పరిమితిలో పరీక్ష ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు రూ.100 ప్రవేశ రుసుమును సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో లేదాhttps:// polycetap.nic.in వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5గంటల లోపు చెల్లించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 176 ప్రైవేట్ పాలిటెక్నిక్‌లతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న బేతంచర్ల (నంద్యాల జిల్లా), మైదుకూరు (కడప జిల్లా), గుంతకల్లు (అనంతపురం జిల్లా) ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు పొందగలుగుతారని వివరించారు. బాలికల కోసం ప్రత్యేకంగా 10 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లు, 2 మైనారిటీ పాలిటెక్నిక్‌లు.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం 9 ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. స్కాలర్ షిప్ సదుపాయమూ ఉంది అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడు సంవత్సరాల ప్రగతి స్కాలర్ షి ప్ లభిస్తుందని నాగరాణి పేర్కొన్నారు. పాలిసెట్–2023 ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులందరికీ స్కాలర్ షిప్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్లు 08645293151, 7901620551/557/567లలో సంప్రదించాలని సూచించారు. -
స్వైన్‌ప్లూతో గర్భిణీ మృతి
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఓ గర్భిణీ స్వైన్‌ప్లూతో బుధవారం మృతి చెందింది. వివరాలు.. కొమరంభీం జిల్లా బెజ్జూరుకు చెందిన నాగరాణి(23) ఆరు నెలల గర్భవతి. స్వైన్‌ప్లూతో ఈ నెల 13న ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు బుధవారం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాంధీలో మరో వ్యక్తి స్వైన్‌ప్లూకు చికిత్స తీసుకుంటున్నారు. -
నటిని నమ్మించి మోసం చేసిన హీరో అరెస్ట్
హైదరాబాద్(బంజారాహిల్స్): పెళ్ళి చేసుకుంటానని సహనటిని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసినందుకు గాను సినీ హీరో నగేష్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక యాద్గీర్ జిల్లా వాజిఖానాపేట గ్రామానికి చెందిన నగేష్ ‘పక్కాప్లాన్’ అనే సినిమాలో రెండో హీరోగా నటించాడు. అతడికి జోడీగా నాగరాణి నటించింది. ఈ సందర్భంగా వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే ఆరేళ్ల కూతురు ఉన్న నాగరాణిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన నగేష్ ఆమెతో కలిసి శ్రీకృష్ణానగర్‌లో సహజీవనం చేశాడు. గత కొన్ని రోజులుగా నగేష్ ముఖం చాటేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు నాగరాణి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.