నటిని నమ్మించి మోసం చేసిన హీరో అరెస్ట్‌ | tollywood cinema actor arrested in hyderabad | Sakshi
Sakshi News home page

నటిని నమ్మించి మోసం చేసిన హీరో అరెస్ట్‌

Published Fri, Feb 17 2017 5:06 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

నటిని నమ్మించి మోసం చేసిన హీరో అరెస్ట్‌ - Sakshi

నటిని నమ్మించి మోసం చేసిన హీరో అరెస్ట్‌

హైదరాబాద్‌(బంజారాహిల్స్‌):
పెళ్ళి చేసుకుంటానని సహనటిని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసినందుకు గాను సినీ హీరో నగేష్‌ యాదవ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక యాద్గీర్‌ జిల్లా వాజిఖానాపేట గ్రామానికి చెందిన నగేష్‌ ‘పక్కాప్లాన్‌’ అనే సినిమాలో రెండో హీరోగా నటించాడు. అతడికి జోడీగా నాగరాణి నటించింది. ఈ సందర్భంగా వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

అప్పటికే ఆరేళ్ల కూతురు ఉన్న నాగరాణిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన నగేష్‌ ఆమెతో కలిసి శ్రీకృష్ణానగర్‌లో సహజీవనం చేశాడు. గత కొన్ని రోజులుగా నగేష్‌ ముఖం చాటేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు నాగరాణి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement