కౌన్సిలర్‌పై దాడిని అడ్డుకున్న రోజా
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని టీడీపీకి చెందిన పట్టణ కౌన్సిలర్లు ఉన్నతాధికారులను పట్టుబడ్టారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాంతో ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య నెలకొన్న గోడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ క్రమంలో ఇటీవల టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కౌన్సిలర్ హరిహరన్పై దాడి చేసేందుకు టీడీపీ కౌన్సిలర్లు యత్నించారు.
ఆ సమావేశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే రోజా అడ్డుకున్నారు. దాంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఇరుపార్టీల మధ్య వాగ్వివాదాలతో సమావేశం అర్థాంతరంగా సమావేశం ఆగిపోయింది. ఆగ్రహాం చెందిన టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నుంచి ఎమ్మెల్యేను బయటకు రాకుండా కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే రోజాను అక్కడి నుంచి పంపివేశారు.