nagasai
-
విచక్షణ కోల్పోయి మిత్రుడిని హతమార్చి.. ఇంట్లోనే సగం కాల్చి..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: ఒక పురోహితుడిని అతడి సహచరుడే హతమార్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేరం బయట పడకుండా నిందితుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన కంచభట్ల నాగసాయి అలియాస్ వెంకటేష్ (24), నాగపవన్ (19) స్నేహితులు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. పౌరోహిత్యం చేసుకుంటూ కోలమూరు గ్రామ పంచాయతీ పరిధి బొమ్మన కాలనీలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దగ్గరకు తరచూ చరణ్, నందా, షణ్ముఖ్ కార్తీక్ అనే స్నేహితులు వస్తుంటారు. ఖర్చులు ఎక్కువ చేస్తున్నావంటూ నాగపవన్ను ఇటీవల నాగసాయి మందలిస్తున్నాడు. కొన్నిసార్లు కొడుతున్నాడు. గత నెల 24న ఖర్చుల విషయంపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన నాగపవన్.. చాకుతో నాగసాయిని మెడ మీద, పొట్టలో పొడిచాడు. తీవ్ర గాయాలతో నాగసాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత మిత్రుడి మృతదేహాన్ని వదిలేసి నాగపవన్ వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చేందుకు ప్రయత్నించాడు. పూర్తిగా కాలకపోవడంతో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. తిరిగి శుక్రవారం (ఈ నెల 3) సాయంత్రం మరో స్నేహితుడితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) మృతదేహంపై దుప్పట్లు వేసి కాల్చేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుర్వాసన రావడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నాగపవన్ మృతదేహాన్ని బాత్రూములో పడేసి, పంది చనిపోయినట్టుందని చెప్పి ఆదరాబాదరాగా జారుకున్నారు. వారి తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు రాజానగరం పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం అర్ధరాత్రి రాజానగరం ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వై.సుధాకర్లు ఆ ఇంటిని పరిశీలించారు. సగం కాలిన శవం బాత్రూములో పడి ఉండటాన్ని గుర్తించారు. శనివారం ఉదయం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ వచ్చి స్థానికులను ఆరా తీశారు. తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ యువకులు దారితప్పినట్లు గుర్తించారు. వ్యసనాలకు బానిసైనట్లు భావిస్తున్నారు. నాగసాయి కొంతకాలం యాక్టింగ్పై మక్కువతో మైసూరు తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. నిందితుడు నాగపవన్తో పాటు ఉన్న స్నేహితులెవరనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రవికుమార్ తెలిపారు. చదవండి: (కన్నీళ్లు మిగిల్చిన వేడినీళ్లు) -
బాలిక మిస్సింగ్.. ఆందోళనలో తల్లి
విజయవాడ: నగరంలో ఓ మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి బయటికెళ్లిన కూతురి ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లి కలవరపాటుకు గురవుతోంది. కిడ్నాప్ చేసి బంధించారేమోనని భయాందోళన చెందుతోంది. వివరాలు.. స్థానికంగా ఉన్న భారతీనగర్లో తల్లిదండ్రులతో కలిసి నాగసాయి దుర్గ(16) నివాసముంటోంది. బెజవాడ మాచవరంలోని ఎస్ఆర్ఎస్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో నాలుగు రోజుల క్రితం విజయవాడ రామలింగేశ్వర్నగర్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కాలేజీ రీఓపెన్ కావడంతో ఈరోజు(గురువారం) ఉదయం 7 గంటలకు అమ్మమ్మ ఇంటి నుంచి భారతీనగర్కు కాలినడకన బయలు దేరింది. ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయింది. భారతీనగర్లోని ఇంటికి చేరుకోవాలంటే కిలో మీటర్ వరకు నడిచి వచ్చి షేర్ ఆటోలో ఇంటికి బయలుదేరి రావాలి. ఐతే 9 గంటలు దాటినా సాయిదుర్గ ఇల్లు చేరలేదు. దీంతో తల్లిలో ఆందోళన మొదలైంది. తెలిసిన వాళ్ల దగ్గర వాకబు చేసినా ఫలితం లేకపోయింది. కచ్చితంగా తన బిడ్డను కిడ్నాప్ చేసి ఉంటారని తల్లి అనుమానిస్తోంది. ఈ మేరకు పడమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కేసు మిస్టరీని చేధిస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. -
బెజవాడలో సాప్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
-
రంగారెడ్డికి టీమ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సబ్ జూని యర్, జూనియర్ అక్వాటిక్స్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు టీమ్ టైటిల్ సొంతం చేసుకుంది. విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా స్విమ్మర్లు 19 అంశాల్లో అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్య ఫలితాలు ఇలా ఉన్నాయి. గ్రూప్-1 బాలికలు: 100 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. ఆత్మిక కృష్ణన్ (రంగారెడ్డి-1ని:15.64 సెకన్లు), 2. సాయిశ్రీ (కృష్ణా), 3. అలేఖ్య (కరీంనగర్). 50 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. ఆత్మిక కృష్ణన్ (రంగారెడ్డి-32.01 సెకన్లు), 2. సాయిశ్రీ (కృష్ణా), 3. మేఘాంజలి (తూర్పు గోదావరి). 200 మీటర్ల బటర్ఫ్లయ్: 1. యు.శ్రేష్ట (రంగారెడ్డి-3ని:50.56 సెకన్లు), 2. శ్రీ రమ్య (పశ్చిమ గోదావరి). 1500 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. యు.శ్రేష్ట (రంగారెడ్డి-25ని:03.07 సెకన్లు), 2. కె.ఎస్.భవ్య (హైదరాబాద్). గ్రూప్-2 బాలుర 800 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. నాగసాయి (రంగారెడ్డి-11ని:05.62 సెకన్లు), 2. గురుహంత్ సాయి (హైదరాబాద్), 3. తేజస్విన్ (ఖమ్మం), తారకరామ్ (రంగారెడ్డి). 50 మీటర్ల బటర్ఫ్లయ్: 1. మొహిత్ రాజ్ (రంగారెడ్డి-30.15 సెకన్లు), 2. గౌతమ్ సూర్య (రంగారెడ్డి), 3. మునిశేఖర్ (కడప). 100 మీటర్ల ఫ్రీస్టయిల్: 1. గురుహంత్ సాయి (హైదరాబాద్-1ని:12.99 సెకన్లు), 2. శివ సాకేత్ (నిజామాబాద్), 3. సాయి లక్ష్మణ్ (రంగారెడ్డి), సాయి కుమార్ (విశాఖపట్నం).