Nagender donation
-
ఖైరతాబాద్ నియోజకవర్గం: ఈసారి అధికారం ఎవరిది?
ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈ సారి మాజీ మంత్రి దానం నాగేందర్ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, 2014లో గెలిచిన చింతల రామచంద్రారెడ్డిపై 28402 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. నాగేందర్ గతంలో మూడుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన కూడా గెలిచారు. 2009-2014 మధ్య కాంగ్రెస్ ఐ మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ఐ పక్షాన పోటీచేసి ఓటమి చెందిన తర్వాత కొంతకాలానికి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిక్కెట్ పొంది విజయం సాదించారు. కాగా ఇక్కడ మహాకూటమిలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన దాసోజు శ్రావణ్ సుమారు 33500 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు. నాగేందర్‌కు 63063 ఓట్లు రాగా, చింతల రామచంద్రారెడ్డికి 34666 ఓట్లు వచ్చాయి. నాగేందర్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఖైరతాబాద్‌లో ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు, నాలుగుసార్లు బిసి (మున్నూరుకాపు)నేతలు గెలవగా రెండుసార్లు వెలమ, ఒకసారి వైశ్య సామాజికవర్గం గెలిచాయి. నగరంలో ప్రాధాన్యత కలిగిన ఖైరతాబాద్ నియోజకవర్గం 1967 నుంచి ఏర్పడిరది. కాంగ్రెస్. కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి ఒకసారి టిఆర్ఎస్ ఒకసారి గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. కాంగ్రెస్ ఐ ప్రముఖుడు పి. జనార్దనరెడ్డి ఐదుసార్లు గెలుపొందగా, 1967-72 టరమ్‌లో ఎన్.కృష్ణారావు ఉప ఎన్నికలోను, ఆ తర్వాత సాధారణ ఎన్నికలోను గెలిచారు. పి. జనార్ధన్‌రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి గెలిచారు. తదుపరి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. నగరంలో గతంలో ముఖ్యనేతగా ప్రసిద్ది వహించిన బి.వి.గురుమూర్తి ఒకసారి ఇక్కడ గెలవగా, అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంటు నుంచి రెండుసార్లు విజయం సాధించారు. ఇక్కడ గెలిచినవారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా మంత్రి పదవులు నిర్వహించడం విశేషం. బి.వి.గురుమూర్తి గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేయగా, పి.జనార్దనరెడ్డి 1981లో టి.అంజయ్య, 82లో భవనం వెంకట్రామ్ల మంత్రి వర్గాలలోను, 1991, 92లలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలోను బాధ్యతలు నిర్వహించారు. ఎమ్.రామచంద్రరావు 1983లో ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో ఉన్నారు.1984 తెలుగుదేశం సంక్షోభంలో రామచంద్రరావు నెలరోజుల నాదెండ్ల క్యాబినెట్లో కూడా పనిచేశారు. కె. విజయరామారావు 1999 ఎన్నికల తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. బి.వి.గురుమూర్తి1954లో రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. దానం నాగేందర్ అంతకుముందు ఆసిఫ్‌నగర్‌లో మూడుసార్లు గెలిచారు. నాగేందర్ 2004లో టిడిపి పక్షాన పోటీ చేసి గెలుపొందడం విశేషం. అయితే కాంగ్రెస్ ఐ అధికారంలోకి రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, టిడిపికి రాజీనామా చేసి తిరిగి అసిఫ్‌నగర్‌లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 2009లో ఖైరతాబాద్‌లో గెలిచాక వైఎస్ క్యాబినెట్లో, తదుపరి రోశయ్య, కిరణ్ క్యాబినెట్ లలో పనిచేశారు. 2014లో ఓడిపోయారు. 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. 1999లో కెసిఆర్‌కు బదులుగా విజయరామారావుకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర చరిత్రే మారిపోయిందన్న అబిప్రాయం ఉంది. అసంతృప్తికి గురైన కెసిఆర్ తదుపరి కొంతకాలం ఉప సభాపతిగా ఉండి, ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టిఆర్ఎస్ ను స్థాపించి, తెలంగాణ రాష్ట్ర సాదనలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. విజయరామారావు సిబిఐ డైరెక్టర్‌గా రిటైర్ అయిన తర్వాత టిడిపిలో చేరి ఖైరతాబాద్‌లో గెలిచి మంత్రి అయ్యారు. ఆ విధంగా రాష్ట్ర విభజనకు ఇది ఒక కీలకమైన మలుపుగా చెబుతారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
‘దానం పెత్తనం వద్దు
ఏఐసీసీ ముందు పేచీ పెట్టిన రంగారెడ్డి నేతలు సిటీబ్యూరో: ‘ మాపై ఇతర నాయకుల పెత్తనం వద్దే వద్దు. బలవంతంగా దానం నాగేందర్ ఇతర నాయకులను రుద్ది మమ్మల్ని పార్టీకి దూరం చేయొద్దు. స్థానికంగా బలం, పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకులకు న్యాయం చేసే విధంగా వ్యవహరించండి’ అంటూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఏఐసీసీకి నేతలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు క్యామ మల్లేష్ ఆధ్వర్యంలో ఎంఎల్ఏ రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎంఎల్ఏలు సుధీర్‌రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ప్రసాద్‌కుమార్, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్లతో పాటు ఆయా నియోకవర్గాల నాయకులు బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ నగర కమిటీ, రంగారెడ్డి జిల్లా కమిటీలను వేర్వేరుగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని, తాము హైదరాబాద్ నగర కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ ఆధ్వర్యంలో పని చేయలేమని వారు తేల్చి చెప్పారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బూత్, డివిజన్ స్థాయి కార్యకర్తల ఆమోదం మేరకు నియోజకవర్గాల బాధ్యులు అభ్యర్థులను సూచిస్తారని రంగారెడ్డి నేతలు చేసిన ప్రతిపాదనకు దిగ్విజయ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం నియోకజవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మల్రెడ్డి రాంరెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని వారు దిగ్విజయ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేయగా, పీసీసీ అధ్యక్షుడితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్‌లోనే కొనసాగుతా..
ఆ వార్తలు అవాస్తవం మాజీ మంత్రి దానం నాగేందర్ బంజారాహిల్స్ : తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. తమ పార్టీలోనే కొందరు నేతలు పొమ్మనలేక పొగబెడుతూ అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆరోపించారు. అధిష్టానం కూడా చెప్పుడు మాటలు వినడం మానేయాలని ఇలా వినడం వల్లే పార్టీ చాలా నష్టపోయిందని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకర్ష్ పథకాన్ని పక్కనబెట్టి ప్రజా సంక్షేమం వైపు దృష్టిసారించాలని హితవు పలికారు. ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలోనే వాడవాడలా పర్యటిస్తామని చెప్పారు. నగరంలోని సీమాంధ్రులు వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో కూడా గత తప్పిద నిర్ణయాలు తీసుకుంటే మరోమారు మోసపోక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబును గెస్ట్ అంటున్న అధికార పార్టీ, రేపు ఎన్నికలయ్యాక సీమాంధ్రులను కూడా అతిథులుగానే చూసి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి పార్టీని నిలువునా ముంచిపోయాడని ఆరోపించారు. దివంగత వైఎస్సార్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు తగిన ప్రాధాన్యం లభించిందని వెల్లడించారు. -
ముగిసిన ‘మేధోమథనం’
ఇబ్రహీంపట్నం రూరల్: కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ సదస్సు సోమవారం ముగిసింది. మండల పరిధిలోని శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కళాశాల ప్రాంగణంలో రెండోరోజు సదస్సు ఉదయం 10:45 నిమిషాలకు ప్రారంభమైంది. మొదటగా మాజీ మంత్రి దానం నాగేందర్ స్వాగతోపన్యాసం ఇచ్చారు. ఐదు రోజులుగా మేధోమథన సదస్సు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులు దానం నాగేందర్, సుధీర్‌రెడ్డి, క్యామ మల్లేష్ తదితరులకు ధన్యవాదాలతో సభ ప్రారంభమయింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సదస్సు ప్రారంభంలో ఉండి అగ్ర నాయకులకు ఆహ్వానం పలికారు. మేరా దోస్త్ ఆగయా..: సదస్సు ప్రారంభం కాకముందు మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి బయట నిలుచున్నప్పుడు అటుగా జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి తన కారులో వస్తుండగా అక్కడున్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి జీవన్‌రెడ్డిని చూస్తూ.. మేరా దోస్త్ ఆగ యా అన్నారు. కారు దిగిన జీవన్‌రెడ్డి.. ఎలా ఉన్నావు దోస్త్ అంటూ ఆప్యాయంగా పలకరించారు. దీంతో అక్కడున్న నాయకులు వారిద్దరి స్నేహం గురించి చర్చించుకున్నారు. సోనియా త్యాగం చేశారు: డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ సదస్సులో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ప్రసంగిస్తూ.. సోనియా గాంధీకి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ఆమె ఆ పదవిని త్యాగం చేశారని అన్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి చేతి గుర్తుపై పోటీ చేసిన సుమిత్రాదేవి భారీ మెజార్టీతో గెలిచారని.. అప్పుడు ఇందిరాగాంధీ పేరుతో ప్రభంజనం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వాల కంటే పార్టీ గొప్పదన్నారు. ప్రతీ కార్యకర్తా పార్టీ కోస శ్రమించి పనిచేయాలని పిలుపునిచ్చారు. సదస్సును జయప్రదం చేసిన కార్యకర్తలకు, నాయకులుకు కృతజ్ఙతలు తెలిపారు. సోనియాకు బహుమతిగా ఇవ్వాలి: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో గెలుపొంది.. ఆ విజయాన్ని సోనియాగాంధీ బహుమతిగా ఇవ్వాలని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్తా క్షేత్ర స్థాయలో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్సేనని ప్రజలకు తెలుసన్నారు. ప్లీజ్ ఒక్క ఫొటో.. : మేధోమథన సదస్సు ముగిసిన అనంతరం కళాశాల విద్యార్థులు, పార్టీ కార్యకార్తలు నాయకుతో పోటీ పడి ఫొటోలు దిగారు . నాయకులు సదస్సు ప్రాంగణంలో తిరిగి కార్యకర్తలను ఉత్తేజపరిచారు.