బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు
ఆర్టీసీ సీటీఎం సత్యనారాయణ
నాయుడుపేటటౌన్: నాయుడుపేట ఆర్టీసీ రూరల్ బస్టాండ్‌ను ఆధునీకరించేలా నిధులు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండులో మంగళవారం ఆయన తనిఖీలు చేపట్టారు. బస్టాండు కంట్రోల్ పాయింట్ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి బస్సుల రాకపోకల వివరాలను తెలుసుకున్నారు. అలాగే బస్టాండు ఆవరణంలో ఖాళీగా ఉన్న దుకాణాలు, నిరుపయోగంగా ఉన్నవాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయుడుపేట రూరల్ బస్టాండుకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆధునికీకరణ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, కంట్రోలర్లు టీఎస్ బాబు, ఎంసీ బాబులు ఉన్నారు.